• Follow NativePlanet
Share
» »షిర్డీ వెళుతున్నారా ? అయితే ఈ ప్రదేశాలను తప్పక చూసిరండి !

షిర్డీ వెళుతున్నారా ? అయితే ఈ ప్రదేశాలను తప్పక చూసిరండి !

షిర్డీ లో ప్రధాన ఆకర్షణ సాయిబాబా ఆలయం. కానీ షిర్డీ లో మరియు దాని చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అజంతా ఎల్లోరా గుహలు, త్రయంబకేశ్వర్, బీచ్ లు, కోటలు, హిల్ స్టేషన్లు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలను చూడవచ్చు. మీరు గనక మూడు నాలుగు రోజులు షిర్డీ ట్రిప్ ప్లాన్ వేసుకుంటే ఇవన్నీ చూసిరావచ్చు. ఇవేకాదు ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, వైల్డ్ లైఫ్ సఫారీ మొదలైన అడ్వెంచర్ సాహసాలను ఆస్వాదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ లగేజ్ బ్యాగ్ లను సర్దుకొని షిర్డీ కి ప్రయాణించండీ ...! షిర్డీ దేవాలయంలో సాయిబాబా అస్థికలు పెట్టారు. నాగ్ పూర్ కు చెందిన కోటీశ్వరుడు శ్రీకృషుడు కోసం ఒక పెద్ద దేవాలయాన్ని కట్టడం మొదలుపెట్టాడట. కానీ 1918 లో సాయిబాబా దైవసాన్నిధ్యం పొందటంతో ఆయన అస్థికలు గుడిలో పెట్టారట. దాంతో దేవాలయం కాస్త 'షిర్డీ సాయిబాబా దేవాలయం' గా ప్రసిద్ధి చెందినది.

ప్రధాన దేవాలయం

ప్రధాన దేవాలయం

షిర్డీ దేవాలయంలో సాయిబాబా అస్థికలు పెట్టారు. నాగ్ పూర్ కు చెందిన కోటీశ్వరుడు శ్రీకృషుడు కోసం ఒక పెద్ద దేవాలయాన్ని కట్టడం మొదలుపెట్టాడట. కానీ 1918 లో సాయిబాబా దైవసాన్నిధ్యం పొందటంతో ఆయన అస్థికలు గుడిలో పెట్టారట. దాంతో దేవాలయం కాస్త 'షిర్డీ సాయిబాబా దేవాలయం' గా ప్రసిద్ధి చెందినది.

సందర్శనా సమయం : ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆలయాన్ని తెలుస్తారు.

చిత్రకృప : brunda nagaraj

ద్వారకామాయి

ద్వారకామాయి

షిర్డీ దేవాలయం ప్రవేశం వద్ద గల మసీదు ద్వారకామాయి. ఇందులోనే బాబా ఎక్కువ కాలం గడిపాడు. అక్కడ ప్రతి సాయంత్రం బాబా దీపాలు వెలిగించేవాడట. ఇందులో బాబా చిత్రపటం, బాబా కూర్చోవటానికి వాడిన పెద్ద బండరాయి, పల్లకీ మొదలగునవి భక్తులను ఆకర్షిస్తాయి.

చిత్రకృప : Prabirghose

చావడి

చావడి

ద్వారకామాయి మసీదు కు దగ్గరలో ఉండేది చావడి. ఇదొక చిన్న ఇల్లు. బాబా రోజు విడిచి రోజు ఇక్కడ నివసించేవారట. ద్వారకామాయి నుంచి చావడికి బాబా ను ఊరేగింపుగా తీసుకెళ్లే ఆచారం ఇప్పటికీ ప్రతి గురువారం నిర్వహిస్తారు. ఈ చిన్న ఇంట్లో బాబా వాడిన చెక్క మంచమే, తెల్ల కూర్చి లు ఆకర్షణలు.

చిత్రకృప : Raaj 3~commonswik

గురుస్తాన్

గురుస్తాన్

గురుస్తాన్ అనేది వేపచెట్టు ప్రదేశం. బాబా ను మొట్టమొదటి సారి చూడటం జరిగింది ఇక్కడే. ఇక్కడ అగర్బత్తి లను వెలిగిస్తే అన్ని రకాల రుగ్మతల నుంచి విముక్తి అవుతామని భక్తుల విశ్వాసం. ఈ ప్రదేశాన్ని ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సందర్శించవచ్చు.

చిత్రకృప : sai calling Shirdi

ఖండోబా దేవాలయం

ఖండోబా దేవాలయం

షిర్డీ లోని అహ్మద్ నగర్ - కోపెర్ గాన్ రోడ్డు మార్గంలో ఉన్న పురాతన దేవాలయం ఖండోబా. ఇదొక శివాలయం మరియు ఈ గుడి పూజారే బాబాను 'ఓం సాయి' అని పిలిచాడట!

చిత్రకృప : Vishalsdhumal

లెండివనం

లెండివనం

లెండిబాగ్ లో బాబా తరచూ ధ్యానం చేసేవారు మరియు మట్టిప్రమిదలో దీపం వెలిగించేవారు. బాబా నాటిన మర్రిచెట్టు కింద ఈ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ వనం 24 గంటలూ యాత్రికుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది.

చిత్రకృప : Satish Chaudhari Shirdi

దీక్షిత్ వాడా మ్యూజియం

దీక్షిత్ వాడా మ్యూజియం

దీక్షిత్ వాడా మ్యూజియం షిర్డీ లో వున్న చిన్న, ఆసక్తికరమైన ప్రదర్శనశాల. సంస్థాన్ సముదాయం మధ్యలో వుండే ఈ మ్యూజియం లో కొన్ని అరుదైన బ్లాక్ అండ్ వైట్ బాబా ఫోటోలు, ఆయన వాడిన చొక్కాలు, వంటపాత్రలు, నీళ్ల గ్లాసులు, చెప్పులు లాంటి ఇతర వస్తువులు ఇక్కడ ప్రదర్శించబడతాయి.

సందర్శన సమయం : 10 am - 6 pm.

చిత్రకృప : Arunachalam Seshadri Reddy Seshu

శని శింగనాపూర్

శని శింగనాపూర్

శని శింగనాపూర్ షిర్డీ కి 73 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ శని దేవుని ఆలయం ప్రసిద్ధి. ఇక్కడి వింతేమిటంటే ఏఇంటికీ తలుపులు ఉండవు. కాదు కాదు తలుపులు పెట్టరు. ఎవరైనా దొంగతనం చేస్తే అదే రోజు గుడ్డి వారైపోతారని చెబుతారు. దేవాలయం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచే ఉంటుంది.

చిత్రకృప : Booradleyp1

నాసిక్

నాసిక్

నాసిక్ షిర్డీకి 87 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశాన్ని ప్రవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపినట్లు పేర్కొన్నారు. శ్రీరాముడి ఆనవాళ్లు నేటికీ ఆ ప్రాంతంలో కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో లక్ష్మణుడు సూర్పనఖ ముక్కు (నాసికం) కోశాడని ఆ కారణంగానే దీనికి నాసిక్ అన్న పేరొచ్చిందని చెబుతారు.

చిత్రకృప : Vishalnagula

త్రయంబకేశ్వర్ ఆలయం

త్రయంబకేశ్వర్ ఆలయం

నాసిక్ కు కొద్ది దూరంలో ఉన్న త్రయంబకేశ్వర్ ఆలయం దేశంలోకి ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. గోదావరి నది జన్మస్థానం కూడా ఇదే.

చిత్రకృప : Rashmitha

పంచవటి

పంచవటి

నాసిక్ లో మరో ప్రధాన ఆకర్షణ 'పంచవటి'. ఇక్కడ శ్రీరాముడు, సీతాదేవి కొంతకాలం పాటు ఉన్నారు. పూర్వం ఈ ప్రదేశాన్ని దండకారణ్యం గా అభివర్ణించేవారు. ఇక్కడ రాముని ఆలయం కలదు. అదే నేడు కాలారామ్ దేవాలయం గా ప్రసిద్ధి చెందినది.

చిత్రకృప : Raja Ravi Varma

సీత గుహ

సీత గుహ

సీత గుహ నాసిక్ లో చూడవలసిన మరో ప్రధాన ప్రదేశం. ఈ ప్రదేశం నుండే రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోయాడు. గుహలోకి వెళ్ళలంటే యాత్రికులు తలదించుకుని జాగ్రత్తగా వెళ్ళాలి.

చిత్రకృప : Laurawtn

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

దూద్ సాగర్, తపోవన్, ఆంజనేరి పర్వతం, పాండవలేని గుహలు, ముక్తి ధామ్ దేవాలయం, బాగూన్, వైన్ తోటలు, రామ్ కుండ్, మ్యూజియం మొదలుగునవి చూడదగ్గవి. ఆసక్తి కరంగా ఉండే ఫిషింగ్, బోట్ రైడింగ్, రాక్ క్లైమ్బింగ్, స్విమ్మింగ్ మొదలుగునవి నాసిక్ లో ఆనందించవచ్చు.

చిత్రకృప : Mahi29

ఔరంగాబాద్

ఔరంగాబాద్

షిర్డీ నుండి ఔరంగాబాద్ 104 కిలోమీటర్ల దూరం. ఇక్కడి ప్రధాన ఆకర్షణలు బీబీకా మక్ బారా, గ్రిశ్నేశ్వర్ దేవాలయం. ఈ దేవాలయం శివుడి జ్యోతిర్లింగ క్షేత్రం. బీబీకా మక్ బారా అనే స్మారకం, ఔరంగజేబు కుమారుడు తన తల్లి బేగం రబియా దురాని జ్ఞాపకార్థం నిర్మించాడు. ఇది తాజ్ మహల్ కు నకలు.

సందర్శన సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.

చిత్రకృప : Rizwanmahai

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

ఔరంగాబాద్ ఇతర ఆకర్షణలు : కొన్నాట్, ఔరంగాబాద్ కేవ్స్, ఖుల్దాబాద్, కిల్లా అరక్, పంచక్కి, నౌకొండ ప్యాలెస్, గుల్ మండి మొదలుగునవి చూడదగ్గవి.

చిత్రకృప : Niks887

అజంతా గుహలు

అజంతా గుహలు

షిర్డీ నుండి అజంతా గుహలు 200 కి. మీ ల దూరంలో, ఔరంగాబాద్ నుండి 96 కి. మీ ల దూరంలో ఉన్నాయి. ఈ గుహలు క్రీ.శ. 2 వ శతాబ్దం నాటివి. ఈ గుహలు మొత్తం 29 వరకు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా బుద్ధుని జీవితగాధలను చూపుతుంది.

చిత్రకృప : Ameya Clicks

ఎల్లోరా గుహలు

ఎల్లోరా గుహలు

షిర్డీ నుండి 97 కి. మీ ల దూరంలో, ఔరంగాబాద్ నుండి 30 కి. మీ ల దూరంలో ఎల్లోరా గుహలు ఉన్నాయి. అజంతా, ఎల్లోరా గుహలు రెండూ ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఎల్లోరా మొత్తం 34 గుహల సముదాయం. అందులో 12 బౌద్ధులవి, 17 హిందువులవి, 5 జైన మతస్థులవారివి. ఎల్లోరా లో ఏకశిల తో చెక్కిన కైలాస దేవాలయాన్ని తప్పక చూడాలి.

చిత్రకృప : Kunal Mukherjee

పూణే

పూణే

పూణే షిర్డీ నుండి 200 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇది మరాఠా యోధుడు ఛత్రశివాజీ యొక్క స్వస్థలం. ఆగా ఖాన్ ప్యాలెస్, ఓషో ఆశ్రమం, పాతాళేశ్వర్ గుహాలయం, ట్రైబల్ మ్యూజియం, కోటలు, ఉద్యానవనాలు మొదలుగునవి చూడదగ్గవి. ప్రముఖ హిల్ స్టేషన్లయిన ఖండాలా , లోనావాలా పుణెకు సమీపంలో కలవు.

చిత్రకృప : Ramnath Bhat

నాందేడ్

నాందేడ్

షిర్డీ నుండి నాందేడ్ 308 కి.మీ ల దూరంలో, హైదరాబాద్ నుండి షిర్డీ కి వెళ్లే రోడ్డు మార్గంలో కలదు. ఇక్కడ సిక్కు గురుద్వారాలు ఎంతో ప్రసిద్ధి. హజూర్ సాహిబ్ గురుద్వారా, నాందేడ్ కోట, ఉంకేశ్వర్ దేవాలయం నీటి బుగ్గలు, గోవింద బాగ్ మొదలుగునవి చూడదగ్గవి.

చిత్రకృప : Ajayveer

చూడవలసిన ప్రదేశాలు

చూడవలసిన ప్రదేశాలు

కేవలం ఇవేకాదు షిరిడి చుట్టుపక్కల ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ పర్యాటకులను ఆకట్టుకొనేవిధంగా ఉంటాయి. కనుక షిర్డీ వెళ్ళే యాత్రికులు బాబా దర్శనంతో పాటు ఈ ప్రదేశాలను చూసిరండి !

చిత్రకృప : Satrughna

సాయినగర్ షిరిడి

సాయినగర్ షిరిడి

బస్సు మార్గం : హైదరాబాద్, ముంబై, పూణే, నాందేడ్ తదితర పట్టణాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు షిర్డీ కు వెళుతుంటాయి.

రైలు మార్గం : హైదరాబాద్, కాకినాడ, విజయవాడ, ముంబై మరియు ఇతర నగరాల నుండి షిర్డీ మీదుగా రైళ్లు పోతుంటాయి.

వాయు మార్గం : ముంబై, పూణే, ఔరంగాబాద్, నాసిక్ విమానాశ్రయాలు షిర్డీ సమీపాన కలవు.

చిత్రకృప : B S Srikanth

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి