Search
  • Follow NativePlanet
Share
» » రుచిక‌ర‌మైన వంట‌కాలకు...క‌ల‌క‌త్తా కేరాఫ్..

రుచిక‌ర‌మైన వంట‌కాలకు...క‌ల‌క‌త్తా కేరాఫ్..

రుచిక‌ర‌మైన వంట‌కాలకు...క‌ల‌క‌త్తా కేరాఫ్..

క‌ల‌క‌త్తాను ప‌ర్యాట‌క ప్రేమికులు ముద్దుగా సిటీ ఆఫ్ జాయ్ గా పిలుస్తార‌ని మ‌న‌కు తెలుసు. ప్ర‌ధానంగవిలక్షణమైన మరియు రుచికరమైన నోరూరించే తినుబండారాలు రుచుల ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. మీరు క‌ల‌క‌త్తాను సందర్శిస్తున్నారా లేదా అక్కడికి వెళ్ళేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? అక్కడ మీరు తప్పక సందర్శించాల్సిన కొన్నింటిని మీకు పరిచయం చేస్తాం.

పుటిరామ్ లో బ్రేక్ ఫాస్ట్

పుటిరామ్ లో బ్రేక్ ఫాస్ట్

కాలేజ్ స్రీట్ (సూర్య స్ట్రీట్ ) సమీపంలో లో సుమారు 150 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ స్వీట్ షాప్ కచౌరి, పొటాటో కర్రీ, చోలార్ దాల్ వంటి సంప్రదాయక బెంగాలీ బ్రేక్ ఫాస్ట్ లకు పేరొందింది. ఉదయం పూట 9 గంటల లోపే అయిపోయే జిలేబీ ఇక్కడ తప్పక రుచి చూడాల్సిన వాటిలో ఒకటి. ఈ జిలేబీ రుచులు కొన్నేళ్ల‌పాటు మీ మ‌న‌సులో నిలిచిపోతుంది. ఎంజి రోడ్ మెట్రో స్టేషన్ నుంచి కొద్ది దూరంలోనే ఇది ఉంటుంది.

యంగ్ బెంగాల్ హోటల్ లో బెంగాలీ లంచ్

యంగ్ బెంగాల్ హోటల్ లో బెంగాలీ లంచ్

87 ఏళ్ళ నాటి ఈ పాతతరపు హోటల్ సంప్రదాయక బెంగాలీ ఆహారాన్ని అందిస్తుంది. కిద్దర్ పూర్ లో నెలకొన్న ఈ హోటల్ లో అన్నం, చేపకూరలు, శాకాహార వంటకాలతో వడ్డించే భోజనం తప్పక తినాల్సిందే. ముఖ్యంగా శాకాహార ప్రియుల‌కు ఈ ప్రాంతం పెట్టింది పేరు.

పారామౌంట్ షర్బత్స్

పారామౌంట్ షర్బత్స్

కాలేజ్ స్రీట్‌ కు ఎదురుగా, 1918 లో స్థాపించబడిన పారామౌంట్ నోరూరించే పానీయాలకు పెట్టింది పేరు. ఏళ్ళుగా ఎంతోమంది రాజకీయ నాయకులు, స్వ‌తంత్య్ర‌ సమరయోధులు, బంగారు శకం నాటి సినీతారలు, ఇంకా మరెంతో మంది ప్రముఖులు పారామౌంట్ ను సందర్శించారు. కోక-మలై, దబ్-షర్బత్, మ్యాంగో మలై, రోజ్ సిరప్, టామరిండ్ సిరప్ వంటి పానీయాలు బాగా పేరొందాయి. ఇక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో కాక్‌టైల్ రూపంలో నోరూరించే ష‌ర్బ‌త్‌లు దొరుకుతాయి.

గోల్ బరిలో కోశ మటన్

గోల్ బరిలో కోశ మటన్

ఈ పేరు వింటేనే చాలు...నోట్లో నీళ్లూరుతాయి. మటన్ కోశ మరియు రోటీ రుచిలో ఎన్నో రెట్లు మిన్నగా ఉంటాయి. ఇదేమంత పెద్ద ఫ్యాన్సీ షాప్ కాదు. ఇది శ్యామ్ బజార్ మెట్రో స్టేషన్ ఎదురుగా నెలకొంది. గోల్ బరి మూడు తరాలుగా ఆరోరా కుటుంబంచే నిర్వహించబడుతోంది. కోశ్ మాంగ్షో (మటన్)ను రుచికరం చేసేందుకు వాళ్లు ఏమి వాడుతారనేది నేటికీ అంతుబట్టని రహస్యంగానే ఉంది.

Read more about: kolkata west bengal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X