నగ్గర్ లో వున్న ప్రముఖ ధార్మిక క్షేత్రం గౌరీ శంకర దేవాలయం. ఈ దేవాలయాన్ని 11, 12 శతాబ్దాలలో నిర్మించారు. శివుడి కోసం నిర్మించిన ఈ దేవాలయం గుజారా-ప్రతీహార సాంప్రదాయం ప్రకారం నిర్మించిన చివరి దేవాలయమని నమ్ముతారు.
రాతి శిల్పాలు, వినాయకుడు, పూలు, సంగీత నృత్య కళాకారుల విగ్రహాలతో అలంకరించిన గర్భ గుడి ముందు భాగం ఈ దేవాలయం లోని ప్రధాన ఆకర్షణలు. ఈ దేవాలయాన్ని ఎత్తైన వేదిక మీద చతురస్రాకారపు మట్టం మీద పైన గోపురం వచ్చేలా పిరమిడ్ ఆకారంలో నిర్మించారు.



Click it and Unblock the Notifications