» »ప్రకృతి ప్రసాదించిన వరం ... బొర్రా గుహలు !!

ప్రకృతి ప్రసాదించిన వరం ... బొర్రా గుహలు !!

Written By:

పర్యాటక స్థలం : బొర్రా గుహలు

జిల్లా : వైజాగ్ లేదా విశాఖపట్టణం

రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్

గుహలు ... ఇది వినగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది బొర్రా. బొర్రా గుహలు చూడటానికి అందంగా ... పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉంటాయి. ఇవి ఆంధ్ర ప్రదేశ్ లో అతి పురాతనమైన గుహలుగా ఖ్యాతికెక్కాయి. బొర్రా గుహలు తూర్పు కనుమల్లో అనంతగిరి ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఈ గుహలు లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడటం విశేషం.

నీటి ప్రవాహం వల్ల రాళ్ళు కరిగి సహజసిద్ధంగా గుహలు ఏర్పడ్డాయని శాత్రవేత్తలు చెబుతున్నారు. ఏదేమైనా సరే ఇంతటి అద్భుత గుహలను ఎక్కడెక్కడి వారో వచ్చి సందర్శిస్తున్నారు. ఆంధ్రా ఉన్న మనము కూడా తప్పక బొర్రా గుహలను సందర్శించాలి.

ఇది కూడా చదవండి : వింటర్ సీజన్ లో వహ్వా అనిపించే అరకు లోయ అందాలు !!

బొర్రా గుహలను చేరుకోవటానికి పెద్దగా కష్టపడవల్సిన అవసరం లేదు. వైజాగ్ వరకు చేరుకొంటే అక్కడి నుండి ప్రయాణం చాలా సులభం. రైలు లేదా బస్సులు బొర్రా గుహలకు తరచూ వెళుతుంటాయి. కేవలం బొర్రా గుహాలతోనే సర్దిపెట్టుకోక అక్కడే ఉన్న అరకు లోయ, అనంతగిరి కూడా చూసివచ్చేయండి. మళ్ళీ ఎప్పుడు వెళ్తారో .. ఏమో !!

బొర్రా గుహల కహానీ

బొర్రా గుహల కహానీ

బొర్రా గుహలను 1807 లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. ఒరియా భాషలో 'బొర్ర ' అంటే రంధ్రమని అర్థం. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ళ క్రితంనాటివని భావిస్తున్నారు.

చిత్ర కృప : Snehareddy

ఎలా ఏర్పడ్డాయి ?

ఎలా ఏర్పడ్డాయి ?

ఈ బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపిన ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన ఆంత్రోపాలజిస్టులకు మధ్యరాతియుగ సంస్కృతికి చెందిన 30,000 నుంచి 50,000 సంవత్సరాల క్రితం నాటి రాతిపనిముట్లు లభించాయి. ఈ ఆధారాలను బట్టి ఇక్కడ ఆది మానువులు నివసించినట్లు తెలుస్తోంది.

చిత్ర కృప : Bhaskaranaidu

దేవుని రూపాలు

దేవుని రూపాలు

బొర్రా గుహలను స్థానికంగా నివసించే ప్రజలు దేవుని నివాసం గా పేర్కొంటారు. ఎందుచేతనంటే గుహలో కొన్ని .. ఆకారాలు దేవుని రూపాన్ని కలిగి ఉంటాయి. కనుక భక్తులు వీటిని భక్తి తో సందర్శిస్తారు, పూజలు చేస్తారు.

చిత్ర కృప : Joshi detroit

అనుమతించరు

అనుమతించరు

బొర్రా గుహలు కోలోమీటర్ వరకు వ్యాపించి ఉన్నాయట!! ఈ గుహలకు గోస్తాని నది తొలిచిన నాలుగు ద్వారాలు ఉన్నాయి. రస్తా సరాసరి గోస్తనీ నది వరకు ఉన్నది. కానీ పర్యాటకులు అంతదూరం నడవటానికి అధికారులు, లోపలి సిబ్బంది అనుమతించరు.

చిత్ర కృప : Adityamadhav83

ఎపి టూరిజం

ఎపి టూరిజం

1990 దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గుహలను స్వాధీనం చేసుకుని గుహల వెలుపల ఉద్యాన పెంపకం, మొక్కలు నాటటం వంటి వాటిని చేపట్టటంతో బొర్రాగుహల పరిసరాలు చాలా అందంగా మారాయి.

