Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» శివపురి

శివపురి - వన్య మృగ జీవితానికి గుండెవంటిది !

23

మొఘల్ పరిపాలకుల యొక్క వేట ప్రాంతంగా దట్టమైన అడవులు కలిగిన ఈ శివపురి వ్యవహరించేది. శివపురిని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెయ్యడం లో ఈ దట్టమైన అడవులు తమదైన పాత్ర ని పోషిస్తున్నాయి. కరేరా బర్డ్ సాంచురీ ఇంకా మాధవ్ నేషనల్ పార్క్ ల తో పాటు అపారమైన కోటలను ఈ ప్రాంతం లో గమనించవచ్చు. ప్రకృతి తో మానవుడు సహజీవనం చేసే ప్రాంతం గా దీనిని అభివర్ణించవచ్చు.

శివపురి - ప్రకృతి మాత రాజ్యం

ఘనమైన జీవన వైవిధ్యం కలిగిన సుందరమైన ప్రాంతం ఈ మాధవ్ నేషనల్ పార్క్. అందమైన సరస్సు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఇంకా కొండలు ఈ ప్రాంతానికి వన్నె తెస్తున్నాయి. నేషనల్ పార్క్, సఖ్య సాగర్ లేక్, భూర ఖాన్ జలపాతం, పావా జలపాతం మరియు సన్ చైరైయ బర్డ్ సాంచురీ లు అన్నీ ప్రకృతి ఒడిలో మానవుడు సేద దీరడానికి అనువుగా ఉన్న ప్రాంతాలు అని వర్ణించడం లో అతిశయోక్తి లేదు. శివపురి పర్యాటకం రోజు వారి గజిబిజి జీవన విధానం నుండి ఉపశమనం పొంది ప్రకృతి మాత ఒడిలో సేద దీరెందుకు చక్కటి అవకాశం.

శివపురి లో ఇంకా చుట్టు పక్కల పర్యాటక ఆకర్షణలు

శివపురి సుదీర్ఘమైన రంగు రంగుల చరిత్ర కలిగినది. ఇది రాజ కుటుంబానికి వేసవి రాజధాని అని చెప్పకనే చెబుతుంది. కోటలు, పాలసు లు మరియు నర్వార్ ఫోర్ట్, మాధవ్ విలాస్ పాలసు ఇంకా మహా శివ టెంపుల్ శివపురి లో ఉన్న ప్రధాన ఆకర్షణలలో కొన్ని. శివపురి లో ని పర్యాటకం ఇక్కడున్న వైభవోపేతమైన స్మారక చిహ్నాలు, నేషనల్ పార్క్లులు ఇంకా బర్డ్ సాంచురీల వల్ల దినదినాభివృద్ది చెందుతోంది.

శివపురి సందర్శన

వాయు, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా శివపురి మిగతా ప్రాంతాలకు చక్కగా అనుసంధానమై ఉంది. ఈ ప్రాంతం లో వాతావరణం ఆహ్లాదకరం గా ఉన్నప్పటికీ అక్టోబర్ నుండి మార్చ్ వరకు సందర్శనకు ఉత్తమ సమయం.

శివపురి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

శివపురి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం శివపురి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? శివపురి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం విస్తృతమైన రోడ్డు నెట్వర్క్ వల్ల శివపురి రోడ్డు మార్గం ద్వారా అన్ని ప్రధాన కేంద్రాలకు చక్కగా అనుసంధానమై ఉంది. గ్వాలియర్ (128 కిలోమీటర్లు) మరియు ఝాన్సీ (100 కిలోమీటర్లు) ల నుండి శివపురి కి చేరుకునేందుకు బస్సు సర్వీసు లు ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం రైలు మార్గం ద్వారా శివపురి చక్కగా అనుసంధానమై ఉంది. ప్రధాన పట్టణ ప్రాంతం నుండి 3 కిలోమీటర్ల దూరం లో శివపురి రైల్వే స్టేషన్ ఉంది. బస్సులు ఇంకా టాక్సీలు ఈ రైల్వే స్టేషన్ నుండి తరచూ అందుబాటులో ఉంటాయి. శివపురి లో ఎక్కువగా రైళ్ళు ఆగకపోవడం వల్ల ఝాన్సీ (100 కిలోమీటర్లు) ఇంకా గ్వాలియర్ (128 కిలో మీటర్లు) ల ని ఇక్కడికి సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్స్ గా పరిగణించవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం చారిత్రక నగరం అయిన శివపురి భారత దేశం లో ని అన్ని ప్రధాన నగరాలకు చక్కగా అనుసంధానమై ఉంది. వాయు మార్గం ఇందులో ప్రధానమైనది. 128 దూరం లో ఉన్న గ్వాలియర్ విమానాశ్రయం ఇక్కడికి సమీపం లో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Jul,Sun
Return On
27 Jul,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Jul,Sun
Check Out
27 Jul,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Jul,Sun
Return On
27 Jul,Mon

Near by City