» »వింటర్ సీజన్ లో వహ్వా అనిపించే అరకు లోయ అందాలు !!

వింటర్ సీజన్ లో వహ్వా అనిపించే అరకు లోయ అందాలు !!

Written By:

వైజాగ్ - అరకు మధ్యలో రోడ్డు ప్రయాణం అంటే ఇష్టపడనివారు ఉండరు. ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరంగా, రసవత్తరంగా ఉంటుంది. ఘాట్ రోడ్ ప్రయాణం కనుక కాస్త జాగ్రత్తగా వెళితే మంచిది. వైజాగ్ నుండి ప్రతి అరగంటకు అరకు కు ప్రభుత్వ బస్సులు బయలుదేరుతాయి. సొంతవాహనాల మీద వెళ్లాలనుకొనేవారు కారులో గానీ లేదా ఫ్రెండ్స్ తో కలిసి బైక్ లో గానీ వెళ్ళవచ్చు. వైజాగ్ నుండి అరకు కు ప్రవేట్ ట్రావెల్ సంస్థలు కూడా అద్దె ప్రాతిపదికన (30 నుండి 50 మందికి) బస్సులు, టాక్సీలు, కారులు నడుపుతున్నాయి. వైజాగ్ నుండి అరకు వ్యాలీ మధ్య దూరం 114 కిలోమీటర్లు ( రోడ్డు మార్గం), 128 కిలోమీటర్లు (రైలు మార్గం).

ఏపీ ఎస్ ఆర్ టీ సి వైజాగ్ నుండి అరకు వరకు వన్ డే ట్రిప్ లో భాగంగా ప్యాకేజీ ని ప్రవేశపెట్టింది. ఉదయం 5:30 గంటలకు వైజాగ్ లో ప్రారంభమయ్యే ఈ యాత్ర రాత్రి 8 : 30 తో ముగుస్తుంది. బొర్రా గుహలు, అరకు వ్యాలీ, కాఫీ తోటలు, ట్రైబల్ మ్యూజియం వంటి ప్రదేశాలను చూడవచ్చు మరియు స్థానిక గిరిజనులతో కలిసి ధింసా డాన్స్ చేయవచ్చు. ఈ యాత్ర కేవలం ప్రతి ఆదివారం మాత్రమే ఉంటుంది.

వైజాగ్ పరిశ్రమలే కాదు ... పర్యాటక ప్రసిద్ధి కూడా !

బస్సు రకం :

ఎక్స్ ప్రెస్ - పెద్దలకు రూ.240, పిల్లలకు రూ.180

డీలక్స్ - పెద్దలకు రూ. 310, పిల్లలకు రూ.240

అదనంగా : ప్రవేశ రుసుము, లంచ్, టీ, స్నాక్స్, ధింసా డాన్స్, గైడ్ ఫీజు (పెద్దలకు రూ. 280 మరియు పిల్లలకు రూ. 225), సర్వీస్ టాక్స్ ఎక్స్ ట్రా*

అరకు గురించి

అరకు వ్యాలీ సముద్రమట్టానికి 1300 మీటర్ల ఎత్తులో కలదు మరియు 36 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. ఘాట్ రోడ్ ప్రయాణం పర్యాటకులకు మరుపురాని జ్ఞాపకాలను అందిస్తుంది. 40 కు పైగా టన్నెల్స్, బ్రిడ్జిలు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. జలపాతాలు, తోటలు, ఉద్యానవనాలు మరియు అడవులు, తూర్పు కనుమల కొండలు అరకు లోయ ను మరింత అందంగా మార్చివేశాయి. అరకులో ఎక్కవగా కాఫీ తోటలను పండిస్తారు. వీటిని పండించేది అక్కడి గిరిజనులే. గిరిజన ఆచార వ్యవహారాలు, నృత్యాలు, చేతివృత్తులు, ఆహారపు అలవాట్లు వంటివి అరకు వ్యాలీ ప్రాంతంలో గమనించవచ్చు.

అరకు లోయ - ఆకర్షణలు

అరకు లోయ - ఆకర్షణలు

అరకు లోయ అంటే కేవలం కాఫీ తోటలే కాదు బొర్రా గుహలు, సంగదా ఫాల్స్, కటికి ఫాల్స్, టైడాపార్కు, అనంతగిరి, గోస్తనీ నది, ట్రైబల్ మ్యూజియం, భీమిలి బీచ్, చర్పరై జలపాతం కూడా.

చిత్రకృప : Bhaskaranaidu

అరకు లోయ

అరకు లోయ

అరకు వెళ్లాలనుకొనేవారు ఈ విధంగా ప్రయాణం చేస్తే ఉత్తమం.

వైజాగ్ నుండి అరకు లోయ వెళ్ళేటప్పుడు : రైలు ప్రయాణం
అరకు లోయ నుండి వైజాగ్ కు వచ్చేటప్పుడు : రోడ్డు ప్రయాణం చేయటం ఉత్తమం.

చిత్ర కృప : roadconnoisseur

మొదటి ఆకర్షణ

మొదటి ఆకర్షణ

అరకు లోయ మొదటి ఆకర్షణ బొర్రా గుహలు. వైజాగ్ నుండి అరకు వెళ్ళే రైలు మార్గంలో ఇక్కడ స్టాప్ ఉన్నది. దేశంలోనే అతి పెద్ద గుహలుగా, లోతైన గుహలుగా ఇవి ప్రసిద్ధిచెందినాయి. ఇక్కడ సినిమా షూటింగ్ లు కూడా నిర్వహిస్తుంటారు. జగదేకవీరుడు అతిలోక సుందరి, జంబలకిడి పంబ ఇక్కడ తీసినవే. అరకు 36 కి.మీ, వైజాగ్ నుండి 90 కి.మీ. ల దూరంలో బొర్రా గుహలు ఉన్నాయి.

సందర్శించు సమయం : 10 am - 5 pm
టికెట్ : 40 రూపాయలు పెద్దలకు, 30 రూపాయలు పిల్లలకు, 25 రూపాయలు అదనం కెమెరా తీసుకెళితే.

చిత్రకృప : thotfulspot

వలిసె పూల తోటలు

వలిసె పూల తోటలు

గిరిజనుల ప్రధాన ఆదాయ వనరు వలిసె పూలు. వీటి అందాలను చూస్తే ఎవ్వరైనా గులాం అవ్వక తప్పదు. కేవలం నవంబర్ - డిసెంబర్ నెలలో మాత్రమే ఈ ఎల్లో పూలు పూస్తాయి. ఇవి అరకు వ్యాలీ అంతటా వ్యాపించాయి.

చిత్రకృప : Prashant Ram

జలపాతాలు

జలపాతాలు

అరకు లోయ లో జలపాతాలకు కొదువలేదు. పదుల సంఖ్యలో చిన్నా, పెద్దా జలపాతాలు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే పర్యాటకులకు అనుకూలంగా ఉన్నాయి. వీటిని పర్యాటకులు పిక్నిక్ హాట్ స్పాట్ గా ఎంచుకుంటారు.

చిత్రకృప : roadconnoisseur

చాపరై జలపాతం

చాపరై జలపాతం

అరకు కు 15 కి. మీ ల దూరంలో ఉన్నది చాపరై. జారుబండ లాంటి రాతి నిర్మాణాల మీద నుండి ప్రవహించే నీటిని చూస్తే మీరు కూడా వెళ్ళి ఆ నీటిలో ఆటలాడుతారు. జలపాతం చుట్టూ ఉన్న అడవులు ప్రకృతి ప్రియులను కట్టిపడేస్తాయి.

చిత్రకృప : araku valley

కటికి జలపాతాలు

కటికి జలపాతాలు

బొర్రా గుహలకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో కటికి జలపాతాలు ఉన్నాయి. గోస్తనీ నది నీటి పరవళ్ళు 100 అడుగుల ఎత్తు నుండి కిందకు పడటం ఒకెత్తైతే ... కొలనులో స్నానం చేయటం మరో ఎత్తు.

చిత్రకృప : Arkadeep Meta

సంగద జలపాతం

సంగద జలపాతం

అరకు లోయ కు 20 కిలోమీటర్ల దూరంలో సంగద వాటర్ ఫాల్స్ కలవు. ఇవి తూర్పుకనుమలలో పుట్టినాయి. జలపాతాల హోరు తప్ప ఇక్కడ ఇంకో శబ్దం వినపడదు. ఈ ఫాల్స్ వద్ద స్నానాలు చేయటానికి ఆసక్తిని చూపిస్తారు పర్యాటకులు.

చిత్రకృప : Jagannathsrs

మత్స్య గుండం

మత్స్య గుండం

మత్స్య గుండం అరకు వ్యాలీ కి 35 కి. మీ ల దూరంలో కలదు. ఇక్కడ నీటి ప్రవాహం లోనికి వెళుతూ ... బయటికి వస్తూ సందడి చేస్తుంది. ఈ గుండం లో చేపలు ఉండటం ప్రత్యేకత. గుండం ఆనుకోని శివాలయం కూడా ఉన్నది.

చిత్రకృప : Sharada Prasad CS

స్వర్గం

స్వర్గం

అనంతగిరి కాఫీ మరియు ప్రకృతి ప్రియులకు స్వర్గం వంటిది. విశ్రాంతి తీసుకోవటానికి, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవటానికి, కనుచూపుమేర పచ్చదనం ఆస్వాదించాలనుకొనేవారికి ఈ రిసార్ట్ గ్రామము సూచించదగినది. చుట్టూ వుండే కాఫీ తోటలు రిసార్ట్ వరకు పరిమళాలను వెదజల్లుతాయి.

చిత్రకృప : Yalla.vamsi

వసతి

వసతి

వైజాగ్ కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి హిల్ రిసార్ట్ లో 37 వరకు గదులు ఉన్నాయి. వాటిని ఏసీ, నాన్ -ఏసీ కాటేజీలు, లగ్జరీ కాటేజీలు కింద విభజించవచ్చు. అన్ని గదులలో టీవీ, బాత్రూం, బాల్కనీ, వేడి చల్ల నీళ్ళ సౌకర్యం ఉంటుంది. సూట్ గదులలో ఫ్రిజ్, ఫర్నీచర్ వసతులు ఉంటాయి.

ఫోన్ నెంబర్లు : 08936 - 231898, సెల్ : 7382982574

చిత్రకృప : telugu native planet

వింటర్ గొప్ప అనుభూతి

వింటర్ గొప్ప అనుభూతి

అరకు అందాలను మామూలు సీజన్లో కంటే వింటర్ సీజన్లో చూడటమే గొప్ప అనుభూతి. సమ్మర్ లోకంటే వింటర్ లోనే (హనీమూన్ జంటలు) పర్యాటకులు అరకు లోయ చూడటానికి వస్తుంటారు.

చిత్రకృప : Sarath Kuchi

టూర్ ప్యాకేజీ

టూర్ ప్యాకేజీ

ఆంధ్ర ప్రదేశ్ టూరిజంశాఖ వారు అందిస్తున్న ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి.

అరకు రైల్ కం రోడ్ టూర్

రెండు రోజుల టూర్ : ఉదయం 6 గంటకు ప్రయాణం మొదలు మరియు మరుసటి రోజు రాత్రి 9 గంటలతో ముగింపు.
అందిస్తున్న సౌకర్యాలు : అరకులో ఒక్కరోజు వసతి, బ్రేక్ ఫాస్ట్, లంచ్, టీ, స్నాక్స్ మరియు ట్రైన్
చార్జీలు : పెద్దలకు రూ. 2150/-, పిల్లలకు రూ.2020/- .

చిత్రకృప : Sunny8143536003

టూర్ ప్యాకేజీ

టూర్ ప్యాకేజీ

ఒక్కరోజు టూర్ : ఉదయం 6 గంటలకు ప్రయాణం మొదలు మరియు అదే రోజు రాత్రి 9 గంటలకు ప్రయాణం ముగింపు.
అందిస్తున్న సౌకర్యాలు : బ్రేక్ ఫాస్ట్, లంచ్, టీ, స్నాక్స్ మరియు ట్రైన్
చార్జీలు : పెద్దలకు రూ.875/-, పిల్లలకు రూ. 700/-.

మనవి : మరింత సమాచారం కోసం ఎపి టూరిజం ను సంప్రదించగలరు.

చిత్రకృప : Ashokdonthireddy

కాఫీ

కాఫీ

అరకు లో కాఫీ తాగనిదే పర్యటన పూర్తికాదు. ఆర్గానిక్ కాఫీ రుచికి అరకు కేరాఫ్ అడ్రస్. ఆనంద్ .. ఒక మంచి కాఫీ లాంటి సినిమా ఎలాగో, అరకు .. ఒక మంచి కాఫీ లాంటి పర్యటన అలాగన్నమాట..!!

చిత్రకృప : Adityamadhav83

ట్రైబల్ మ్యూజియం

ట్రైబల్ మ్యూజియం

అరకు లో ట్రైబల్ మ్యూజియంను గిరిజనులు విద్య పరంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో నెలకొల్పారు. దీనిని వివిధ తెగలు, స్థానికుల రోజువారీ జీవన విధానాలు ప్రతిబింబిస్తాయి.

సందర్శించు సమయం : 10 am - 7 pm
టికెట్ : పెద్దలకు రూ.10/-, పిల్లలకు రూ.5/-

చిత్రకృప : Ravi teja

పద్మాపురం బొటానికల్ గార్డెన్

పద్మాపురం బొటానికల్ గార్డెన్

వైజాగ్ - అరకు రోడ్డు మీద పద్మాపురం బొటానికల్ గార్డెన్ కలదు. ఈ గార్డెన్ అద్భుతమైన వృక్ష సంపదను కలిగి ఉన్నది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో గార్డెన్ లో కూరగాయలను పండించేవారు. ప్రస్తుతం కూరగాయలతో పాటు హార్టికల్చర్ నర్సరీ సైతం అందిస్తోంది ఈ గార్డెన్. గుడిసె ఇళ్ళు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. మీకు నచ్చితే బుక్ చేసుకొని ఉండవచ్చు.

చిత్రకృప : Bhaskaranaidu

టైడా పార్క్

టైడా పార్క్

దీనినే టైడా జంగిల్ రిసార్ట్ లని/ టైడా జంగిల్ బెల్స్ అని కూడా పిలుస్తారు. హరిత రిసార్ట్ ఇక్కడ వసతి సదుపాయాలను అందిస్తోంది. అరకు నుండి టైడా బస్ స్టాప్ వరకు దూరం 40 కి.మీ. కొండలు ఎక్కడం, పక్షులు చూడటం, ట్రెక్కింగ్ వంటివి ఇక్కడ చేయవచ్చు. వసతి కై రిసార్ట్ లు, కొయ్య గుడిసెలు, ట్రీ హౌస్ లు ఇక్కడ ఉన్నాయి.
అరకు టైడా జంగల్ బెల్ రిసార్ట్ లలో గదుల బుకింగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

చిత్రకృప : Tyagarajan Visakhapatnam

ధింసా డాన్స్

ధింసా డాన్స్

అరకు లోయ ధింసా డాన్స్ కు ప్రసిద్ధి. స్థానిక గిరిజనులు ఈ నృత్యం ఆడతారు. ఆసక్తి గల పర్యాటకులు వీరితో పాటు కలిసి నృత్యం ఆడవచ్చు. ఎలెక్షన్ టైం లో అరకు ప్రచారానికి వెళ్ళే రాజకీయనాయకులు తప్పక ఈ ధింసా డాన్స్ ఆడుతారు. వెదురుబొంగులో చికెన్ తప్పక రుచిచూడాలి.

చిత్రకృప : Rajib Ghosh

అరకు వాతావరణం

అరకు వాతావరణం

అరకు లోయ ను నవంబర్ నుండి మే నెల వరకు సందర్శించవచ్చు. ఆగస్టు లో కూడా వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంటుంది. శీతాకాలంలో అరకు అందాలు వీక్షిచడం గొప్ప అనుభూతి.

చిత్రకృప : Chakrabarti Chinmoy

అరకు చేరుకోవడం ఎలా ?

అరకు చేరుకోవడం ఎలా ?

వైజాగ్ నుండి అరకు వెళ్ళటానికి రైలు, బస్సు మరియు ట్రావెల్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. వైజాగ్ చేరుకోవడం ఎలా ?

చిత్రకృప : Bhaskaranaidu

Please Wait while comments are loading...