Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కర్జాత్

కర్జాత్  - పచ్చటి ప్రాంతం

7

మహారాష్ట్రలోని రాయ్ గడ్ జిల్లాలో కర్జాత్ ఒక పట్టణం మరియు ఉప జిల్లా. కర్జాత్ పట్టణం మనోహరమైనది. పర్వత ప్రాంతంగా ఉంటుంది. ఈ పట్టణం గంభీరమైన సహ్యాద్రి కొండలనుండి, పడమటి కనుమలు మరియు భోర్ ఘాట్ వరకు విస్తరించి ఉంటుంది. ఇది ఉల్లాస్ నదీ తీరంలో కొంకణ్ ప్రాంతంలో కలదు. కర్జాత్ లో పూర్తిగా పచ్చటి ప్రాంతాలు కనపడతాయి. అదే సమయంలో రాతి ప్రదేశంగా ఉండి వర్షాకాలంలో ఆకర్షణీయ అందాలతో ఎన్నో జలపాతాలు కూడా ఇక్కడ మీకు దర్శనమిస్తాయి.

సాహస పర్యటనకు ఒక కేంద్రం కర్జాత్ పట్టణం ముంబై నగరానికి సుమారు 67 కి.మీ.ల దూరంలో ఉంటుంది. నగర జీవితంతో విసుగెత్తిన వారికి, సాహస క్రీడలు ఆచరించాలనుకునేవారికి ఈ ప్రదేశం ఎంతో బాగా నచ్చుతుంది. కర్జాత్ ను మహారాష్ట్ర అనధికార క్రీడా రాజధానిగా గుర్తించారు. అందమైన ఈ హిల్ స్టేషన్ లో మీ ఎడ్రినాలిన్ అధికమయ్యే సాహస చర్యలు ఎన్నో ఉన్నాయి.

కర్జాత్ ట్రెక్కింగ్ కు అనుకూల ప్రదేశం. సవాలుతో కూడిన ఎన్నో ట్రెక్కింగ్ ప్రదేశాలు కలవు. ట్రెక్కింగ్ ప్రియులకే కాదు ప్రకృతి ప్రేమికులకు కూడా ఎంతో ఇష్టపడే ప్రదేశం.   ఉల్లాస్ నదిలోని తెల్లటి నీటిలో ర్యాఫ్టింగ్ క్రీడ ఆనందంగా ఉంటుంది. ఇక్కడి పురాతన చారిత్రక కట్టడాలైన పేధ్ కోట లేదా బౌద్ధమత కట్టడాలు, కొండన గుహలు వంటివి తప్పక చూడదగిన ప్రదేశాలు. గుహలలోని శిల్ప కళా సంపద, పెయింటింగులు చరిత్ర ప్రియులకు, పురావస్తు ప్రియులకు ఆనందం కలిగిస్తాయి. చుట్టుపట్ల ప్రదేశాలను అమితంగా ఇష్టపడవచ్చు.

సముద్ర మట్టానికి 200 మీటర్ల ఎత్తునకల ఈ పట్టణం ఎంతో సాంప్రదాయకమైనది. చారిత్రక ప్రాధాన్యత కలిగినది. విశ్రాంతి కోరేవారికి అతి తక్కువ రోజుల వ్యవధిలో పర్యటించదగినది.   కర్జాత్ - ఆకర్షణలు

కర్జాత్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కర్జాత్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కర్జాత్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కర్జాత్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం కర్జాత్ నుండి మహారాష్ట్రలోని వివిధ ప్రదేశాలకు రాష్ట్రం వెలుపల పట్టణాలకు ప్రభుత్వ మరియు ప్రయివేటు బస్సులు కలవు. ముంబై, పూనే, పాన్వెల్, మరియు కర్జాత్ ల మధ్య ప్రతిరోజూ బస్ ల రాకపోకలు కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం కర్జాత్ ఒక ప్రధాన రైలు స్టేషన్. ముంబై డివిజన్ లో కలదు. ఈ రైలు స్టేషన్ నుండి మహారాష్ట్రలోని వివిధ ప్రదేశాలకు మరియు మహారాష్ట్ర వెలుపల నగరాలకు రైళ్ళు నడుస్తాయి. రైలు స్టేషన్ నుండి కర్జాత్ పట్టణం టాక్సీలలో చేరవచ్చు. కర్జాత్ నుండి లోనావాలా మరియు ఖండాలా పట్టణాలకు కూడా రైళ్ళు కలవు. పూనా నుండి కూడా కర్జాత్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    కర్జాత్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం కర్జాత్ కు 69 కి.మీ.ల దూరంలో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడినుండి దేశంలోని వివిధ ప్రదేశాలకు విదేశాలకు కూడా విమాన రాకపోకలు కలవు. విమానాశ్రయం నుండి కర్జాయ్ టాక్సీలలో చేరవచ్చు. ఛార్జీలు సుమారుగా రూ.1700గా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu