Search
  • Follow NativePlanet
Share
» »పెళ్లి కావటం లేదా అయితే దర్శించండి ..!

పెళ్లి కావటం లేదా అయితే దర్శించండి ..!

By Venkatakarunasri

కళ్యాణ క్షేత్రాల పర్యటన అని ఈ యాత్రకు పేరు. దీనినే తమిళంలో 'తిరుమణ తిరుతల సుట్రుల్లా' అని అంటారు. పెళ్లిళ్లకు అడ్డుగా భావించే విఘ్నలను తొలగించి త్వరగా వివాహం అయ్యేలా దీవించే క్షేత్రాలు గా ఈ ఆలయాలు భావించబడతాయి. పెళ్లికానివారు ఈ ఆలయాలలో పూజలు చేస్తే వెంటనే వివాహం జరుగుతుందని విశ్వాసం.

పెళ్లి కావటం లేదు .. పెళ్ళికావటం లేదు చాలా మంది చాలా రకాలుగా మదనపడుతుంటారు. అదే ఆడపిల్ల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె, ఆమె కుటుంబం ఎంత బాధలో ఉంటుందో ఆ పైవాడికెరుక. ఎన్ని చోట్ల ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా ఆ వచ్చే శుభవార్తకై కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు ఆ తల్లితండ్రులు.

ముదిచూర్ ఆలయము

ముదిచూర్ ఆలయము

తాంబరం (చెన్నై) లోని ముదిచూర్ ఆలయ దర్శనంతో యాత్ర ప్రారంభమవుతుంది. హరిహరులు కొలువై ఉన్న ఈ ఆలయములో ప్రధాన దైవం విధ్యంబిగై అమ్మవారు.

చిత్ర కృప : <$ Jaggy $>

తిరువిడనత్తై ఆలయము

తిరువిడనత్తై ఆలయము

మహాబలిపురం దగ్గర లో తిరువిడనత్తై వద్ద ఉన్న శ్రీ లక్ష్మి వరాహస్వామి ఆలయము ఉంది . ఈ ఆలయము లో లక్ష్మి దేవిని కోమలవల్లీ తాయారు గా మరియు విష్ణువును వరాహ అవతారంలో పూజిస్తారు. విష్ణువు సన్యాసికి పుట్టిన 360 మంది సంతానాన్ని పెళ్లిచేసుకున్నాడు కనుక, ఈ స్వామీని భక్తులు 'నిత్య కళ్యాణ పెరుమాళ్' గా వ్యవహరిస్తారు.

తిరుమణంచేరి ఆలయము

తిరుమణంచేరి ఆలయము

తిరుమనం అంటే వివాహం, చేరి అంటే గ్రామం అని అర్ధం. పురాణం ప్రకారం శివుడు పార్వతి దేవిని పరిణయం ఆడినది ఇక్కడే. తిరుమనంచేరిని సందర్శించటం ద్వారా వివాహానికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయని చెప్తారు.

చిత్ర కృప : Suthesh Nathan

ఉప్పలి అప్పన్ ఆలయము

ఉప్పలి అప్పన్ ఆలయము

కుంభకోణం నుండి 7 కి.మీ ల దూరంలో ఉప్పిలి అప్పన్ ఆలయం కలదు. ఉప్పిలి అప్పన్ అంటే ఉపమానాలకు అందనివాడు అనుపమానుడు అని అర్ధం . ఇక్కడ మార్కండేయ ఋషికి భూదేవి చిన్న బాలిక గా లభించింది. ఆమె " కోకిలాంబాళ్ " పేరుతో పెంచి పెద్దచేసి, శ్రీ మహావిష్ణువు కిచ్చి వివాహము జరిపించాడని ప్రతితీ. ఆలయంలో ఉప్పులేకుండా నైవేద్యం పెడతారు.

చిత్ర కృప : Arunasank

నాచ్చియార్ ఆలయము

నాచ్చియార్ ఆలయము

ఈ ఆలయములో విష్ణు మూర్తి యొక్క 108 దివ్య క్షేత్రాల ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో విష్ణువు నరైయూరు నంభిగా, అమ్మవారు నాచ్చియార్ గా పూజించబడతారు.

చిత్ర కృప : Ssriram mt

తిరుకరుకావూర్ ఆలయము

తిరుకరుకావూర్ ఆలయము

తిరుకరుకావూర్ ఆలయము తంజావూర్ కు మరియు కుంభకోణం పట్టణాలకు 20 km ల దూరంలో కలదు. ఇది ఒక ప్రసిద్ద శివాలయ క్షేత్రము . ఇక్కడ అమ్మవారు గర్భరక్షాంబిగై . ఈ అమ్మవారిని పెళ్లికాని వారు, సంతానము లేని దంపతులు .. భక్తీ శ్రద్దలతో పూజించి దర్శనము చేసుకుంటారు.

తిరుచ్చేరై ఆలయము

తిరుచ్చేరై ఆలయము

ఈ క్షేత్రము కూడా 108 దివ్య వైష్ణవ ఆలయములలొ ఒకటి . శ్రీ దేవి భూదేవి సమేత స్రీ మహా విష్ణువు " సారనాథుడుగా " కొలువై ఉన్నాడు. ఇక్కడి అమ్మవారికి 'సారనాయకి' అనే పేరు ఉంది. కావేరినది దేవి శ్రీహరిని ఇక్కడ వివాహము ఆడింది ఇక్కడేనని స్థలపురాణంలో పేర్కొన్నారు.

చిత్ర కృప : Vishwajith33

మదురై ఆలయము

మదురై ఆలయము

ఈ ఆలయము దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన గొప్ప పుణ్య క్షేత్రము . పాండ్యరాజు తన కుమార్తె అయిన మీనాక్షి దేవిని చొక్కనాథుడు అయిన పరమేశ్వరునికి ఇచ్చి వివాహము చేసిన స్థలము గా ప్రసిద్ది చెందినది . పెళ్ళికాని వారు మధుర మీనాక్షిదేవిని దర్శించుకోవడము అనాదిగా వస్తున్న ఆచారము.

తిరునల్లూరు ఆలయము

తిరునల్లూరు ఆలయము

భగవంతుడు శివుడిని ఇక్కడ వర్ణేశ్వర గా భక్తులు కొలుస్తారు. శివుడు మరియు గౌరీ ల వివాహాన్ని అగస్త్య ముని ఇక్కడి నుండే చూశాడని పురాణ కథనం.

చిత్ర కృప : Ssriram mt

తిరువేడగం ఆలయము

తిరువేడగం ఆలయము

శివునికి అంకితం చేయబడిన తిరువేడగం ఆలయం వైగై అండీ తీరమున కలదు. ఇక్కడ స్వామీ వారిని ఏడగనాథర్ అనే పేరుతో మరియు అమ్మవారిని ఇలావార్ కులాలి అమ్మై అనే పేరు తో పిలుస్తారు.

చిత్ర కృప : Ssriram mt

తిరువవీళిమిళలై ఆలయము

తిరువవీళిమిళలై ఆలయము

ఇక్కడ పరమేశ్వరుడు కాత్యాయనీ అమ్మవారిని వివాహం చేసుకున్నట్లు ప్రతీతి. ఇక్కడ స్వామిని విళానాథుడుగా భక్తులు పూజిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X