Search
  • Follow NativePlanet
Share
» »మీ ఐఆర్‌సిటిసి ఖాతాకు ఆధార్‌ లింక్ చేశారా?!

మీ ఐఆర్‌సిటిసి ఖాతాకు ఆధార్‌ లింక్ చేశారా?!

మీ ఐఆర్‌సిటిసి ఖాతాకు ఆధార్‌ లింక్ చేశారా?!

మ‌న దేశంలో ఒక‌చోట నుంచి మ‌రో చోట‌కు ప్రయాణించడానికి ప్రజలు ఎక్కువగా రైలును ఉపయోగిస్తారు. ప్రస్తుతం చాలా మంది రైలులో ప్రయాణించేందుకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ విధానం వారికి అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మ‌రీముఖ్యంగా టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ప్రజలు IRCTC వెబ్‌సైట్ లేదా దాని యాప్‌ని ఉపయోగిస్తారు.

ఎందుకంటే, IRCTC అనేది ప్రభుత్వ ప్లాట్‌ఫాం. దీని ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. అయితే, ఇప్పుడు IRCTC ఖాతాకు ఆధార్ కార్డ్‌ను లింక్ చేయడం ద్వారా కొన్ని అధ‌న‌పు ప్రయోజనాలను కూడా పొందే అవ‌కాశం ఉంది. IRCTC ఖాతాను ఆధార్‌తో ఎలా లింక్ చేయవచ్చు అలాగే, దాని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకుందాం.

Aadhaar link to IRCTC account

ఆధార్‌ను ఇలా లింక్ చేయాలి..

ముందుగా IRCTC ఖాతాను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడానికి, IRCTC వెబ్‌సైట్‌కి వెళ్లాలి. దీని తర్వాత ఇప్ప‌టికే ఉన్న‌ మీ ఖాతాకు లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మీరు హోమ్ పేజీలోని మై అకౌంట్ అనే ఆప్షన్‌పై క‌నిపించే లింక్ యువర్ ఆధార్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత, మీరు ఆధార్ కార్డ్‌లో నమోదు చేసిన ఆధార్ నంబర్ మరియు వర్చువల్ ఐడి మొదలైన పూర్తి సమాచారాన్ని ఆధార్ కార్డుపై ఉన్న‌ది ఉన్న‌ట్లుగా ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ వివ‌రాలు ఇచ్చే స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఎలాంటి పొర‌పాటు జ‌రిగినా వివ‌రాలు న‌మోదుకాబ‌డ‌వు. త‌ర్వాత‌ చెక్ బాక్స్‌కి వెళ్లి, OTP ఆప్ష‌న్‌ను ఎంపికను ఎంచుకోవాలి. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ తర్వాత వెరిఫై ఓటీపీని ఎంచుకోవాలి. ఈ విధంగా KYC పూర్తవుతుంది. దీని తర్వాత మీ ఆధార్ కార్డ్ IRCTC ఖాతాతో లింక్ చేయబడుతుంది. క‌న్‌ఫ‌ర్‌మేష‌న్‌ లింక్‌ని పొందుతారు. మ‌ళ్లీ IRCTC వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. త‌ర్వాత లాగిన్ టిడీతో టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు.

Aadhaar link to IRCTC account

ఎలాంటి ప్ర‌యోజ‌నాలు ఉంటాయి

మీరు IRCTC ఖాతాను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయకపోతే, ప్రతి నెలా ఆరు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఇది కుటుంబస‌మేతంగా ప్ర‌యాణం చేసేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకే నెల‌లో ఎక్కువ ప్ర‌యాణం చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఐఆర్‌సిటిసి ఖాతా ఉన్న‌ప్ప‌టికీ బుకింగ్ కౌంట‌ర్‌కు వెళ్ల‌క త‌ప్ప‌దు. అదే మీరు IRCTC ఖాతాతో ఆధార్ కార్డ్‌ని లింక్ చేస్తే, నెల‌కు ఆరు కాకుండా 12 రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

ఈ అవ‌కాశం ప్ర‌తి నెలా ఉండ‌టం వ‌ల్ల బుకింగ్ కౌంట‌ర్ల చుట్టూ తిర‌గాల్సిన ప‌నిలేకుండా ఉంటుంది. దీనితో పాటు, మీరు మీ IRCTC ఖాతాను ఆధార్‌తో లింక్ చేస్తే, రైల్వే ద్వారా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కూడా పొందవచ్చు. ఇది కాకుండా, IRCTC ఖాతా యొక్క లక్కీ డ్రా స్కీమ్‌లో ఎంపికైన ఆధార్ లింక్‌ రూ. 10,000 నగదును కూడా పొందవచ్చు. ఈ ల‌క్కీ డ్రాకు సంబంధించి నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. మ‌రిన్ని వివ‌రాల‌కు ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X