Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పులికాట్

పులికాట్ – సరస్సులు, చరిత్రలు !

10

కోరమాండల్ తీరాన వున్న పులికాట్ తమిళనాడు లోని చిన్న, అందమైన కోస్తా తీర పట్టణం. 17 వ శతాబ్దం నాటి డచ్చి సెటిల్మెంట్ ప్రాంతం అయిన ఈ పట్టణం సజీవ, వైవిధ్య సాంస్కృతిక సంప్రదాయాలు కలిగి వుంది. ఐతే ఈ ప్రాంతం చరిత్ర డచ్చి వారి ఏలుబడి తోనే అయిపోలేదు - చరిత్ర లోని వేర్వేరు కాలాల్లో పోర్చుగీస్, బ్రిటిష్ వారికి కూడా పులికాట్ పెట్టని కోటగా వుండి ఈ ప్రాంతపు సాంస్కృతిక వారసత్వాలకు దోహద పడింది. ఓడ రేవుగా, వాణిజ్య కేంద్రంగా వుండే ఈ పట్టణం గడచినా శతాబ్దాలలో తమిళనాడు వాణిజ్యానికి భారీగా సాయపడింది.

పులికాట్ పర్యాటకుల్లో రెండు విషయాలకు ప్రసిద్ది చెందిదిని – పులికాట్ సరస్సు, పక్షుల అభయారణ్యం. పులికాట్ లోని సరస్సు భారత దేశంలోని రెండో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సుగా పేరొందిన కారణంగా ప్రతి ఏటా లక్షలాది యాత్రికులను ఆకర్షిస్తోంది. పులికాట్ సరస్సులో కలిసిన భౌగోళిక ప్రాంతం ప్రతి ఏటా వలస వచ్చే అనేక జాతుల పక్షులకు ఆవాస కేంద్రంగా కూడా పనిచేస్తోంది. పక్షి జాతుల వైవిధ్యం వల్ల విహంగ వీక్షణం ఇక్కడి ప్రసిద్ధ కాలక్షేపం.

డచ్చి చర్చి, డచ్చి సమాధులు, దీపగ్రుహం, చింతమనీశ్వరార్ దేవాలయం, పెరియ పల్లివసాల్ లాంటి అనేక ఇతర పర్యాటక ఆకర్షణలు కూడా పులికాట్ లో వున్నాయి. ఇక్కడి చర్చిలు, ప్రాచీన భవంతులు, సమాధుల నిర్మాణంలో డచ్చి వారి ప్రభావం బాగా కనిపిస్తుంది.

చెన్నై నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో వుండే పులికాట్ కు రోడ్డు ద్వారా తేలిగ్గా చేరుకోవచ్చు. ఉష్ణమండల వాతావరణం ఉన్నప్పటికీ ఈ ప్రాంతాన్ని తీవ్ర వేసవి లోను భారీ వర్షాల్లోను తప్ప ఎప్పుడైనా సందర్శించ వచ్చు. ప్రాకృతిక సౌందర్యం, అద్భుతమైన పక్షుల సంతతి, వారసత్వ భవంతులు, గొప్ప సాంస్కృతిక చరిత్ర పర్యాటకులకు, చరిత్ర ప్రేముకులకు పసందైన విహార కేంద్రం.

పులికాట్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పులికాట్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పులికాట్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పులికాట్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా : పులికాట్ చేరుకోవడానికి తేలిక మార్గం బస్సుల ద్వారానే. అటు ప్రభుత్వ సర్వీసులతో పాటు ప్రైవేటు బస్సులు కూడా చెన్నై మోఫ్ఫసిల్ టెర్మినస్ నుంచి పులికాట్ కు వెళ్తాయి. సుమారు రెండు గంటలు పట్టే ఈ ప్రయాణానికి దాదాపు 50 రూపాయల టిక్కెట్ వుంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా పులికాట్ నుంచి చెన్నై దగ్గరి రైల్వే స్టేషన్. చెన్నై స్టేషన్ నుంచి దేశంలోని ఇతర నగరాలకు నిత్యం రైళ్ళు నడుస్తాయి. రైల్లో ఇక్కడికి వచ్చే వారు స్టేషన్ నుంచి బాడుగ టాక్సీలు లేదా బస్సుల ద్వారా పులికాట్ చేరుకోవచ్చు. తిరువనంతపురం, బెంగళూరు, హైదరాబాద్ లాంటి దక్షిణ భారత నగరాలకు ఇక్కడినుంచి నిత్యం రైళ్ళు నడుస్తాయి. న్యూ డిల్లీ, కోల్కతా, ముంబై లాంటి ఇతర ప్రధాన నగరాలకు కూడా రైళ్ళు వున్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం.(పులికాట్ నుంచి 74 కిలోమీటర్ల దూరం). చెన్నై నుంచి బెంగళూరు, న్యూ డిల్లీ, ముంబై, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలకు నిత్యం విమానాలు నడుస్తాయి. ఈ విమానాశ్రయం నుంచి కొన్ని విదేశీ నగరాలకు కూడా అంతర్జాతీయ సర్వీసులు వున్నాయి. ఇక్కడికి వాయుమార్గంలో వచ్చే వారు విమానాశ్రయం నుంచి 1500 రూపాయల బాడుగతో పులికాట్ కు కార్లో చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue