Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రనధంబోర్

రనధంబోర్ - పార్కులు, టైగర్ రిజర్వులు

25

రత్నంభోర్ ను రణతంబోర్ లేదా రధంభోర్ అని కూడా పిలుస్తారు. రాజస్తాన్ లో సుందర పర్యాటక ప్రదేశం ఇది. ఈ పట్టణం సవాయ్ మాధోపూర్ నుండి 12 కి.మీ.ల దూరంలో కలదు. ఈ ప్రదేశానికి దాని పేరు రాణ్ మరియు థంబోర్ అనే రెండు కొండల పేర్లనుండి వచ్చింది.

ప్రపంచ ప్రఖ్యాత టైగర్ రిజర్వ్

ఈ ప్రదేశం టైగర్ రిజర్వ్ గా ప్రసిద్ధి గాంచింది. అట్లే, రణతంబోర్ నేషనల్ పార్క్ కూడా ఇంతే ప్రఖ్యాతికల పర్యాటక ప్రదేశం. ఈ పార్కు సరిగ్గా ఆరావళి పర్వత శ్రేణులు మరియు వింధ్య పీఠభూమి కలిసే చోట కలదు. సవాయ్ మాధోపూర్కు పార్కు 14 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ పార్కును 1955 సంవత్సరంలో భారత ప్రభుత్వం ది సవాయ్ మాధోపూర్ గేమ్ శాంక్చురీగా స్ధాపించింది. తర్వాత 1973 సంవత్సరంలో దీనిని టైగర్ ప్రాజెక్టు రిజర్వుగా ప్రకటించారు. 1980లో ఇది నేషనల్ పార్క్ హోదా పొందింది.

రణతంభోర్ మరియు దాని చుట్టుపట్ల ప్రదేశాలు పచ్చటి అడవులు. ఎన్నో రకాల మొక్కలు, జంతువులు ఉంటాయి. వివిధ రకాల జంతువులకు పక్షులకు ఈ అడవులు నివాసంగా కలవు. రిజర్వులో పర్యాటకులు సంబార్, చిరుత, అడవి ఎలుగుబంటి, హయనాలు ఇంకా అనేక వన్య జీవులను చూడవచ్చు. రణధంబోర్ లో అనేక సరస్సులు కూడా కలవు. వాటిలో పదం తలావ్, సుర్వల్ లేక్ మరియు మాలిక్ తలావ్ ప్రసిద్ధి గాంచినవి. నేషనల్ పార్కు లోపల పదం తలావ్ చాలా పెద్దదిగా ఉంటుంది. దీని ఒడ్డునే జోగి మహాల్ గా పిలువబడుతూ ఒక పురాతన గెస్ట్ హౌస్ ఇచట ఉంటుంది.

రణతంభోర్ కోట - తప్పక చూడవలసిన చారిత్రక కట్టడం

కోట సుమారు క్రీ.శ. 944 లో నిర్మించినదిగా చెపుతారు. రాజస్ధాన్ రాజుల ధైర్య సాహసాలకు ఇది ప్రతీక. ఈ కోట సమీపంలోని మైదానాలకు సుమారు 700 అడెగుల ఎత్తున కలదు. రణధంబోర్ కోటలో మూడు దేవాలయాలు, గణేశ, శివ మరియు రామ దైవాలకు కలవు. రణధంబోర్ కోట నిర్వహణా భాధ్యతలు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి అప్పగించబడ్డాయి.

గత వైభవానికి చిహ్నం

రణధంబోర్ లో పర్యటించే వారు ప్రక్రుతికి సమీపంగా ఉంటారు. ఈ ప్రాంతం అంతా ఎంతో అందమైన సహజ వాతావరణం కలిగి పచ్చటి ప్రదేశాలు కలిగి ఉంటుంది. మెల్లగా పారే సెలయేళ్ళు, దట్టమైన అడవులు, తీగలు, పొదలు వంటివి, ఎత్తైన శిఖరాలు, పర్యాటకులకు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. రణధంబోర్ లో ఎన్నో శిధిలావశేషాలు కూడా కలవు. పడిపోయే గోడలు, కోటలు, ఆ నాటి రాజులు ఉపయోగించిన కట్టడాలు అన్ని కలిసి గత చరిత్ర వైభవాన్ని ప్రదర్శిస్తాయి. ఈ ప్రదేశానికి చేసే విహారం మీకు మధురమైన అనుభవాలను కలిగించి ఎంతో విశ్రాంతినిస్తుంది.

రణధంబోర్ చేరటం ఎలా? రణధంబోర్ చేరేందుకు వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు కలవు. జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయం రణధంబోర్ కు సమీపం. సవాయ్ మాధోపూర్ రైలు స్టేషన్ సమీప రైలు స్టేషన్

ఈ పర్యాటక ప్రదేశం సంవత్సరం అంతా ఒక మోస్తరు వాతావరణం కలిగి ఉంటుంది. అక్టోబర్ మరియు ఏప్రిల్ నెలల మధ్య సందర్శనకు అనుకూలం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి సైట్ సీయింగ్ కు అనుకూలంగా ఉంటుంది.

రనధంబోర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రనధంబోర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రనధంబోర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రనధంబోర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రాజస్తాన్ లేదా ఇరుగు పొరుగు రాష్ట్రాలనుండి రణధంబోర్ కు పర్యాటకులు ప్రభుత్వ బస్సులు లేదా ప్రయివేటు బస్ లను ఉపయోగించి చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం రణధంబోర్ కు సమీప రైలు స్టేషన్ సవాయ్ మాధోపూర్ రైలు స్టేషన్. ఇది సుమారు 10 కి.మీ. ల దూరంలో ట్రంక్ రోడ్డు మార్గంలో ముంబై మరియు ఢిల్లీలకు మధ్య భాగంలో కలదు. ఈ రైలు స్టేషన్ నుండి రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలకు రైళ్ళు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    పర్యాటకులు వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలలో ఇక్కడకు చేరవచ్చు. విమాన ప్రయాణం జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయం రణధంబోర్కు సమీప విమానావ్రయంగా ఉంది. సుమారు 152 కి.మీ.ల దూరంలో కలదు. ఈ విమానాశ్రయం, దేశంలోని ప్రధాన నగరాలకు అంటే, న్యూఢిల్లీ, ముంబై, కోల్ కటాలకు కలుపబడింది. విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతానికి రావాలంటే, న్యూఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంనుండి సంగనేర్ విమానాశ్రయానికి చేరి అక్కడనుండి రణధంబోర్ కు టాక్సీలలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed