Search
  • Follow NativePlanet
Share
» »కేరళలో జల్లులు పడే సమయంలో చూడాల్సిన ప్రాంతాలు ఇవే

కేరళలో జల్లులు పడే సమయంలో చూడాల్సిన ప్రాంతాలు ఇవే

కేరళలో జులై నెలలో చూడటానికి అనుకూలమైన పర్యాటక ప్రాంతాల గురించి కథనం.

కేరళ అందమైన పర్యాటక ప్రాంతాలకు నెలవు. లెక్కలేనన్ని నదీజలాలు, సరస్సులు, కనుచూపుమేరలో పచ్చదనం పరుచుకొన్న మైదానాలు, మేఘాలను తాకే పర్వత శిఖరాలు ఇలా వర్ణించుకొంటూ పోతే సమయం చాలదు. ముఖ్యంగా వర్షాలు మొదలయ్యి ఊపందుకునే జులై, ఆగస్టు నెలల్లో ఇక్కడి సరస్సులు, పర్వత శిఖరాలు కొత్త అందాలను సంతరించుకొంటాయి. అందువల్లే చాలా మంది పర్యాటకులు ఈ సమయంలో గాడ్స్ ఓన్ కంట్రీగా పేరుగాంచిన కేరళ అందాలను చూడటానికి వెలుతుంటారు. ఈ నేపథ్యంలో జులైలో కేరళలో సరికొత్త అందాలను సంతరించుకునే ముఖ్యమైన ఐదు పర్యాటక కేంద్రాల గురించిన వివరాలు మీ కోసం...

అష్టముడి లేక్

అష్టముడి లేక్

P.C: You Tube

ఎనిమిది చిన్ని చిన్న కాలువలతో కూడుకొని ఉండటం వల్ల ఈ సరస్సుకు అష్టముడి సరస్సు అని పేరు వచ్చింది. ఇక్కడ చిరుజల్లలు పడుతున్న సమయంలో హౌస్ బోట్ లో ప్రయాణ చేయడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. అదే విధంగా ఈ సరస్సు ఒడ్డున కుర్చొని కేరళ వంటకాలు తినడం, ఆయుర్వేద మసాజ్ లు చేయించుకోవడం మరిచిపోకండి. ఇక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలోనే కోవాలం రైల్వే స్టేషన్ ఉంది. అదే విధంగా త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇక్కడకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అలప్పుజా

అలప్పుజా

P.C: You Tube

కేరళలో జులై నెలలో అందరూ తప్పకుండా వెళ్లే పర్యాటక కేంద్రంలో అలప్పూజ మొదటి వరుసలో ఉంటుంది. కేరళ సంప్రదాయ క్రీడ స్నేక్ బోట్ పోటీలు ఈ నెల చివరిలో కాని ఆగస్టు మొదటివారంలో కాని జరుగుతాయి. ఆ సమయంలోనే ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అలప్పూజాలోనే రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

తెక్కడి

తెక్కడి

P.C: You Tube

కేరళ పర్యాటక మణిపూస తెక్కడి. పెరియార్ అటవీ ప్రాంతంలోని ఈ తెక్కడిలో వివిధ రకాల అరుదైన వన్యప్రాణులను మనం చూడవచ్చు. బాంబో రాఫ్టింగ్, జంగిల్ నైట్ పెట్రోల్ ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడికి దగ్గరగా కొట్టాయం రైల్వేస్టేషన్ ఉంటుంది. అదే విధంగా మధురై ఎయిర్ పోర్ట్ దీనికి 140 కిలోమీటర్ల దూరంలో ఉండగా కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కుమరకోం

కుమరకోం

P.C: You Tube

కేరళలోని కుమరోం భూమి పై ఉన్న పది స్వర్గాల్లో ఒకటిగా చెబుతారు. ముఖ్యంగా ఇక్కడి గూటి పడవల్లో ప్రయాణం చేయడం మాత్రం మరిచిపోకండి. చుట్టూ నీరు మధ్యలో మనసుకు దగ్గరైన వారి చుట్టూ చేతులు వేసి ప్రయాణం చేయడం ఎవరికి ఇష్టం ఉండదు. అటు వంటి సమయంలో మీ ఏకాంతాన్ని భగ్నం చేయకూడదనుకుంటే కుమరకోం వెళ్లండి. కొట్టాయాం రైల్వే స్టేషన్ ఇక్కడకు 13 కిలోమీటర్లు. కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ నుంచి 94 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఈ అందమైన ప్రదేశం వస్తుంది.

మున్నార్

మున్నార్

P.C: You Tube

మున్నార్ టీ తోటల్లో నడచడం స్వర్గంలో నడవడం ఒకటేనని చెబుతారు. ముఖ్యంగా తెల్లటి దూది మేఘాలు మనలను తాకుతూ వెలుతుంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించడానికి వీలుకాదు. ఇది ప్రముఖ హిల్ స్టేషన్ కూడా. దక్షిణ భారత దేశంలో ఎతైన పర్వత శిఖరాల్లో మున్నార్ కూడా ఒకటి. అంగమలి ఇక్కడి నుంచి 109 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్. అదే విధంగా కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఇక్కడి నుంచి 108 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X