Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» గాంధీనగర్

గాంధీనగర్ – గుజరాత్ రాజధాని !!

16

సబర్మతి నదికి పశ్చిమ ఒడ్డున ఉన్న గాంధీనగర్ గుజరాత్ కి కొత్త రాజధాని. పాత బాంబే రాష్ట్రము మహారాష్ట్ర, గుజరాత్ గా విభజించబడి, 1960 లో స్వతంత్రం వచ్చిన తరువాత గాంధీనగర్ గుజరాత్ రాజధానిగా ఎ౦పికచేయబడింది. గాంధీనగర్ అన్ని విభాగాలలో, రోడ్లు, మార్కెట్లు, సరైన నివాస ప్రాంతాలతో వాస్తురీత్యా బాగా ప్రణాళిక చేయబడిన నగరం. ఈ నగరం భారతదేశ వాస్తుశిల్పులైన హెచ్.కే.మేవాడా, ప్రకాష్ ఎమ్ ఆప్టే అనే ఇద్దరు వాస్తు శిల్పుల ఆధ్వర్యంలో ప్రణాళికను తయారుచేసి, నిర్మించారు. చండీగఢ్ తరువాత, గాంధీనగర్ భారతదేశంలో రెండవ ఉత్తమ ప్రణాళికాబద్ధమైన నగరం.

చరిత్ర

నేటి గాంధీనగర్, 13 వ శతాబ్దంలో పేటాపూర్ పరిధిలో పేటాసి౦గ్ రాజు రాజ్యంలో ఉన్న ప్రదేశం. జాతిపిత మహాత్మా గాంధీ పేరిట వున్న ఈ నగరం ఇప్పుడు గుజరాత్ రాజధాని.

భౌగోళ స్థితి

అహ్మదాబాద్ నుండి కేవలం 27 కిలోమీటర్ల దూరంలో గుజరాత్ నగరం ఈశాన్య మధ్య భాగం వద్ద ఉంది. ఒక సెలయేరు మినహా వేసవిలో సాధారణంగా ఎండిపోయి ఉండే సబర్మతి నది ఒడ్డున ఈ నగరం ఉంది.

వాతావరణం

సాధారణంగా గాంధీనగర్ వేడి, పొడి వాతావరణాన్ని కలిగిఉంటుంది. వేసవి, వర్షాకాలం, శీతాకాలం ఇక్కడి సీజన్లు. గాంధీనగర్ లో నైరుతీఋతు పవనాల కారణంగా ఋతుపవనాల సమయంలో పుష్కలంగా వర్షాలు పడతాయి. శీతాకాలం సాపేక్షంగా మధ్యస్తంగా ఉంటుంది.

జనాభా వివరాలు

గాంధీనగర్ లో 95% వరకు ఎక్కువమంది హిందువులు, కానీ తరువాత ఉద్యోగ వేటకు అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చారు, గాంధీనగర్ కు అన్ని రకాల నేపథ్యాలవారు, అన్ని మతాల వారు స్థిర పడడం వలన కాస్మోపాలిటన్ నగరంగా అభివృద్ది చెందింది.

అనుసంధానం

అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి స్థానిక, అంతర్జాతీయ ప్రయాణీకులు గాంధీనగర్ చేరుకోవచ్చు. బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం, గాంధీనగర్ రాబోయే మెట్రో ప్రణాళిక గాంధీనగర్ లో రవాణా యొక్క అత్యంత ప్రధాన లక్షణాలు. గాంధీనగర్ కూడా విటిసిఒఎస్ సర్వీసుతో, ఎక్కువగా సిఎంజి ఇంధనంతో నడుపబడే స్థానిక బస్సులు ఉన్నాయి. రోడ్డు జాతీయ రహదారి ద్వారా ముంబై కి అనుసంధానించబడి ఉంది. అహ్మదాబాద్, భారతదేశంలోని అన్ని నగరాల ను కలిపే సమీప రైల్వే స్టేషన్.

ఆకర్షించే ప్రదేశాలు

మహాత్మా మందిర్, అక్షరధామ్ ఆలయం, ఇంద్రోడా డైనోసార్, శిలాజ పార్కు, సరిత ఉద్యాన్ లాంటి ప్రాంతాలు గాంధీనగర్ లో చూడదగ్గవి. మహాత్మా మందిరం బాపూజీ జీవిత సమాచారం, సాహిత్యం వివరణలు అందించే కేంద్రం. ఈ ప్రాంగణంలో ఆడిటోరియం, ప్రేయర్ హాలు, ధ్యాన మందిరం, వడికే పెద్ద రాట్నం ఉన్నాయి. గాంధీనగర్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదాలాజ్ మెట్ల బావి కూడా ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ బావి గోడలపై జైన్, హిందూ మతాలు, పౌరాణిక అర్ధాలతో, అనేక రాతి చేక్కుళ్ళతో ఐదు అంతస్థులను కలిగిఉంది. భారతదేశ జురాసిక్ పార్కుగా పిలువబడే ఇంద్రోడా డైనోసార్, ఫాసిల్ పార్కు మరో ఆసక్తికరమైన పర్యాటక కేంద్రం. ఈ ప్రాంతం డైనోసార్ గుడ్లకు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం. ఈ పార్కులో దుప్పుల పార్కు, పక్షుల పార్కు, పాముల పార్కు మొదలైన అనేక ఇతర విభాగాలు కూడా ఉన్నాయి. ఇక్కడి ఎడ్యుకేషనల్ పార్కు లో సముద్ర క్షీరదాలకు చెందిన అనేక అస్తిపంజరాలు కూడా ఉన్నాయి. ఈ పార్కు లోపల అడవిలో సరీసృపాలు, నీల్గాయి లు, లాంగార్స్, మగకోళ్ళు వంటి అనేక వన్య ప్రాణులను కూడా చూడవచ్చు. ఈ పార్కు గుజరాత్ ఎకోలజికల్ ఎడ్యుకేషన్, రిసర్చ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నడుస్తోంది.

గాంధీనగర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

గాంధీనగర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం గాంధీనగర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? గాంధీనగర్

  • రోడ్డు ప్రయాణం
    గాంధీనగర్ నుండి సమీపం లోని అహ్మదాబాద్, రాజ్ కోట్ వంటి ప్రదేశాలకు తరచుగా ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు లు కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    గాంధీనగర్ లోని ఖిదోయర్ మందిర్ రైలు స్టేషన్ ఇది.14 కి. మీ. ల దూరం లో కలదు. సమీపం లోని అహ్మదాబాద్ నుండి వివిధ ప్రదేశాలకు రైళ్ళు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయి పటేల్ ఎయిర్ పోర్ట్ సమీపం గా వుంటుంది. ఇక్కడ నుండి స్థానికంగానే కాక విదేశాలకు కూడా విమానాలు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Jul,Sat
Return On
26 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Jul,Sat
Check Out
26 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Jul,Sat
Return On
26 Jul,Sun