చిత్ర కృప : Raj

లైటింగ్

లైటింగ్

గుహల్లోపల ఆధునిక దీపాలంకరణ చేయటం, గుహల్లోపలి వింత వింత ఆకారాలపై, రాళ్ళపై రకరకాల రంగులు, నీడలు పడేవిధంగా ఆధునిక దీపాలంకరణ అమర్చటం జరిగింది. ఇంతకుముందు కాగాడాలతో గైడుల సహాయంతో గుహలను చూపించేవారు.

చిత్ర కృప : Krishna Potluri

సందర్శకులు

సందర్శకులు

ప్రతీ సంవత్సరం సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తారని ఒక అంచనా. అరకు లోయ అందించిన ప్రకృతి అద్భుతమైన బొర్రాగుహల ఒక వరం.

చిత్ర కృప : Joshi detroit

ప్రకృతి

ప్రకృతి

ప్రకృతిలో మనిషికి అర్ధంకాని వింతలెన్నోఉన్నాయి, ఎన్నొ అద్భుతాలున్నాయి. ఇలాంటి అద్భుతాల్లో సహజసిద్ధమైన బొర్రాగుహలు కూడా ఒకటి. తూర్పుకనుమల్లోని ఆ ప్రదేశం నిజంగా చూసి తీరవలసిన అద్భుత ప్రదేశం. ప్రకృతి ప్రసాదించిన వింత ఇది.

చిత్ర కృప : Rajib Ghosh

చలన చిత్రాల షూటింగ్లు

చలన చిత్రాల షూటింగ్లు

బొర్రా గుహలు టాలీవూడ్ ను సైతం ఆకర్షించాయి. ఇప్పటి వరకు ఇక్కడ అనేక సినిమా షూటింగ్లు జరిగినాయి. వాటిలో ముఖ్యమైనవి : జగదేక వీరుడు అతిలోకసుందరి, శివ, జంబలకిడిపంబ.

చిత్ర కృప : Snehareddy

రోడ్డు ప్రయాణం

రోడ్డు ప్రయాణం

తూర్పుకనుమల్లోని అనంతగిరి మండల వరుసలో విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి బొర్రా గుహలు. విశాఖపట్నం నుంచి అరకులోయకు వెళ్లే దారి అంతా కనుమ రహదార్లతో కూడినదే. ఈదారి వెంట ప్రయాణమే ఓగొప్ప అనుభూతి.

చిత్ర కృప : Ashokdonthireddy

రైలు ప్రయాణం

రైలు ప్రయాణం

బొర్రాగుహలను సందర్శించాలంటే, విశాఖపట్నం నుంచి బస్సు, రైలు సౌకర్యాలున్నాయి. ప్రత్యేక వాహనాల్లో కూడా ఇక్కడకు చేరుకోవచ్చు. విశాఖ నుంచి బొర్రాగుహల వరకు చేసే రైలు ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతులతో కూడిన యాత్ర.

చిత్ర కృప : Adityamadhav83

రైలు ప్రయాణం

రైలు ప్రయాణం

రైలు దాదాపు 40 గుహల ద్వారా ప్రయాణిస్తుంది. వీటిలో కొన్ని ఒక కిలోమీటరు పొడవు కూడా ఉన్నాయి. ఈ గుహలు కాక అందమైన లోయల గుండా, పచ్చని పర్వతాల మీదుగా, జలపాతాల ప్రక్కన రైలు ప్రయాణం సాగుతుంది.

చిత్ర కృప : Arkadeep Meta

బొర్రా గుహలు ఎక్కడి నుంచి ఎంత దూరం

బొర్రా గుహలు ఎక్కడి నుంచి ఎంత దూరం

భువనేశ్వర్ - 448 కి.మీ., హైదరాబాద్ - 658 కి.మీ., వైజాగ్ నుండి - 90 కి.మీ., విజయవాడ - 420 కి. మీ., రాజమండ్రి - 264 కి. మీ., కాకినాడ - 225 కి. మీ., విజయనగరం - 61 కి. మీ., శ్రీకాకుళం - 129 కి .మీ.

చిత్ర కృప : Sunny8143536003

Please Wait while comments are loading...