ఉమేద్ తోటలను ఉమేద్ సింగ్ మహారాజు నిర్మించారు. 82 ఎకరాలలో వ్యాపించి ఉన్న ఈ తోటలో అశోక చెట్లు, పచ్చిక బయళ్ళు, ఫౌంటెన్ లు, ఒక లైబ్రరీ, జంతుప్రదర్శన శాలలను పర్యాటకులు చూడవచ్చు. పర్యాటకులు వివిధ దిశల్లో ఉన్న ఐదు ద్వారాల్లో దేని ద్వారానైనా ఈ తోటలోకి ప్రవేశించవచ్చు.
ఆకర్షణీయమైన గులాబీలు, ఆయా ఋతువుల్లో పూసే పూలతో ఈ తోట అందం ఇనుమడిస్తుంది. వైస్రాయ్ విల్లింగ్టన్ ప్రారంభించిన ఈ జంతు ప్రదర్శనశాల లో సింహాలు, పులులు, గాడిదలు, నిప్పుకోళ్ళు, ఈమూలు, కుందేళ్ళు, పావురాళ్ళు, మొసళ్ళు, నక్కలు, జింకలు, చిరుతలు వుంటాయి. తోటలోపల వివిధ ఆఫ్రికన్, ఆస్త్రేలియన్ చిలుకలను ఉంచే 1978 లో నిర్మించబడిన పక్షిశాలను పర్యాటకులు చూడవచ్చు.



Click it and Unblock the Notifications