Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» వాస్కో డా గామా

వాస్కోడా గామా - ఆకర్షణల నిక్షేపం !

7

వాస్కోడా గామాలో షాపింగ్ అధికం. వాణిజ్యపర కార్యకలాపాలు మెండు. సౌత్ గోవా వలే కాక వాస్కోడా గామా ను స్ధానికంగా వాస్కో అని పిలుస్తారు. ఈ ప్రదేశం చాలా వేగంగా అనేక కార్యకలాపాలతో అభివృధ్ధి చెందుతోంది. విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. ఈ ప్రదేశంలో అనేక బాలీవుడ్ చలన చిత్రాలు తీశారు. సినిమాలు చూస్తే చాలు అవి ఈ ప్రదేశంలో తీసినవిగా వెంటనే ప్రేక్షకులు గుర్తించేస్తారు. ప్రదేశాలు అంత అందంగా కన్నుల విందుగా ఉంటాయి.  

ఇక్కడ కల బీచ్ లకు బైనా, హన్సా, బొగ్ మాలో, గ్రాండ్ మదర్స్ హోల్ అనే పేర్లుంటాయి. ప్రసిద్ధి గాంచిన ఈ బీచ్ లకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. ఫోర్టలేజా శాంతా కేటరినా ఫోర్ట్ శిధిలావశేషలనుండి గ్రాండ్ మదర్స్ హోల్ బీచ్ కు వెళ్ళాలంటే, పర్యాటకులు ఒక రంధ్రం ద్వారా వెళ్ళాలి. ఆ కారణం చేతనే దీనిని గ్రాండ్ మదర్స్ హోల్ అన్నారు. అంతే కాక, ఒకప్పుడు గ్రాండ్ మా చేపల వేటకు వెళ్ళిన తన పిల్లల కొరకు ఈ రంధ్రం వద్ద వేచి ఉండేదని ఆ కారణంగా కూడా ఈ పేరు వచ్చిందని చెపుతారు.

బొగ్ మాలో బీచ్ కు సమీపంలో గల నేవల్ ఏవియేషన్ మ్యూజియం తప్పక చూడాలి. ఈ మ్యూజియంలో గోవా నౌకా చరిత్ర పోర్చుగీసుల కాలం నాటినుండి ఎలా ఉందనేది తెలుస్తుంది. అనేక సంవత్సరాలనుండి మార్పులు చెందిన భారతీయ నౌకాదళ విశేషాలు, వింతలు కూడా ఇది చూపుతుంది.     మార్గోవా పోర్టు ప్రవేశం లోనే వర్కా బీచ్ కు దగ్గరగా 1624 లో కట్టబడిన ఒక మార్ముగోవా ఫోర్ట్ ను కూడా మీరు చూడవచ్చు. అనేక శాసనాలు లిఖించబడి ఈ కోట చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది. కోట ప్రవేశం ఎండలు, ఇసుకలు, బీచ్ లు మొదలైన వాటినుండి కొంత హాయినిస్తుంది. ఈ ప్రదేశంలో గైడ్ లు మీకు అందుబాటులో ఉంటారు.

ఇక్కడే మరో ప్రసిద్ధి గాంచిన కోట మరాఠా మహారాజ్ శివాజీ కోట కూడా కలదు. ఇది వాస్కో కు ఒక ప్రధాన ఆకర్షణ. ఇక్కడనుండి నగర పరిసరాలు బాగా చూడవచ్చు.  గ్రాండ్ మదర్స్ హో ల్ బీచ్ సమీపంలో మీకు దోనా పౌలా బీచ్ లేదా దోనా పౌలా చేరాలన్నా మీకు లాంచీలు లేదా ఫెర్రీలు దొరుకుతాయి. దోణాపౌలా పాణజింకు దగ్గర. పాణజిం కు దోణాపౌలా ఒక గ్రామీణ ప్రాంతంగా చెప్పవచ్చు.  వాస్కో డా గామా చేరటం కూడా తేలికే. ఈ పట్టణానికి వాస్కోడా గామా రైలు స్టేషన్ లేదా డబోలిం స్టేషన్ వంటివి కలవు. అంతేకాక డబోలిం విమానాశ్రయం నగరానికి సుమారు 4 కి.మీ. ల దూరంలో ఉంటుంది. ముంబై, ఢిల్లీ నగరాలకు అనుసంధానించబడి ఉంది. పూనే, ముంబై ల నుండి  పాణజిం, డబోలిం కు క్యాబ్ లు, వోల్వో బస్ లు   ప్రతిరోజూ నడుస్తాయి.  

వాస్కో డా గామా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వాస్కో డా గామా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం వాస్కో డా గామా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? వాస్కో డా గామా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed