Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కుంబకోణం

కుంబకోణం - దేవాలయాలు పుట్టిన పట్టణం !

37

అందమైన కుంబకోణం పట్టణం సమాంతరంగా ప్రవహించే రెండు నదుల మధ్య ఏర్పడింది. ఒక వైపు కావేరి మరో వైపు అరసలర్ నదులు ప్రవహిస్తాయి. కుంబకోణంకు ఉత్తరం లో కావేరి, దక్షిణం లో అరసలర్ నదులు ప్రవహిస్తాయి. ఈ చిన్న పట్టణం తమిళ్ నాడు లోని తంజావూర్ జిల్లాలో కలదు.

కుంబకోణం చరిత్ర పరిశీలిస్తే, ఈ టవున్ సంగం పాలకుల కాలం నాటిది. ఈ ప్రదేశాన్ని దక్షిణ భారత దేశం పాలించిన ప్రధాన రాజ కుటుంబాలైన చోళులు, పల్లవులు, పాండ్యులు, మదుర నాయకులూ, తంజావూర్ నాయకులూ తంజావూర్ మరాఠాలు పాలించారు. ఈ టవున్ 7వ శతాబ్దంలో ప్రాధాన్యతలో వుండేది. మరో మారు అది బ్రిటిష్ పాలనలో అత్యధిక ప్రాధాన్యతను, వైభవాన్ని పొందింది. కాలాలకు, సంస్కృతికి, ఆధ్యాత్మిక విద్యలకు పేరొంది దక్షిణ భారత \దేశ కేం బ్రిజ్ విశ్వ విద్యాలంగా పేరు పడింది.

ఆలయాల పట్టణం

కుంబకోణంలో అనేక దేవాలయాలు వుండటంతో ఈ నగరాన్ని సిటీ అఫ్ టెంపుల్స్ అంటారు. కుంబకోణం మునిసిపాలిటి ప్రాంతంలో 188 టెంపుల్స్ కలవు. టవున్ కు చుట్టుపట్ల మరొక 100 టెంపుల్స్ వరకూ కలవు. కుమ్బెస్వర టెంపుల్, సారంగపాణి టెంపుల్, రామస్వామి టెంపుల్ లు ప్రసిద్ధి చెందినవి. ప్రతి సంవత్సరం ఈ టెంపుల్ టవున్ లో మహామాహం ఫెస్టివల్ జరుగుతుంది. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు కుంబకోణంకు వస్తారు.

ఈ పట్టాణాన్ని పాలించిన పాలకులు అనేక దేవాలయాలను వారి పాలనలో పట్టణం లోనే నిర్మించారు. వీరిలో చోళులు ప్రధానమైన వారు. వీరు సుమారు రెండు శతాబ్దాల పాటు కుంబకోణంను వారి రాజధాని గా చేసుకున్నారు. కుమ్బెస్వర టెంపుల్ 7వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మించ బడింది. ఈ శివాలయం టవున్ లో అతి ప్రాచీనమైనది. ఈ పట్టణాన్ని పాలించిన పాలకులు ఒకరిని మించి మరి ఒకరు ఘనమైన రీతిలో ఆలయ నిర్మాణాలను సాగించారు. కుంబకోణంలో ఒక బ్రహ్మ దేముడి దేవాలయం కూడా కలదు. ప్రపంచంలో బ్రహ్మకు అతి కొద్ది ఆలయాలు మాత్రమే కలవు. వాటిలో కుంబకోణం బ్రహ్మ దేవాలయం ఒకటి.

యాత్రికుల అభివృద్ధి.

కుంబకోణంలో హిందూ టెంపుల్స్ మాత్రమే కాక, అనేక మట్ లు కూడా కలవు. శంకర మట్, వెల్లర్ మట్ , రాఘవేంద్ర మట్ , అహోబిల మట్, వైష్ణవ మట్ వంటివి కూడా వివిధ పాలకులు నిర్మించారు. కుంబకోణం లో పట్టేస్వరం దుర్గ టెంపుల్, ఉప్పిలప్పాన్ టెంపుల్, సోమేశ్వర టెంపుల్ మరియు కంబహరేస్వర్ టెంపుల్ లు కూడా ప్రసిద్ధి చెందినవే.

ఇన్ని ఆలయాలు, మట్ లు కల కుంబకోణం హిందువులకు ప్రసిద్ధ యాత్రా క్షేత్రంగా పేరు పడింది.

వాతావరణం మరియు ప్రయాణ సౌకర్యాలు

కుంబకోణం సందర్శనకు వింటర్ నెలలు అనుకూలం. ఈ సమయంలో యాత్రికులు, మరియు పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తారు. కుంబకోణం రోడ్డు, మరియు ట్రైన్ మార్గాలలో తేలికగా చేరవచ్చు.

కుంబకోణం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కుంబకోణం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కుంబకోణం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కుంబకోణం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం కుంబకోణం నుండి తమిళ్ నాడు లోని ఇతర నగరాలకు ప్రభుత్వ బస్సులు కలవు. చెన్నై, చిదంబరం మరియు త్రిచిల నుండి నేరు బస్సులు కలవు. ప్రైవేటు మరియు ప్రీ పైడ్ టాక్సీ లు కూడా వేయి రూపాయల నుండి అందుబాటులో వుంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం కుంబకోణం రైలు స్టేషన్ నగరం మధ్యలో కలదు. ఈ పట్టణానికి రామేశ్వరం, తిరుపతి, కొల్లం మరియు చెన్నైల నుండి తరచుగా రైళ్ళు కలవు. చెన్నై రైలు స్టేషన్ నుండి కుంబకోణంకు అనేక రైళ్ళు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం కుంబకోణం కు త్రిచి ఎయిర్ పోర్ట్ సమీపం సుమారు 96 కి.మీ.ల దూరంలో వుంటుంది. స్థానిక ప్రదేశ విమానాలు నడుస్తాయి. త్రిచి మరియు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ల మధ్య అనేక విమానాలు నడుస్తాయి. ప్రైవేటు టాక్సీలు త్రిచి ఎయిర్ పోర్ట్ నుండి కుమ్బకోనానికి సుమారు వేయి రూపాయల అద్దేపై దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
15 Jun,Mon
Return On
16 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
15 Jun,Mon
Check Out
16 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
15 Jun,Mon
Return On
16 Jun,Tue