Search
  • Follow NativePlanet
Share

వోఖ – లోథాల భూమి!

14

వోఖ, రాష్ట్రంలో దక్షిణ భాగంలో ఉన్న జిల్లా ప్రధాన కార్యాలయం, పట్టణం. ఇది నాగాలాండ్ అతి పెద్ద తెగ లోథాలకు నివాస ప్రాంతం. వారి చరిత్రలో చాల భాగంలో ఈ ప్రాంతం నాగాలాండ్ లోని ఇతర ప్రాంతాలలాగే బయటి ప్రపంచానికి దూరంగా ఉంది. కేవలం 1876 సంవత్సరంలో మాత్రమే బ్రిటిష్ వారు ఇక్కడకి వచ్చి అస్సాంలో నాగా కొండల జిల్లాకు దీనిని ప్రధాన కేంద్రంగా మార్చారు. దీని చుట్టూ ఉన్న చాల కొండలు, పర్వత పంక్తులు ఈ ప్రాంతాన్ని సుందరమయం చేసి పర్యాటకానికి అనువుగా మార్చాయి. దీనికి ఉత్తరాన మోకోక్చుంగ్ జిల్లా, తూర్పున జున్హేబోటో, పశ్చిమాన అస్సాం ఉన్నాయి.

వోఖలో పర్యాటక౦

లోథా గిరిజనులు ఎంతో చక్కగా, చేతులు చాచి పర్యాటకులను వోఖలోనికి స్వాగతిస్తారు. ఈ ప్రాంతంలోని ప్రధాన పండగలు తోఖు, పిఖుచక్, ఎమంగ్ ల సమయంలో మీరు ఈ ప్రాంతంలోని స్థానిక నృత్యం, సంగీతాలలో ఉత్తమమైనవి చూడగలరు. తరతరాలుగా ఒక పద్ధతి ప్రకారం చేతితో తయారు చేసిన శాలువాలకు ఈ పట్టణం ప్రసిద్ధి. వోఖ ఆశీర్వదించబడిన అనేక పర్యాటక ఆకర్షణలలో మౌంట్ టియి, టోత్సు కొండచరియలు, డోయంగ్ నది వంటివి ఉన్నాయి.

భారత పౌరులు నాగాలాండ్ రాష్ట్రంలోనికి ప్రవేశించడానికి అంతర్గత మార్గ అనుమతి తీసుకొనవలసి ఉంటుందనేది గుర్తుంచుకొనవలసిన ముఖ్యమైన విషయం. న్యూ ఢిల్లీ, కోల్కత, గువహతి లేదా షిల్లాంగ్ లలోని నాగాలాండ్ హౌస్ నుండి పొందగలిగిన ఇది ఒక సాధారణ ప్రయాణ పత్రం. పర్యాటకులు ఈ అనుమతిని దిమాపూర్, కొహిమ, మోకోక్చుంగ్ డిప్యూటీ కమీషనర్ లకు దరఖాస్తు చేసి కూడా పొందవచ్చు.

 వాతావరణం

వోఖ పర్వత ప్రాంతమైనందున ఏడాది పొడవునా అతి చల్లని శీతాకాలంతో కూడిన ఉష్ణమండలీయ వాతావరణాన్ని కల్గి ఉంటుంది.

వోఖ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వోఖ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం వోఖ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? వోఖ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా ఈ ప్రాంతానికి ప్రధాన ప్రవేశద్వారం దిమాపూర్ తో కలిపే రోడ్డు మార్గం, జాతీయ రహదారి-39 పై ఈ పట్టణ౦ ప్రధానంగా ఆధారపడింది. ఈ ప్రాంతానికి చేరడానికి మరొక మార్గం ఈ ప్రదేశానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధాని కొహిమా. నాగాలాండ్ రాష్ట్ర రవాణా బస్సులు, ఇతర ప్రయాణ సాధనాలు ఈ రెండు ప్రాంతాల నుండి కూడా సులువుగా అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా వోఖాకు రైలు కేంద్రం లేదు. అయితే మీరు రైలు ద్వారా ఈ ప్రాంతానికి చేరాలనుకుంటే మాత్రం దిమాపూర్ రైలు స్టేషన్ ఉత్తమమైన ప్రాంతం. పట్టణానికి 157 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి న్యూ ఢిల్లీ, గువాహతి, కోల్కత లతో బాటుగా దేశంలోని ఇతర ముఖ్య ప్రాంతాల నుండి రోజువారీ రైళ్ళు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా వోఖ పట్టణంలో విమానాశ్రయం లేదు, దిమాపూర్ విమానాశ్రయం ఈ ప్రాంతానికి ప్రవేశద్వారం. 162 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం నుండి టాక్సీ, ప్రయాణ సాధనాల చక్కటి సౌకర్యం ఉంది. ఈ విమానాశ్రయానికి కోల్కతా, గువాహతి నుండి మీరు రోజువారీ విమానాలను పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 May,Mon
Return On
12 May,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 May,Mon
Check Out
12 May,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 May,Mon
Return On
12 May,Tue