Search
  • Follow NativePlanet
Share
» »శ్రీవారిని దర్శించిన తర్వాత..తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే...

శ్రీవారిని దర్శించిన తర్వాత..తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే...

ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు తిరుపతి. శ్రీవేంకటేశ్వరుడిని దర్శనార్తం వచ్చే భక్తులతో తిరుమల నిత్యం రద్దీగా ఉంటుంది. అలాగే సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు. అలమేలు మంగ లేదా పద్మావతి, కలియుగంలో వేంకటేశ్వరుని దేవేరిగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. అలిమేలు మంగమ్మ పుట్టినిల్లుగా తిరుచానూరు ప్రసిద్ది. దీన్నే 'అలమేలు మంగాపురం' అని కూడా పిలుస్తుంటారు ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలమేలు మంగమ్మ కొలువై ఉంటుంది. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ తీర్థయాత్రకు ఫలం లభించదని చెబుతారు.

శ్రీనివాసుని దేవేరులుగా అలమేలు మంగ, లక్ష్మి, భూదేవి, శ్రీదేవి, పద్మావతి, అండాళ్, గోదాదేవి, బీబీ నాంచారి వంటి అనేక పేర్లు పేర్కొనబడడంవల్ల సామాన్యభక్తులలో కొంత అయోమయం నెలకొంటుంది. సంప్రదాయ గాధలను బట్టి ఈ దేవతలను గురించి ఇలా చెప్పవచ్చును. శ్రీదేవి (లక్ష్మి), భూదేవి ఇరువురూ శ్రీమహావిష్ణువును వరించిన దేవతలు. ఉత్సవ మూర్తియైన మలయప్పస్వామి ఉభయ నాంచారులతో కలిసి ఉన్నాడు. తిరుచానూరులో అమ్మవారు కొలువవ్వడానికి ఒక పురాణాగాథ ఉంది.

అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది

అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది

అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది. ఆయన పరమపదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది, ఆయన వరాహస్వామి గా వస్తే ఆమె భూదేవిగా అవతరించింది, ఆయన రాముడయితే అమే సీతగా వచ్చింది. ఆయన శ్రీనివాసునిగా వచ్చినప్పుడు ఆమె పద్మావతి దేవిగా అవతరించింది. వెనక ఒక చిన్న కథ ఉంది.

శ్రీమన్నారాయణుని దర్శనార్థం

శ్రీమన్నారాయణుని దర్శనార్థం

శ్రీమన్నారాయణుని దర్శనార్థం కార్య వైకుంఠానికి భృగు మహర్షి వచ్చినప్పుడు శ్రీమన్నారాయణుడు భృగు మహర్షిని గమనించలేదని ఆగ్రహించాడు. ఆయన ఆగ్రహాన్ని అణిచివేయడానికి శ్రీమహావిష్ణువు ఆయన కాల్లు పట్టుకొని భృగుమహర్షి కాలిలో ఉన్న మూడో కన్నుని పీకేసాడు. ఇది చూసి భరించలేక పోయింది అమ్మ లక్ష్మీ దేవి. వెంటనే అక్కడినుండి వచ్చి పద్మ పుష్కరిణిలో ఉండిపోయింది.

ద్మావతి దేవిగా ఆకాశరాజుకి పద్మ పుష్కరిణిలో లభించింది

ద్మావతి దేవిగా ఆకాశరాజుకి పద్మ పుష్కరిణిలో లభించింది

కొంతకాలం అయ్యాక ఆమె పద్మావతి దేవిగా ఆకాశరాజుకి పద్మ పుష్కరిణిలో లభించి ఆయన వద్ద పెరిగింది. ఆమెను వెతుకుతూ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడై శేషాచలం చేరుకున్నాడు. ఆతర్వాత శ్రీనివాసుడు పద్మావతిదేవిని వివాహం ఆడటం జరిగింది.

వేంకటేశ్వర స్వామికి పురుషకారం అమ్మ పద్మావతి

వేంకటేశ్వర స్వామికి పురుషకారం అమ్మ పద్మావతి

అలా వేంకటేశ్వర స్వామికి పురుషకారం అమ్మ పద్మావతి. ఆమెకే అలమేలుమంగ అని కూడా పేరు. అందుకే తిరుమల దర్శించే ముందే అమ్మవారిని దర్శించడం మన సంప్రదాయం. అందుకే మన ఆలయాల్లో అమెకొక సన్నిధి ఉంటుంది,

అమ్మ ఎప్పుడూ అయనను విడిచి పెట్టి ఉండదు

అమ్మ ఎప్పుడూ అయనను విడిచి పెట్టి ఉండదు

మొదట మనం మన భాదలు అమ్మతో చెప్పుకోవాలి, అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడా అమె ఆయన వక్షస్థలంపై ఉండి, ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ అమ్మ ఎప్పుడూ అయనను విడిచి పెట్టి ఉండదు, ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది. మనకెప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు, మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండటానికి అమ్మ మనకోసం ఉంటుంది. దయ అంటే ఎదుటివారు దుఖిఃస్తే, వారు బాగుపడేంతవరకూ తన దుఖంగా భావించటం.

వాత్సల్యం అంటే

వాత్సల్యం అంటే

వాత్సల్యం అంటే, వత్సం అంటే దూడ, "వాత్సమ్" అంటే దూడపుట్టినప్పుడు అది కల్గి ఉండే మురికి, "ల" అంటే నాకి తీసి తొలగించేది. మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా, ఇవన్నీ తొలగాలంటే అయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే అమ్మ ఎప్పుడూ అయన పక్కన ఉంటుంది. నమ్మళ్వార్ చెప్పినట్లుగా "అగలగిల్లేన్ ఇరయుమ్" అర క్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట.

వెంకటేశ్వర మహాత్మ్యం

వెంకటేశ్వర మహాత్మ్యం

తిరుమల క్షేత్రం స్థలపురాణం ప్రకారం వైకుంఠంలో త త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు.

 ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో

ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో

ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో కలువపూదండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ - (తమిళంలో "అలర్" అనగా పువ్వు. "మేల్" అనగా పైన. "మంగై" అనగా అందమైన స్త్రీ - "అలమేలు" అనగా "పద్మంలో ప్రకాశించున సుందరి").

అలమేలు మంగ గుడిలో

అలమేలు మంగ గుడిలో

అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భు. రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి.

ఆలయకోనేరు

ఆలయకోనేరు

ఈ ఆలయం వెనక కోనేరు, పద్మావతీదేవి గార్డెన్స్, శ్రీరామఆలయం, రామకృష్ణ తీర్థం, గోవిందరాజులస్వామి ఆలయం మరియు ఆంజనేయస్వామి ఆలయం మొదలైనవి చూడవచ్చును.

pc :Malyadri

ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు

ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు

శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి.

సేవలు, సంప్రదాయాలు

సేవలు, సంప్రదాయాలు

అమ్మవారి ఆలయంలో ప్రతిదినం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది. తరువాత సహస్ర నామార్చన, కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ ఉంటాయి. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేస్తారు.

సేవలు

సేవలు

ప్రతి సోమవారం "అష్టదళ పదపద్మారాధన" జరుగుతుంది. శుక్రవారం అభిషేకం జరుగుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఉంటుంది.

చిత్రకృప : Bhaskaranaidu

పూజలు

పూజలు

శ్రావణమాసంలోను, మరి కొన్ని దినాలలోను లక్ష్మీపూజ జరుగుతుంది. ఇక్కడ ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రమైనవిగా స్వీకరిస్తారు. చిత్రకృప : Malyadri

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడి ముఖ్యమైన ఉత్సవం. అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమలనుండి గజవాహనంపై వచ్చే చక్రత్తాళ్వార్‌తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం. ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు.

చిత్రకృప : Malyadri

ఇతర ఉత్సవాలు

ఇతర ఉత్సవాలు

ఆనాడు ఆది శంకరాచార్యులు అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళ సూత్రాలను దర్శిస్తారు. దసరాకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా తెప్పోత్సవం, వసంతోత్సవం, రథ సప్తమి ముఖ్యమైన ఉత్సవాలు. సుందరరాజ స్వామి గుడిలో మూడు రోజుల పాటు అవతారోత్సవం జరుగుతుంది.

చిత్రకృప : Malyadri

అలమేలు మంగాపురం ఎలా చేరుకోవాలి ?

అలమేలు మంగాపురం ఎలా చేరుకోవాలి ?

1) తిరుపతి బస్ స్టాండ్ నుంచి తిరుచానూరు ఆలయానికి లోకల్ బస్సులు, ఏ పీ ఎస్ ఆర్ టి సి బస్సులు మరియు ప్రవేట్ బస్సులు, జీపులు రెగ్యులర్ గా తిరుగుతుంటాయి.

2) లోకల్ గా తిరిగే షేర్ ఆటోలలో ఎక్కి దేవస్థానం వరకు చేరుకోవచ్చు. వారు అడిగినంత డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.

3) తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి, రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్ గా క్యాబ్ లేదా టాక్సీ మాట్లాడుకొని కూడా అలమేలు మంగాపురం చేరుకోవచ్చు. చిత్రకృప : Bhaskaranaidu

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X