హోమ్ » ప్రదేశములు » మధురై » ఆకర్షణలు
 • 01అతిసాయం థీం పార్క్

  అతిసాయం థీం పార్క్

  అతి సాయం థీం పార్క్ మదురై కు 5 కి. మీ. ల దూరం లో కలదు. ఈ పార్క్ మదురై - దిండిగల్ హై వే లో పరవాయి వద్ద కలదు. ఈ పార్క్ సుమారు 70 ఎకరాల లో విస్తరించి వుంది. ఈ పార్క్ లో 40 ఆటలు మరియు 20 నీటి ఆటలు కలవు. వాటర్ రైడ్ లు ఈ పార్క్ లో ఒక విశేష అంశం. వాటర్ రైడ్ లు కుర్తాల్లం ఫాల్స్ నమూనా లో వుంటాయి. ఈ పార్క్ ను 2000 సంవత్సరం లో ఏర్పరచారు. దీనిని క్వీన్ అఫ్ ఇండియన్ థీం అంటారు.

  అతిసాయం థీం పార్క్ మదురై కి 5 కి.మీ.ల దూరంలో కలదు. ఇది మదురై - దిండిగల్ హై వే మార్గం లో పరవాయి వద్ద కలదు. ఈ పార్క్ 70 ఎకరాల విస్తీర్ణం లో కలదు.

  ఈ పార్క్ లో ఇతర ఆకర్షణలు ప్రవేశంలో షవర్, సింధు బాత్, బిగ్ స్ప్లాష్, వేవ్ పూల్ మరియు లాజి రివర్ వంటివి. డ్రై పార్క్ లో కొలంబస్, స్వింగ్ చైర్, బేబీ ట్రైన్, డాషింగ్ కర్, సైన్సు పార్క్, మొదలైనవి కలవు. ఈ ప్రదేశం ఉత్సాహపరులకు , సాహసికులకు, అంతులేని ఆనందాలను అందిస్తుంది.

  + అధికంగా చదవండి
 • 02తిరుమలై నాయకర్ పాలస్

  తిరుమలై నాయకర్ పాలస్ ను తిరుమలై నాయక్ 16 వ శతాబ్దంలో ఇండో సార్సెనిక్ శైలి లో నిర్మించాడు. ఈ పాలస్ లో తిరుమలై నాయకర్ మరియు సిలాపతికరం ల కు సంబంధించిన లైట్ మరియు సౌండ్ షో ఒకటి చూపుతారు. నేడు టెంపుల్ లో మీరు చూసేది అసలు దానికి గల దానిలో నాలుగో వంతు మాత్రమే.

  దీనిలో 58 అడుగుల ఎత్తు కల 248 స్తంభాలు కలవు. పాలస్ సీలింగ్ పై శ్రీ మహా విష్ణు మరియు శివ ల జీవిత గాధలు చెక్క బడి వుంటాయి. ఈ పాలస్ శిల్ప శైలి ఒక అద్భుతం. డోములు , ఆర్చీలు స్టక్కో స్టైల్ శిల్ప శైలి లో నిర్మించారు. ఆనాడు ఉపయోగించిన ఫర్నిచర్ మరియు పాత్రలు వంటివి కూడా ప్రదర్శించ బడతాయి. పాలస్ ప్రవేశం, దంచింగ్ హాల్ మరియు మెయిన్ హాల్ ప్రదేశాలు చాలా అందంగా వుంటాయి. ఈ పాలస్ ను 1860 - 1870 ల మధ్య బ్రిటిష్ వారు ఒకసారి పునరిద్ధరించారు.

  + అధికంగా చదవండి
 • 03మీనాక్షి అమ్మన్ టెంపుల్

  మీనాక్షి అమ్మన్ టెంపుల్ లేదా మీనాక్షి టెంపుల్ లో శివ భగవానుడు మరియు మీనాక్షి అనబడే మాత పార్వతి వుంటారు. ఈ టెంపుల్ మదురై లోనే కాదు, దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి. పురాణాల మేరకు మాత నివాస మైన మదురై ని శివుడు ఆమెను వివాహం చేసుకునేటందుకు సందర్శించాడు. ఈ టెంపుల్ వాగై నాడే కి దక్షిణంగా కలదు. దీనిని క్రి.శ.2500 సంవత్సరం లో నిర్మించారు. అయితే ఈ టెంపుల్ కు గల ప్రస్తుత నిర్మాణం నాయక రాజులు చేయించారు. ఈ టెంపుల్ కాంప్లెక్స్ సుమారు 6 హెక్టార్ లలో విస్తరించి వుంది. దీనికి 12 గేటు లు వుంటాయి. ఈ టెంపుల్ దాని అద్భుత శిల్పశైలి కి ప్రసిద్ధి.

  టెంపుల్ ప్రవేశ గోపురాలు సుమారు 45 - 50 మీ. ల ఎత్తులో వుంటాయి. వాటి పై దేముళ్ళు మరియు దేవతల మూర్తులు చెక్కి వుంటాయి. టెంపుల్ లో 985 స్తంభాలు, 14 గోపురాలు కలవు.

  + అధికంగా చదవండి
 • 04గోరిపలయం దర్గా

  గోరిపలయం దర్గా

  సిటీ లో గోరిపలయం దర్గా ఒక పెద్ద మసీదు. ఈ దర్గా వాగాయి నది కి ఉత్తర దిశగా కలదు. దీనిని తిరుమలై నాయక్ 13 వ శతాబ్దంలో నిర్మించారు. దర్గాలో రెండు ముస్లిం ప్రవక్తల సమాధులు కలవు. డోమ్ లు 70 అడుగుల వ్యాసం కలిగి 20 అడుగుల పొడవు కలిగి ఒకే రాతి తో చేయబడ్డాయి. దర్గా ప్రవేశం లో కల ఫలకంపై దీని స్థాపనా కాలం తెలుస్తుంది. ఈ మసీదులో ప్రతి ఏటా ఉర్స్ ఫెస్టివల్ చేస్తారు. ఈ ఫెస్టివల్ లో భక్తులు, టూరిస్టులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

  + అధికంగా చదవండి
 • 05అలగార్ కోవిల్

  అలగార్ కోవిల్

  అలగార్ కోవిల్ లో శ్రీ మహా విష్ణువు విగ్రహం వుంటుంది. ఈ టెంపుల్ సోలైమలై హిల్ దిగువన మదురై కి సుమారు 2౦ కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ మూడు శాంక్చురి లు కలవు. ఈ టెంపుల్ దాని రాతి శిల్పాలకు, చెక్కడాలకు ప్రసిద్ధి. రాతితో చెక్కబడిన పెద్ద విష్ణు విగ్రహం కలదు. విష్ణు మూర్తి వివిధ భంగిమలు కలవు. ఇక్కడ ఒక నీటి బుగ్గ కలదు. దీని నీరు ప్రతి రోజూ కృష్ణుడి కి టెంపుల్ పూజారి అర్పిస్తారు.

  ఈ టెంపుల్ లో మాత మీనాక్షి సోదరుడు అజగర్ రూపం లో లార్డ్ విష్ణు నివసిస్తాడని చెపుతారు. ఈ టెంపుల్ తప్పక చూడాలి.

  + అధికంగా చదవండి
 • 06తిరుచుజి

  తిరుచుజి మదురై సమీపం లో ఒక గ్రామం. ఈ ప్రదేశం శ్రీ రమణ మహర్షి పుట్టిన ప్రదేశం. ఈయన ఇండియాలో 20 వ శతాబ్దంలో బాగా ప్రసిద్ధి చెందాడు. ఈయన పేరుతో ఇక్కడ శ్రీ రమణ ఆశ్రమం కలదు.

  ఈ విలేజ్ లో శివుడి టెంపుల్ కూడా కలదు. ప్రశాంత వాతావరణం కోరే వారికి , అధ్యాత్మికులకు ఈ ప్రదేశం బాగుంతుంది.

  + అధికంగా చదవండి
 • 07కాజి మార్ బిగ్ మాస్క్

  కాజి మార్ బిగ్ మాస్క్ మదురై జంక్షన్ మరియు పెరియార్ బస్సు స్టాండ్ ల వద్ద కలదు. ఇది ఒక పురాతన మాస్క్ దీనిని హజరత్ కాజి సైడ్ తాజుద్దీన్ నిర్మించారు. ఈయన ప్రోఫెట్ మహమ్మద్ యొక్క సంతతి వాడు. 13 వ శతాబ్దానికి చెందినవాడు. ఈ మసీదు మదురై లో పురాతనమైనది. ఈ భూమిని ఆయన ఒమాన్ దేశం నుండి వచ్చినపుడు, పాండ్య రాజు కులసేఖర పాండ్య కేటాయించాడు. దాని సైజు కారణంగా దానిని పెరియ మాస్క్ లేదా బిగ్ మాస్క్ గా పిలుస్తారు. దీని సీటింగ్ సామర్ధ్యం 25౦౦ మంది వరకూ కలదు. ఇక్కడే మదురై హజరత్ యొక్క ఒక దర్గా కూడా మాస్క్ కాంప్లెక్స్ లో కలదు. ఈ దర్గా ను మదురై మకబారా అంటారు.

  + అధికంగా చదవండి
 • 08వందియూర్ మరి యమ్మన్ తెప్పకులం

  వందియూర్ మరి యమ్మన్ తెప్పకులం అనేది ఒక సరస్సు. దీనిని 1646 లో నిర్మించారు. పెద్దదైన ఈ సరస్సును తిరుమలై నాయక సుమారు 16 ఎకరాలలో నిర్మించాడు. ఈ సరస్సు మీనాక్షి టెంపుల్ కు తూర్పుగా అయిదు కి.మీ.ల దూరంలో వుంటుంది. సరస్సు మధ్యలో ఒక వినాయకుడి విగ్రహం వుంటుంది. తిరుమలై నాయకర్ పాలస్ నిర్మించేటపుడు దాని ఇటుకల తయారీలో తవ్వగా ఈ ట్యాంక్ ఏర్పడిందని చెపుతారు. తర్వాత ఈ సరస్సును అక్కడ సరైన రీతిలో నిర్మించి వినాయక విగ్రహం పెట్టారు. తెప్పకులం ఫ్లోట్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జనవరి మరియు ఫిబ్రవరి నెలలో ఈ సరస్సులో జరుపుతారు. ఈ సరస్సు లోకి నీరు వాగాయి నది నుండి వస్తుంది. ఈ సరస్సు అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

  + అధికంగా చదవండి
 • 09కూడళ్ అల్జగార్ టెంపుల్

  కూడళ్అల్జగర్ టెంపుల్ ఒక వైష్ణవ టెంపుల్. దీనిలో విష్ణు మూర్తి విగ్రహం టెంపుల్ ముందు భాగంలో వుంటుంది. ఈ టెంపుల్ నగరం మధ్యలో మెయిన్ బస్సు స్టాండ్ వద్ద కలదు. టెంపుల్ లోకల విష్ణు మూర్తి విగ్రహం కూర్చున్న, నిలుచున్న మరియు పడుకున్న భంగిమల లో వుంటుంది. టెంపుల్ లో రాముడి పట్టాభిషేకం కు సంబంధించిన చెక్క చెక్కడాలు కూడా కలవు.

  ఈ టెంపుల్ లో నవగ్రహాలు కూడా కలవు. సాధారణంగా నవగ్రహాలు శివ టెంపుల్ లో వుంటాయి. ఈ టెంపుల్ పర్యాటకులు తప్పక చూసి ఆనందించాలి.

  + అధికంగా చదవండి
 • 10మీనాక్షి అమ్మన్ టెంపుల్ మ్యూజియం

  మీనాక్షి అమ్మన్ టెంపుల్ మ్యూజియం

  మీనాక్షి అమ్మన్ టెంపుల్ మ్యూజియం టెంపుల్ కాంప్లెక్స్ లో వేయి స్తంభాల హాలు లో కలదు. ఈ మ్యూజియం పర్యాటకులకు విస్తారమైన హిందూ మతం మరియు ఈ టెంపుల్ కు గల 1200 సంవత్సరాల పురాతన చరిత్ర తెలుపుతుంది. ఈ మ్యూజియం ద్రావిడ శిల్ప శైలి గురించిన సమాచారం ఇస్తుంది. మ్యూజియం లో అనేక మూర్తులు, పెయింటింగ్ లు, ఫొటోగ్రాఫ్ లు, మొదలైనవి హిందూ దేవతల మరియు వాటి కధలు కలవు. టెంపుల్ ప్రతి రోజూ ఉదయం 6 గం. నుండి సా. 5.30 గం.వరకూ తెరచి వుంటుంది. ఈ మ్యూజియం చూడాలంటే ఒకటి లేదా రెండు గంటలు పడుతుంది. కాని చూడ తగినది. హిందూ మతం పట్ల ఆసక్తి కలవారికి ఎంతో బాగుంటుంది.

  + అధికంగా చదవండి
 • 11మదురై లో షాపింగ్

  మదురై లో షాపింగ్

  మదురై లో షాపింగ్ ఆనందంగా వుంటుంది. షాపింగ్ చేయకుంటే మదురై వెళ్ళ నట్లే. మదురై టెక్స్ టైల్స్ మరియు హేండి క్రాఫ్ట్స్ కు ప్రసిద్ధి. సిల్క్, కాటన్, బాటిక్ మరియు సున్గుంది చీరలకు ప్రసిద్ధి. ప్రీతు మండపం మార్కెట్ మదురై లో తప్పక చూడాలి. మదురై లో చేతితో అల్లిన సిల్క్ కాటన్ చీరలు అమ్ముతారు.

  హస్త కళా నైపున్యతలు కల మెటల్ దీపాలు, బ్రాంజ్ విగ్రహాలు, చెక్క, రాతి మూర్తులు వంటివి ఇండ్ల వద్ద తయారైనవి వుంటాయి. మదురై వెళ్ళినపుడు ఈ బజార్లు తప్పక తిరిగి మీకు ఇష్టమైన కొనుగోళ్ళు చేసి ఆనందించండి.

  + అధికంగా చదవండి
 • 12పజముదిర్ చోలై

  పాజముదిర్ చోలై టెంపుల్ లో హిందూ దేముడు లార్డ్ మురుగా లేదా సుబ్రమణ్య ఉంటాడు. ఈ టెంపుల్ అలగర్ కొయిల్ టెంపుల్ వద్ద సోలైమలై హిల్ పై భాగాన్ వుంటుంది. విగ్రహం ఒక బంగారు రధం పై ప్రతి సాయంకాలం ఊరేగుతుంది. నబురంగంగై అనే ఒక నీటి బుగ్గ టెంపుల్ సమీపం లో కలదు. భక్తులు ఇక్కడ స్నానం చేస్తారు. టెంపుల్ లో దేముడి శిల్పాలు అనేకం చెక్కబడ్డాయి. ఇవి మార్బుల్ మరియు చేక్కవి గా కలవు. టెంపుల్ చేరేందుకు పెద్ద మెట్లు కలవు.

  + అధికంగా చదవండి
 • 13తిరుపర్నకుంద్రం

  తిరుపర్నకుంద్రం

  తిరుపర్ణ కుంద్రం మదురై నగరానికి 8 కి.మీ.ల దూరంలో మదురై జిల్లా లో కలదు. ఈ ప్రదేశంలో ఒక మురుగన్ టెంపుల్ మరియు హజరత్ సుల్తాన్ సికందర్ బాదుష షహీద్ దర్గా కలవు. దర్గా తిరుపరాన్ కుంద్రం కొండ పై వుంటుంది. మురుగన్ టెంపుల్ ను కొండలో కట్టారు. పురాతన టెంపుల్ ను 8వ శతాబ్దంలో పాండ్య రాజులు నిర్మించారు. దీనిలో శివుడు, మాత దుర్గ, లార్డ్ విష్ణు విగ్రహాలు కలవు.

  ఈ టెంపుల్ ని సూర్యుడు మరియు చంద్రుడు కలసి చూసే ప్రదేశం లో నిర్మించటం విశేషం. లార్డ్ మురుగా ఈ టెంపుల్ లో వివాహం చేసుకున్నాడని కనుక ఈ టెంపుల్ వివాహాలకు ప్రసిద్ధి అని చెపుతారు.

  + అధికంగా చదవండి
 • 14అరుప్పు కొట్టాయి

  అరుప్పు కొట్టాయి టవున్ మదురై కి సుమారు 48 కి. మీ. ల దూరం లో కలదు. ఈ ప్రదేశం దాని జాస్మిన్ ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఇక్కడ అనేక టెంపుల్స్, మసీదులు, చర్చిలు కలవు. ఈ ప్రదేశ ప్రధాన ఆకర్షణలు అంటే నల్లిర్ ముహైదీన్ అందవార్ మసీదు, వాజవంధపురం జుమ పల్లివసాల్, శ్రీ అరుళ్మిగు సోక్కనతార్ స్వామి టెంపుల్, అరుళ్మిగు శ్రీ ముతుమారి అమ్మన్ టెంపుల్ సి ఎస్ ఐ చర్చి , రోమన్ కేథలిక్ చర్చి, వంటివి. ఇది యాత్రా స్థలం గానే కాక ఒక పారిశ్రామిక టవున్ గా కూడా ప్రసిద్ధి చెందినది. ఈ టవున్ ఇతర నగరాల తో పాటు మదురై కి అనుసంధానించా బడింది. కనుక మదురై వెళ్ళే దోవలో ఈ ప్రదేశం పర్యాటకులు చూడవచ్చు.

  + అధికంగా చదవండి
 • 15గాంధి మ్యూజియం

  దేశం లోని అయిదు గాంధీ మ్యూజియం లలో మదురై లోది ఒకటి. దీనిలో గాంధీ కి సంబంధించిన అనేక వస్తువులు కలవు. అనేక ఫోటోలు కలవు. ఈ మ్యూజియం ను క్వీన్ మంగంమల్ అనే ఒక పురాతన పాలస్ లో ఏర్పరచారు.

  గాంధీ మరణం తర్వాత ఈ పాలస్ ను మ్యూజియం గా మార్చారు. దీనిలో గాంధీ ఫిలాసఫీ పుస్తకాలతో ఒక బుక్ షాప్ కలదు. ఇక్కడే ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా కలదు. దీనిలో గాంధి ఫిలింలు ఆయన సమావేశాలు వంటివి చూపుతారు.

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Feb,Wed
Return On
22 Feb,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
21 Feb,Wed
Check Out
22 Feb,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
21 Feb,Wed
Return On
22 Feb,Thu