రాజస్థాన్ లోని సరిస్క నేషనల్ టైగర్ రిజర్వు లో గల పండు పోల్ లోని హనుమాన్ దేవాలయం సరిస్క లో ఎక్కువగా సందర్శించే ప్రాంతాలలో ఒకటి. పండుపోల్ లేదా పండు గేట్ నుండి ఒక మంత్రముగ్ధమైన జలపాతం దృఢమైన, గట్టి రాళ్ల నుండి వెలువడుతుంది.
ఇతిహాసాల ప్రకారం పాండవులు వనవాసం లో ఉన్నప్పుడు ఇక్కడ ఆశ్రయం పొందారు. వేరొక పురాణ కథ ప్రకారం ఈ ప్రాంతంలోనే పాండవులలో బలశాలి అయిన భీముడు హనుమంతుడి చేతిలో ఓడిపోయాడు. ఈ హనుమాన్ దేవాలయంలో హనుమంతుని భారీ విగ్రహం ఉంది. వర్షాకాలం లో ఇక్కడి జలపాతం తో బాటు వివిధ రకాల పక్షులను కూడ చూడవచ్చు. ఆలయ ప్రాంగణంలో లాంగుర్ లు, మకాక్ లను కూడా చూడవచ్చు.



Click it and Unblock the Notifications