ఋగ్వేదం ప్రకారం, అశ్వినులు అనబడే జంట దేవతలను ఇంద్రుడు, సోముడు మరియు అగ్ని తరువాత అత్యంత ముఖ్యమైన దేవతలుగా భావిస్తారు. వీరి ప్రాముఖ్యత కి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి సత్యాన్ని సమర్ధించేవారు, అబద్దానికి పూర్తి వ్యతిరేకులు.
రెండవది, వాళ్ళు ఎప్పుడు గుర్రాలపైనే ఉంటారు. మూడవది, వారు అద్భుతమైన వైద్యులు. వారు, నిజానికి, దేవతలకు వైద్యులు. దేవుళ్ళకు లేదా దేవతలకు ఎప్పుడైనా సుస్తీ చేస్తే వీరు వెంటనే వెళ్లి వారికీ వైద్యాన్ని అందిస్తారు. వారు భూమి పై ఉన్న వారి మీద కూడా దయతో వ్యవహరిస్తారు. వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు.
అశ్విని కుమారులకు అంకితమివ్వబడిన మందిరం జింద్ లో ఉంది. నగరానికి ఇవతల వైపున 14 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఈ పవిత్ర మైన స్థలం గురించి మహాభారతం లో పడంద్ పురాణం, నరడియా పురాణం మరియు వామన పురాణం లో చెప్పబడింది.
ఇతిహాసాల ప్రకారం, అశ్విని కుమారలో చేసే పుణ్యస్నానానికి ఆత్మని శుద్ధి చేసి మోక్షం ప్రసాదించే శక్తి ఉంది. ఈ పవిత్రమైన ప్రదేశం లో ఉన్న నీటికి ఔషద గుణాలు ఉన్నాయి. ఎన్నో నయం కాని రోగాలను నయం చేసే శక్తి ఉంది. ఈ మందిరం లో అందమైన రెండు దేవతా విగ్రహాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications