Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఇస్లాంనగర్

ఇస్లాంనగర్ -మర్చిపోయిన రాజధాని !!

11

కొద్ది కాలం పాటు భోపాల్ రాజ్యానికి రాజధానిగా ఉన్నందువల్ల ఇస్లాం నగర్ ఒక చారిత్రిక ప్రాధాన్యం వున్న నగరం. ఇది మధ్య ప్రదేశ్ లోని భోపాల్ జిల్లా లో, భోపాల్ – బేరసియా రోడ్డు మీద రాష్ట్ర రాజధాని నుంచి 12 కిలోమీటర్ల దూరంలో వుంది. దీని గత వైభవానికి చిహ్నాలుగా మిగిలిన పాడుపడిన భవంతుల వల్ల ఇస్లాం నగర్ ప్రసిద్ది చెందింది. ఈ నగరానికి రవాణా సౌకర్యం బాగుంది.

ఇస్లాం నగర్ : అందమైన నగరం :

రాజపుత్రులు ఏలిన ఈ ప్రాంతాన్ని అసలు జగదీశ్ పూర్ అనేవారు. ఆఫ్ఘన్ సేనాని దోస్త్ మొహమ్మద్ ఖాన్ 18వ శతాబ్దంలో ఈ నగరాన్ని చేజిక్కించుకున్నాడు. ‘ఇస్లాం కు చెందిన నగరం’ అని అర్ధం వచ్చే ఇస్లాం నగర్ అని అతను పేరు పెట్టాడు. భోపాల్ రాజ్యాన్ని అతడే స్థాపించి ఇస్లాం నగర్ ను తన రాజధానిగా ప్రకటించుకున్నాడు. అయితే 1723 లో నిజాముల్ ముల్క్ ఇస్లాం నగర్ కోటను తన అధీనంలోకి తెచ్చుకోవడంతో అతని పాలన కొద్ది కాలం పాటే సాగింది. చివరికి 1806 నుంచి 1817 వరకు ఇది సిందియాల పాలనలో వుంది. ఇప్పుడది భోపాల్ నియంత్రణలో వుంది. ఈ ప్రాంతంలోని భవంతులన్నిటి చుట్టూ అద్భుతమైన తోటలు వుంటాయి.

ఇస్లాం నగర్ లో పర్యాటకం

ఇస్లాం నగర్ లో ప్రధానంగా భవంతులే ఆకర్షణలు. చమన్ మహల్ అందం, రాణి మహల్ రాజసం, గోండ్ మహల్ నిర్మాణ కౌశలం ఇక్కడ చూసి తీరాల్సిన ప్రదేశాల్లో కొన్ని. భోపాల్ నుంచి నడిచే లోకల్ బస్సులు, ఆటో లలో ఇక్కడికి చేరుకోవచ్చు. పర్యాటకుల సౌకర్యం కోసం ఇక్కడ హోటళ్ళు, ఏ.టి.ఎం లు వున్నాయి. శీతాకాలంలో ఇస్లాం నగర్ సందర్శన సిఫార్సు చేయబడుతోంది.

ఇస్లాంనగర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఇస్లాంనగర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఇస్లాంనగర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఇస్లాంనగర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా ఇస్లాంనగర్ స్థానిక బస్సులు, సమీప పట్టణాల నుండి ఆటో రిక్షాలు, ప్రత్యేకంగా భోపాల్ కు బాగా అనుసంధానించబడి ఉంది. భోపాల్ నుండి ఇస్లాంనగర్ కు సాధారణ కాబ్ లు 2200 రూపాయల ఖర్చుతో, ఏ/సి కాబ్ లు 3000 రూపాయల ఖర్చుతో టాక్సీలు నడుస్తాయి. భోపాల్ నుండి ఇస్లాంనగర్ కు కారు లేదా బస్సులలో వెళ్ళడం చాలా శులభం.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా ఇస్లాంనగర్ కు సమీప రైల్వే స్టేషన్ భోపాల్ వద్ద ఉంది. భోపాల్ రైల్వే స్టేషన్ జ౦క్షన్ ఇస్లాంనగర్ చిన్న గ్రామం నుండి షుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. భోపాల్ జ౦క్షన్ రాష్ట్రం లోని, దేశం లోని ఇతర ప్రాంతాలకు రైళ్ళ ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా భోపాల్ వద్ద ఉన్న రాజ భోజ్ ఇస్లాంనగర్ కి సమీప విమానాశ్రయం. ఇది పురాతన రాజధాని నగర౦ నుండి 11.2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భోపాల్ నుండి ఇతర పట్టణాలకు, దేశాలకు అనుసంధానించబడి ఉన్న అనేక విమానాలు కలిగిన అంతర్జాతీయ విమానాశ్రయం. భోపాల్ నుండి షుమారు 2200 ఖర్చుతో ఇస్లాంనగర్ కు టాక్సీలు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Jun,Fri
Return On
13 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Jun,Fri
Check Out
13 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Jun,Fri
Return On
13 Jun,Sat