హరిహరేశ్వర్ లో కాలభైరవ దేవాలయం పురాతనము మరియు ప్రసిద్ధిగాంచిన దేవాలయం. మహారాష్ట్రలోనే ఒక ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. అందరికి తెలిసిన యాత్రాస్ధలం. ఏటా భక్తులు అధిక సంఖ్యలో దీనిని దర్శిస్తారు. ఈ దేవాలయం శివభగవానుడికి అంకితమైంది. ఇక్కడ కల ఇతర విగ్రహాలలో కాలభైరవుడిది కూడా ఒకటి. కాలభైరవుడు మంత్ర శాస్త్రాలకు అధిపతి అని చెపుతారు. శివ భగవానుడు కాలభైరవుడిని సృష్టించి ఆయనకు అన్ని మంత్రాలను ప్రసాదించాడని ఇతిహాసాలు చెపుతాయి.
దేవాలయ శిల్పకళ ఆకర్షణీయం. దక్షిణ కాశిగా పిలువబడే యోగేశ్వరి దేవాలయం కూడా ఇక్కడే దగ్గరలో చూడవచ్చు. మహాశివరాత్రి వంటి పండుగ సందర్భాలలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు. దీని వెనుక భాగంలో చూసే హరిహరేశ్వర బీచ్ దేవాలయానికి మరింత అందాలను తెచ్చి పెడుతుంది.



Click it and Unblock the Notifications