Search
  • Follow NativePlanet
Share

కలాడి - ఒక అద్భుత ప్రదేశం

20

కలాడి గ్రామం పెరియార్ నది సమీపంలో కలదు. ఈ గ్రామం భౌగోళికంగా కేరళలోని ఎర్నాకుళంలో కలదు. ఈ ప్రదేశం జగద్గురువు ఆదిశంకరులవారి జన్మస్ధలం.

ఈ ప్రదేశం దేశవ్యాప్తంగా ఒక యాత్రా స్ధలంగా ప్రసిద్ధి గాంచింది. ప్రత్యేకించి ఆది శంకరాచార్య మతాన్ని ఆచరించేవారందరకు ఇది పవిత్ర స్ధలం. 1910 సంవత్సరంలో ఇక్కడ ఆది శంకరుల వారికి ఒక దేవాలయం ఏర్పరచారు. కలాడీ అంటే పాద ముద్ర అని అర్ధం. ఈ గ్రామాన్ని మొదటిలో ససలాం అనేవారు. కలాడి శతాబ్ది ఉత్సవాలు 2010 సంవత్సరంలో నిర్వహించినట్లు పత్రికలు పేర్కొంటాయి.

ఒక ఆసక్తికర ఇతిహాసం

ఈ పట్టణం లోని ఆదిశంకరుల, వారి తల్లి గార్లగురించి ఎన్నో కధలు చెప్పుకుంటారు. పెరియార్ నదిని గతంలో పూర్ణ నది అనేవారు. నది శంకరాచార్య మరియు ఆయన తల్లి ఉన్న స్ధలానికి దూరంగా ఉండేది. ఒక రోజున ఆయన తల్లి స్నానాకికి నదికి వెళుతూ మధ్యలో మూర్ఛిల్లింది. నిస్సహాయుడైన శంకరుడు శ్రీక్రిష్ణుడిని ప్రార్ధించాడు. ప్రార్ధనలు వినిన శ్రీ క్రిష్ణుడు, దయతలచి ఆయనను ఆశీర్వదించాడు. శంకరులవారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నది ప్రవహిస్తుంది అని పలికాడు. క్రిష్ణుడి ఆశీస్సుల ఫలితంగా, నది ఆ చిన్ని శంకరుడి ఇంటి తోటలోకి కూడా ప్రవహించింది. అపుడు శంకరాచార్యులు క్రిష్ణుడికి ఒక చిన్న దేవాలయం కట్టించి పేరు పొందిన అచ్యుతాష్టకాన్ని పఠించారు. ఈ ప్రదేశంలో ప్రధాన ఆకర్షణలు అంటే దేవాలయాలు, ఆశ్రమాలు. వాటిలో రామక్రిష్ణాశ్రమం, కలిల్ దేవి దేవాలయం, శ్రింగేరి మఠం సముదాయం, మహదేవ దేవాలయం, వనమూర్తి దేవాలయం, కుజుప్పిల్ క్కవే జలదుర్గ దేవాలయం మొదలైనవి ప్రసిద్ధి గాంచినవి.

కలాడి సందర్శనకు మంచి సమయం ఎపుడు?

కలాడి సందర్శనకు ఆగస్టు నుండి మార్చి వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ సమయం చల్లగా వుండి పర్యాటకులకు హాయిగా ఉంటుంది. కలాడి ప్రదేశానికి దక్షిణ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలనుండి రోడ్డు, రైలు మరియు వాయు మార్గ సౌకర్యాలు కలవు.

కలాడీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కలాడీ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కలాడీ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కలాడీ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం కేరళ నుండి కలాడికి నేరు బస్సులు కలవు. ప్రభుత్వ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రయివేటు బస్సుల ప్రయాణం కూడా ఆనందకరంగానే ఉంటుంది. సూపర్ డీలక్స్ బస్సులు కలాడీ నుండి ఇతర నగరాలకు కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం సమీప రైలు స్టేషన్ ఆలువ (కలాడి 18 కి.మీ. ). ఇక్కడనుండి దేశంలోని చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ మరియు ముంబై వంటి ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. అన్ని ప్రధాన నగరాల రైళ్ళు ఇక్కడ నిలుస్తాయి. రైలు ప్రయాణం తక్కువ వ్యయం.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    కలాడికి సమీప విమానాశ్రయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 7 కి.మీ.ల దూరంలో కలదు. ఈ విమానాశ్రయం దేశంలోని ఇతర విమానాశ్రయాలకు, విదేశాలకు కలుపబడి ఉంది. విమానాశ్రయం నుండి ప్రయివేటు టాక్సీలు కూడా లభ్యమవుతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed