Search
  • Follow NativePlanet
Share

పూరీ   - ఇక్కడ విశ్వానికి ప్రభువు యొక్క ప్రస్థానం !

67

పూరీ ఒరిస్సా రాష్ట్రంలో భారతదేశంలో తూర్పు వైపు బంగాళాఖాత తీరంలో ఉన్నది. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. పూరి నగరం చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నది. జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ్ పూరీ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ప్రజలు హిందూ మత తీర్ధయాత్రను పూరీను సందర్శించినప్పుడు మాత్రమే యాత్ర పూర్తి అయినదని భావిస్తారు. జగన్నాథ ఆలయం భారతదేశంలో ఉన్న దేవాలయాలల్లో ప్రముఖమైనది. ఇక్కడ రాధా, దుర్గ, లక్ష్మి, పార్వతి, సతి, మరియు కృష్ణ తో శక్తి నిలయాలు ఉన్నాయి. జగన్నాథుని యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి, పురుషోత్తమ క్షేత్ర, పురుషోత్తమ ధర్మ, నీలాచల,నీలాద్రి, శ్రీక్షేత్ర, శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.

పూరీలో గొప్ప రథం ఫెస్టివల్

ప్రతి సంవత్సరం పర్యాటకులు అధిక సంఖ్యలో రథయాత్ర లేదా రథం ఫెస్టివల్ సమయంలో సందర్శిస్తారు. పండుగ సమయంలో దేవతలైన జగన్నాథ్,బలభద్ర మరియు సుభద్రల విగ్రహాలను బాగా అలంకరించిన రథాల్లో ఉంచి గుండిచ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చితిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకువస్తారు. ఈ ఉత్సవము సాధారణంగా జూలై నెలలో జరుగుతుంది. ఈ ఉత్సవము పూరీ పర్యాటక క్యాలెండర్ లో అత్యంత ముఖ్యమైన ఆకర్షణగా చెప్పవచ్చు.

పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

పర్యాటకులకు పురీలో సందర్శించటానికి అనేక ఆలయాలు ఉన్నాయి. హిందువులకు పూరీ భారతదేశంలో ఉన్న ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా ఉన్నది. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ ఆలయమే కాక చక్ర తీర్థా ఆలయం, ముసిమ ఆలయం, సునర గౌరంగ్ ఆలయం, శ్రీ లోక్నాథ్ ఆలయం, శ్రీ గుండిచ ఆలయం, అలర్నాథ్ ఆలయం మరియు బలిహర్ చండి ఆలయం మొదలైనవి హిందువులకు ముఖ్యమైన ప్రార్థనా ప్రదేశాలుఉన్నాయి. గోవర్ధన మఠం వంటి మఠాలు దైవిక ఉపశమనం అందిస్తున్నాయి. బేడి హనుమాన్ టెంపుల్ కి సంబంధించిన స్థానిక పురాణము కలిగి ఉంది. పూరీ బీచ్ మరొక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఉంది. వార్షిక పూరీ బీచ్ ఫెస్టివల్ పూరీ పర్యాటకంలో ఆకర్షణగా ఉంటుంది.

ఈ బీచ్ ను హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాక ఈ బీచ్ సుందరమైన వీక్షణ నిజంగా మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది. ఉదయిస్తున్న సూర్యుడి చూడటం లేదా అస్తమిస్తున్న సూర్యుడి చూడటంతో తీర్థయాత్ర ముగుస్తుంది అనుకుంటున్నారా? కానేకాదు పర్యాటకులు బలిఘి బీచ్ వద్ద కోణార్క్ సముద్ర డ్రైవ్ చేయవచ్చు. పూరీ మతసంబంధ ఆసక్తికరమైన మరొక ప్రదేశం హిందూ మత శ్మశానం స్వర్గాద్వర్ ఉంది. పూరీ నుండి 14 కిమీ దూరంలో భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధాని రఘురజ్పూర్ ఉన్నది.

ఒరిస్సాలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన షాఖిగోపాల్ పూరీ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నీటి ప్రేమికులు లేదా సర్ఫింగ్ ఆస్వాదించే వారికి మరొక అద్భుతమైన ఆకర్షణ కేవలం పూరీ నుండి 50 కిమీ దూరంలో సాత్పదా వద్ద ఉంది. పూరీ నుండి సాత్పదా చేరుకోవటానికి అనేక బస్సులు మరియు టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

పూరి హస్తకళలు

పూరీలో హస్తకళలు మరియు కుటీర పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. స్వామి జగన్నాథుడు ఆలయం చేతి వృత్తులకు చాలా ప్రసిద్ధి చెందింది. కలప, ఆధునికమైన ప్యాచ్ పని, టెర్రకోట, బెల్ మెటల్, పూరీ క్లాసిక్ సంప్రదాయ సంస్కృతి మరియు వారసత్వాన్ని పెంచడానికి సముద్రపు గవ్వలతో తయారుచేసిన వస్తువులు, రాతి నగిషీలు, అలంకారం కొరకు ఒకరకం వస్త్రపు ముక్కలను వేరొక వస్త్రంపై కుట్టుపని చేయుట, పట్టా చిత్ర మొదలైన కుటీర పరిశ్రమలు ఉన్నాయి.

అనేక చిన్న తరహా పరిశ్రమలను ఈ ప్రాంతంలో నడుపుతున్నారు. సున్నితమైన చేతితో రూపొందించిన కొన్ని వస్తువులను ఎంపిక చేయడం మర్చిపోవద్దు. అలంకారం కొరకు ఒకరకం వస్త్రపు ముక్కలను వేరొక వస్త్రంపై కుట్టుపని చేసే వాటిని కొనుగోలు చేయాలనుకొనే వారికి పూరీ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిపిలి మంచి ప్రాంతంగా ఉంది.

పూరీ చేరుకోవడం ఎలా

పూరీ విమాన, రోడ్డు మరియు రైలు మార్గాలతో అనుసంధానం చేయబడివుంది.

పూరీ సందర్శించడానికి ఉత్తమ సమయం

ఈ ప్రదేశాన్ని దర్శించడానికి ఉత్తమ సమయం జూన్ నెల నుండి మార్చి వరకు ఉంటుంది.

పూరీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పూరీ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పూరీ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పూరీ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం పూరీ బాగా సంరక్షించిన రోడ్డు సౌకర్యం ఉంది. రాష్ట్ర సొంత బస్సులు మరియు ప్రైవేటు బస్సులు ఒడిషా లో అన్ని ప్రధాన ప్రదేశాలకు అలాగే కోలకతా నుండి అందుబాటులో ఉన్నాయి. ఒరిస్సా పర్యాటక అభివృద్ధి సంస్థ (OTDC) నుండి డీలక్స్ బస్సులను దృశ్య వీక్షణం మరియు పూరీ ఇతర పర్యాటక కార్యకలాపాల కోసం ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం పూరీలో ఒక రైల్వే స్టేషన్ ఉంది. నేరుగా రైలు సేవలు పూరీ నుంచి కోలకతా,న్యూ ఢిల్లీ,గౌహతి, బెంగుళూర్,చెన్నై మొదలైన నగరాలు మరియు అనేక ముఖ్యమైన ఒడిషా ప్రాంతాలకు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం సమీప విమానాశ్రయం భువనేశ్వర్ లో ఉంది. పూరీ నుండి కేవలం 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భువనేశ్వర్ నుంచి పూరీ చేరటానికి ఒక గంట ప్రయాణం పడుతుంది. భువనేశ్వర్ విమానాశ్రయం భారతదేశం మరియు ఒరిస్సా యొక్క ఇతరు ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది. బస్సులు టాక్సీలు విమానాశ్రయం నుండి పూరీకి అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu