» »కర్ణి మాత ఆలయం - వింతైన ఎలుకల దేవాలయం !!

కర్ణి మాత ఆలయం - వింతైన ఎలుకల దేవాలయం !!

Written By:

సందర్శనీయ స్థలం : దేష్నోక్
రాష్ట్రం : రాజస్థాన్
ప్రసిద్ధ ఆకర్షణ : కర్ణి మాత దేవాలయం (లేదా) ఎలుకల దేవాలయం

రాజస్ధాన్ లోని ఒంటెల దేశంగా పిలువబడే బికనీర్ జిల్లా లో డెష్నోక్ ఒక చిన్న గ్రామం. గతంలో దీనిని 'దస్ నోక్' అంటే 'పది మూలలు' అని పిలిచేవారు. అంటే ఈ గ్రామం పది చిన్నగ్రామాల మూలలనుండి భాగాలు తీసుకొని ఏర్పడింది. ఈ ప్రదేశం పాకిస్తాన్ సరిహద్దులో బికనీర్ కు సుమారు 30 కి.మీ. దూరంలో కలదు. డెష్నోక్ గ్రామం కర్ణి మాత దేవాలయానికి మరియు వివిధ పండుగలకు ప్రసిద్ధి చెందింది.

కర్ణి మాత ఆలయం

                                                      చిత్రకృప : Rakesh bhat29

కర్ణి మాత దేవాలయం పర్యాటకులకు అరుదైన ఆకర్షణ ప్రదేశం. ఈ పవిత్ర స్ధలంలో ఎలుకలు పూజించబడుతాయి. ఈ దేవాలయాన్ని ఎలుకల దేవాలయం అని కూడా అంటారు. హిందువుల దేవత దుర్గా మాత మరో అవతారంగా కర్ణి మాతను పూజిస్తారు. బికనీర్ పాలకులు చక్కవర్తి గంగా సింగ్ వంశస్ధులకు ఈ దేవత ఇంటి దేవత. గంగా సింగ్ ఈ దేవాలయాన్ని 20వ శతాబ్దంలో నిర్మించాడు.

కర్ణి మాత దేవాలయం

కర్ణి మాత దేవాలయాన్ని ఎలుకల దేవాలయం అని కూడా అంటారు. డెష్నోక్ లో పర్యాటకులకు ఇది ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయంలో దుర్గా దేవత అవతారమైన కర్ణి మాత పూజించబడుతుంది.. ఇతిహాసాలమేరకు, రావు బికాజీ, అంటే బికనీర్ నగరం నిర్మాతకు కర్ణిమాత అనుగ్రహం దొరుకుతుంది. అప్పటినుండి ఆ మాతను బికనీర్ వంశ పాలకులు కొలుస్తారు. ఈ దేవాలయం 20వ శతాబ్దంలో రాజు గంగా సింగ్ చే నిర్మించబడింది.

కర్ణి మాత ఆలయం

                                                        చిత్రకృప : Jean-Pierre Dalbéra

ఈ దేవాలయంలో మార్బుల్ చెక్కడాలు చాలా కలవు. ప్రవేశ ద్వారం గేటు చాలా పెద్దది. ఇది వెండితో చేయబడింది. కాబాస్ అని పిలువబడుతూ తిరిగే ఇక్కడి ఎలుకలను పూజిస్తారు. వీటిని అమ్మవారి పిల్లల ఆత్మలుగా భావిస్తారు. వీటికి అత్యధిక మతపర ప్రాధాన్యం ఇతస్తారు. ఎలుక కనపడిందంటే చాలు శుభ సూచకంగా భావిస్తారు. ఎలుక కనుక తమ కాళ్ళను స్పర్శిస్తే చాలు ఎంతో మంచిదని భావిస్తారు. ఈ కాబాలు భక్తులు అందించే ప్రసాదం తిని జీవిస్తాయి.

గంగౌర్ పండుగ

గంగౌర్ పండుగ ఎంతో రంగు రంగుల పండుగ వేడుకలుగా ఉంటుంది. ఇది డెష్నోక్ లోనే కాక, రాజస్ధాన్ అంతటా చేస్తారు. ఈ ప్రసిద్ధ పండుగ గౌరీ మాత కొరకు చేస్తారు. దీనిని చాలావరకు మహిళలు తమ భర్తల క్షేమాన్ని కోరుతూ చేస్తారు. మహిళలు తమ చేతులను, కాళ్ళను మెహంది లేదా గోరింటాకుతో అలంకరించుకుంటారు.

కర్ణి మాత ఆలయం

                                                          చిత్రకృప : Arian Zwegers

కర్ణిమాత జాతర

డెష్నోక్ లో కర్ణిమాత జాతర ప్రసిద్ధి చెందిన పండుగ. ఈ పండుగను ఏటా రెండు సార్లు అంటే మార్చి - ఏప్రిల్ మరియు సెప్టెంబర్ - అక్టోబర్ లలో ఒక్కొక్కసారి పది రోజులపాటు నిర్వహిస్తారు. జాతరను వీక్షించటానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు.

ఇది కూడా చదవండి : నాగౌర్ లో సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు !!

డెష్నోక్ ఎలా చేరుకోవాలి ?

విమాన ప్రయాణం

జోధ్ పూర్ విమానాశ్రయం డెష్నోక్ కు సమీప విమానాశ్రయం. విమానాశ్రయం నుండి డెష్నోక్ కు టాక్సీలు సమంజస రేట్లలో దొరుకుతాయి.

రైలు ప్రయాణం

డెష్నోక్ లో రైలు స్టేషన్ కలదు. ఇది జోధ్ పూర్ రైలు స్టేషన్ కు కలుపబడింది. ఇక్కడినుండి దేశంలోని ఇతర రైలు స్టేషన్లకు తరచుగా రైళ్ళు కలవు. అయితే, జోధ్ పూర్ రైలు స్టేషన్ నుండి పర్యాటకులకు క్యాబ్ లు సౌకర్యంగా ఉంటాయి. జోధ్ పూర్ రైలు స్టేషన్ దేశంలోని అనేక నగరాలకు కలుపబడింది.

రోడ్డు ప్రయాణం

బస్ ప్రయాణం చేయాలనుకునేవారు ముందుగా బికనీర్ చేరాలి. బికనీర్ నుండి డెష్నోక్ కు క్యాబ్ సౌకర్యం కలదు. బికనీర్ కు దేశంలోని వివిధ నగరాలనుండి ప్రభుత్వ మరియు ప్రయివేట్ వాహనాలు తరచుగా నడుస్తాయి.

Please Wait while comments are loading...