Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కుంభాల్ ఘర్

కుంభాల్ ఘర్- చారిత్రక ప్రదేశం

23

రాజస్ధాన్ లోని రాజసమండ్ జిల్లాలోని కుంభాల్ ఘర్ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశం రాష్ట్రంలోని దక్షిణ భాగంలో కలదు. దీనిని కుమభాల్ మేర్ అని కూడా అంటారు. రాజస్ధాన్ రాష్ట్రంలో కుంభాల్ ఘర్ కోట రెండవ ప్రాధాన్యతగల కోట. దీనిని 15వ శతాబ్దంలో రాణా కుంభ నిర్మించాడు. కోట పై భాగం నుండి పర్యాటకులు విస్తృత దృశ్యాలను చూడవచ్చు. పొడవైన కోటగోడ శత్రువులనుండి రక్షించుకునేందుకు నిర్మించబడింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత రెండవ పొడవైన కోట గోడగా చెపుతారు. మేఘాల ప్యాలెస్ రాజస్ధాన్ లోని ఇతర ప్రదేశాలవలెనే, కుంభాల్ ఘర్ లో కూడా అందమైన ప్యాలెస్ లు ఉన్నాయి. వాటిలో బాదల్ మహల్ ఒకటి. దీనిని మేఘాల ప్యాలెస్ అని అంటారు. దీనిలోనే మర్దనా మహల్ మరియు జనానా మహల్ అనేవి కలవు. ప్యాలెస్ లోని సుందరమైన గదులు పేస్టెల్ రంగు కుడ్య చిత్రాలచే అలంకరించబడ్డాయి. ఈ గదులు వారి ప్రత్యేక ఎయిర్ కండిషనింగ్ విధానాన్ని తెలుపుతాయి.

కుంభాల్ ఘర్ లో సైట్ సీయింగ్ ఎలా?

అందమైన ప్రదేశాలే కాక కుంభాల్ ఘర్ లో దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో వేది దేవాలయం, నీలకంఠ మహదేవ దేవాలయం, ముచ్చల్ మహావీర్ దేవాలయం, పరశురాం దేవాలయం, మమ్మదేవ్ దేవాలయం మరియు రాణక్ పూర్ జరైన్ దేవాలయం ప్రసిద్ధి గాంచినవి.

కుంభాల ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం లో నాలుగు కొమ్ముల జింక లేదా చిరుతపులులు, అడవి, తోడేళ్ళు, ఎలుగు బంట్లు, నక్కలు, సాంబార్ లు, చింకారాలు, చిరుతపులులు, హైనాలు, అడవి పిల్లులు, మరియు కుందేళ్ళు వంటివి చూడడానికి చక్కటి ప్రదేశం. పర్యాటకులు తోడేళ్ళు గుర్తించేందుకు ఈ రాష్ట్రం మాత్రమే అభయారణ్యంగా ఉంది. హల్ది ఘాటి మరియు ఘనేరావ్ కుంభాల్ ఘర్ ఇతర పర్యాటక ఆకర్షణలు.

కుంభాల్ ఘర్ చేరటం ఎలా? పర్యాటకులు సులువుగా విమాన, రైలు, మరియు రోడ్డు మార్గాలలో చేరవచ్చు. ఉదయపూర్ లోని మహారాణా ప్రతాప్ విమానాశ్రయం లేదా డబోక్ విమానాశ్రయం సమీప విమానాశ్రయాలు. విదేశీ పర్యాటకులు న్యూ ఢిల్లీ ఇందిరా మహాత్మా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కూడా చేరవచ్చు. ఫాల్నా జంక్షన్ రైల్వే స్టేషన్ కుంబాల్ ఘర్ కు సమీప రైలు స్టేషన్ . ముంబై, అజ్మీర్, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్, జోధ్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు తరచుగా రైళ్లు కలవు. పర్యాటకులు కుంభాల్ ఘర్ చేరుకోవడానికి విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్ లనుండి క్యాబ్ లు లభిస్తాయి. ప్రైవేటు మరియు ప్రభుత్వ బస్సులు ఉదయపూర్ అజ్మీర్, జోధ్పూర్ మరియు పుష్కర్ పట్టణాలనుండి అందుబాటులో ఉన్నాయి.

వాతావరణం కుంభాల్ ఘర్ ఏడాది పొడవునా అనుకూల వాతావరణం అనుభూతిని కలిగిస్తుంది. అయితే, ఈ ప్రదేశం సందర్శించడానికి అనువైన సమయం అక్టోబరు నుంచి మార్చినెలలు. ఈ సమయంలో పర్యాటకులు కుంభాల్ ఘర్ పర్యటన అధికంగా ఆనందించగలరు.

 

 

కుంభాల్ ఘర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కుంభాల్ ఘర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కుంభాల్ ఘర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కుంభాల్ ఘర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం ఉదయపూర్, అజ్మీర్, జోధ్ పూర్, పుష్కర్ ల నుండి తరచుగా నడిచే ప్రయివేట్ లేదా ప్రభుత్వ బస్సులలో పర్యాటకులు సౌకర్యవంతంగా కుంభాల్ ఘర్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    కుంభాల్ ఘర్ కు సమీప రైలు స్టేషన్ ఫల్నాలో కలదు. ఇది ముంబై, అజ్మీర్, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్ మరియు జోధ్ పూర్ లకు తరచు ట్రైన్ సర్వీసులు కలిగి ఉంది. ఇక్కడినుండి కుంభాల్ ఘర్ కు క్యాబ్ లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం కుంభాల ఘర్ ప్రదేశానికి మహారాణా ప్రతాప్ విమానాశ్రయం లేదా డబోక్ విమానాశ్రయం ద్వారా చేరవచ్చు. ఇది ఉదయపూర్ లో సుమారు 116 కి.మీ. ల దూరంలో కలదు. ఈ విమానాశ్రయం నుండి ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మరియు జైపూర్ మరియు జోధ్ పూర్ లకు విమానాలు తరచుగా నడుస్తాయి. మహారాణా ప్రతాప్ విమానాశ్రయంనుండి కుంభాల్ ఘర్ కు ప్రి పెయిడ్ టాక్సీలు దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed