India
Search
 • Follow NativePlanet
Share
» »సామాన్య భార‌తీయ సంద‌ర్శ‌కుల‌కు షాక్ ఇస్తోన్న భూటాన్ ఎంట్రీ ఫీజ్‌!

సామాన్య భార‌తీయ సంద‌ర్శ‌కుల‌కు షాక్ ఇస్తోన్న భూటాన్ ఎంట్రీ ఫీజ్‌!

భూటాన్‌ గౌరవంగా 'భారతీయులకు స్వాగతం లేదు' అని చెబుతోందా? అంటే, అవున‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే, నేరుగా కాకుండా భారీ ఎంట్రీ ఫీజుతో షాక్ ఇస్తోంది ఈ హిమాలయ దేశం.

ఇటీవల రెండు సంవత్సరాల తరువాత సెప్టెంబర్ 23 నుండి పర్యాటకుల కోసం తన సరిహద్దులను తెరవనున్నట్లు ప్రకటించింది. స‌స్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజు (ఎస్డీఎఫ్) అని పిలువబడే ఫీజుతో త‌మ దేశంలోకి అడుగుపెట్టే ప్రతి భారతీయుడికి రోజుకు 15 డాలర్లు (రూ.1,200), ఇతర దేశీల‌కు రోజుకు 200 డాలర్లు (రూ.16,000) వ‌సూళు చేయ‌నుంది.

సామాన్య భార‌తీయ సంద‌ర్శ‌కుల‌కు షాక్ ఇస్తోన్న భూటాన్ ఎంట్రీ ఫీజ్‌!

సామాన్య భార‌తీయ సంద‌ర్శ‌కుల‌కు షాక్ ఇస్తోన్న భూటాన్ ఎంట్రీ ఫీజ్‌!

భూటాన్‌ గౌరవంగా 'భారతీయులకు స్వాగతం లేదు' అని చెబుతోందా? అంటే, అవున‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే, నేరుగా కాకుండా భారీ ఎంట్రీ ఫీజుతో షాక్ ఇస్తోంది ఈ హిమాలయ దేశం. ఇటీవల రెండు సంవత్సరాల తరువాత సెప్టెంబర్ 23 నుండి పర్యాటకుల కోసం తన సరిహద్దులను తెరవనున్నట్లు ప్రకటించింది.

స‌స్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజు (ఎస్డీఎఫ్) అని పిలువబడే ఫీజుతో త‌మ దేశంలోకి అడుగుపెట్టే ప్రతి భారతీయుడికి రోజుకు 15 డాలర్లు (రూ.1,200), ఇతర దేశీల‌కు రోజుకు 200 డాలర్లు (రూ.16,000) వ‌సూళు చేయ‌నుంది. ప్రయాణ ఖర్చులు, హోటల్ బుకింగ్ లు మొదలైనవి వీటికి అదనం.

నిజంగా కొత్త విధానంలో ఏముంది?

నిజంగా కొత్త విధానంలో ఏముంది?

భూటాన్ స్పష్టంగా 'అధిక విలువ, తక్కువ పరిమాణం' పేరుతో త‌మ పర్యాటక రంగంలో ప్రయోగాలు చేయాలనుకుంటుంది. ఇతర పర్యాటక కేంద్రాల్లోనూ కోవిడ్ అనంతరం రోజువారీ పన్నును ప్రవేశపెట్టాలని చూస్తున్నప్పటికీ, భూటాన్‌తో పోల్చుకుంటే లెవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉంది. ఉదాహరణకు, వెనిస్ వచ్చే సంవత్సరం నుండి రోజుకు $ 3-10 రోజువారీ స‌ర్‌ఛార్జీల‌ను పరిశీలిస్తోంది.

"ఈ కొత్త విధానం భూటాన్ ప‌ర్యాట‌క‌ పరిశ్రమలో ప్రయాణ అనుభవాన్ని సరసమైన, ఆరోగ్యకరమైన పోటీ ద్వారా ఎలివేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది" అని టూరిజం కౌన్సిల్ ఆఫ్ భూటాన్ పేర్కొంది. మ‌న‌దేశంలోని ర‌వాణా రంగం దీనిని 'భారతీయులకు స్వాగతం పలకడం లేదు' అని భూటాన్ మర్యాదగా చెబుతోంద‌ని అభిప్రాయ‌ప‌డుతోంది. 'ఎస్డిఎఫ్ ముమ్మాటికీ భారతదేశం నుండి ప్రయాణించాలనుకునే పర్యాటకులకు తీవ్ర న‌ష్టం చేకూర్చేదిగా భావిస్తున్నారు. గ్రూప్ ఎయిర్ ఫేర్ డిస్కౌంట్లు, విద్యార్థులకు డిస్కౌంట్లు, రాయల్టీ మినహాయింపు, కుటుంబ పర్యటనలు లేనందున విమాన ఛార్జీల ఖర్చు రూ .23,000 నుండి రూ .48,000 కు రెట్టింపు అయింది' అని ట్రావెల్ సెక్టార్ నిపుణుడు ఒకరు తెలిపారు.

భార‌తీయ ప‌ర్యాట‌కుల సంఖ్య అధికం..

భార‌తీయ ప‌ర్యాట‌కుల సంఖ్య అధికం..

ఇప్పటి వరకు భూటాన్‌ను సందర్శించే భారతీయులపై ఎలాంటి సుంకం విధించలేదు. దేశంలోకి ప్రవేశించడానికి వారికి ఏదైనా గుర్తింపు రుజువు, పాస్‌పోర్ట్‌ అవసరం లేదు. జూన్ 2020 లో, భూటాన్ సందర్శించే భారతీయులపై సర్ఛార్జ్ విధించింది. ఇతర దేశాల ప్రజలపై విధించే 65 డాలర్లలో ఇది 12 శాతం ఉంది. అప్పటికి కోవిడ్ లాక్ డౌన్ ప్రారంభం కావ‌డంతో భూటాన్ స‌రిహ‌ద్దును తానుగా మూసివేసింది. 'భూటాన్‌తో భారత్ బలమైన దౌత్య, రాజకీయ, వాణిజ్య సంబంధాలను పంచుకుంటోంది. కాబట్టి ఈ లెవీ నిర్ణ‌యంతో దానిపై ప్ర‌భావం ఉండ‌దు.

దీనిని ఎదుర్కోవడానికి ఉత్తమ మార్గం భారతదేశానికి ప్రయాణించే భూటాన్ జాతీయులకు పరస్పర రుసుమును విధించడం" అని నిపుణులు సూచించారు. నిజానికి, 2020 కోవిడ్ వ్యాప్తి స‌మ‌యంలో భూటాన్‌లో పర్యాటకుల రాక 90 శాతం తగ్గింది. ఆ సంవత్సరం భూటాన్ కు వచ్చిన 29,812 మంది పర్యాటకులలో 22,298 మంది భారతదేశం నుండి వ‌చ్చిన వారే. భారతీయుల నుంచి రూ.1,200 ఎస్ డిఎఫ్ వసూలు చేయబడుతుందా లేదా రద్దు చేయబడుతుందా అనేది కాలమే చెబుతుంది. అప్పటి వరకు భారత్‌, భూటాన్‌ల మ‌ధ్య పర్యాటక రంగం డైన‌మాలోనే ఉంటుంది.

  Read more about: bhutan bhutan entry fees
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X