Search
  • Follow NativePlanet
Share

సోలన్- భారతదేశపు పుట్టగొడుగుల నగరం !

11

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ఒక అందమైన జిల్లా, సోలన్, ఈ ప్రాంతంలోని విస్తృత పుట్టగొడుగుల వ్యవసాయం ఉన్న కారణంగా "భారతదేశపు పుట్టగొడుగుల నగరం" అని కూడా పిలవబడుతుంది. సముద్ర మట్టానికి 1467 మీటర్ల ఎత్తులో ఒదిగిన సోలన్, అత్యద్భుతమైన అందానికై ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం ఇక్కడి ప్రధాన దైవం అయిన హిందూ దేవత సోలోని దేవి నుండి ఆ పేరు పొందింది. ఈ ప్రాంతం మొత్తం దట్టమైన అడవులు మరియు ఎత్తైన పర్వతాలతో చుట్టబడింది. నగరం యొక్క తూర్పు వైపు, 1986 మీటర్ల ఎత్తులో ఉన్న మాటియుల్ శిఖరాన్ని ఇక్కడ నుండి సులభంగా చూడవచ్చు. నగరం యొక్క ఉత్తర వైపు ఈ ప్రాంతంలో అత్యంత ఎత్తైన కరోల్ శిఖరం ఉంది. కందాఘాట్, కాసోవ్లి, చైల్ మరియు దగషై వంటి ఇతర ప్రసిద్ధ పర్వత పర్యటనలకు సోలన్ ఆధార ప్రదేశంగా (బేస్) ఉంటుంది. ఈ ప్రాంతం, అనేక కొండలు మరియు పర్వతాలతో కూడిన కలప భూమి కావటం వల్ల, ఇక్కడ నిర్మాణం సాధ్యం కాదు.

కరోల్ పర్వత పైభాగానికి సమీపంలో ఒక గుహ ఉంది. స్థానికుల నమ్మకం ప్రకారం, భారతీయ ఇతిహాసం మహాభారతం లో అజ్ఞాత వాసం సమయంలో పాండవులు ఇక్కడ నివసించటం జరిగింది. బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా 1920 లో జరిగిన ఐరిష్ తిరుగుబాటు కూడా ఇక్కడే మొదలయి, ఈ ప్రదేశానికి, గొప్ప చారిత్రక ప్రాధాన్యతను చేకూర్చింది. తరువాత, ఇద్దరు ఐరిష్ సైనికులను చంపివేయటంతో తిరుగుబాటు భగ్నం అయింది. దాని తర్వాత, అనేక మంది తిరగబడిన సైనికులను కారాగారం లో బంధించారు. యుంగ్ ద్రుంగ్ టిబెటన్ ఆరామం, సోలోని దేవి ఆలయం, గూర్ఖా కోట మరియు జతోలి శివాలయం, సోలన్ లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలు కొన్ని. సోలన్ ప్రధానంగా ఒక పారిశ్రామిక పట్టణం. ఈ ప్రాంత ఆర్ధిక వ్యవస్థకు దోహదం చేసే కొన్ని ముఖ్య పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. హిమాలయ పైప్ ఇండస్ట్రీస్, హెచ్.ఎఫ్.సి.ఎల్. మరియు బైమెటల్ కంట్రోల్స్ లిమిటెడ్ ఇక్కడి ప్రఖ్యాత పరిశ్రమలలో కొన్ని.

67 కిలోమీటర్ల దూరంలో ఉన్న చండీగఢ్ విమానాశ్రయం, సోలన్ కి సమీపంలోని విమానాశ్రయం. ఈ విమానాశ్రయం ముంబై, కొత్త ఢిల్లీ, శ్రీనగర్ మరియు జైపూర్ వంటి భారతదేశం యొక్క ప్రధాన నగరాలకు సోలన్ ను కలుపుతుంది. రైలు ద్వారా సోలన్ చేరుకోవాలని కోరుకునే వారు, 44 కి.మీ.ల దూరంలో ఉన్న కాల్కా రైల్వే స్టేషన్ వరకు తమ టిక్కెట్లను తీసుకోవచ్చు. ఈ రైల్వేస్టేషన్ ముంబై, కోలకతా, ఢిల్లీ, మరియు అమృత్సర్ వంటి ముఖ్యమైన భారతీయ నగరాలతో అనుసంధానించబడి ఉంది. రహదారి మార్గంలో సోలన్ చేరుకోవడానికి, ప్రయాణికులు ఢిల్లీ లేదా చండీఘర్ నుండి ప్రైవేటు లేదా ప్రభుత్వ బస్సులు తీసుకోవచ్చు. సోలన్ యొక్క వాతావరణ ఏడాది పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది. యాత్రికులు సంవత్సరంలో ఎప్పుడైనా ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించవచ్చు.

సోలన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సోలన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సోలన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సోలన్

  • రోడ్డు ప్రయాణం
    రహదారి: ఢిల్లీ మరియు చండీఘర్ వంటి ప్రదేశాల నుంచి సోలన్ కు ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులు సులభంగా అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ బస్సులో వ్యయం ఒకరికి సుమారు 200 రూపాయలు ఉంటుంది; ప్రభుత్వ బస్సులు చవకగా మరియు తరచుగా అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం: సోలన్ నగర మధ్యం నుంచి సుమారు 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాల్కా రైల్వే స్టేషన్, సమీపంలోని రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్, దేశంలో మిగిలిన భాగంతో మంచి అనుసంధానం కలిగి ఉంది. కోలకతా, ముంబై, ఢిల్లీ, మరియు అమృత్సర్ వంటి నగరాలకు కలపబడింది. యాత్రికులు రైల్వే స్టేషన్ చేరుకొని సోలన్ కు టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ప్రయాణానికి ఉత్తమ మార్గం సోలన్ పట్టణాన్ని వాయు, రైలు మరియు రహదారి వంటి రవాణా ప్రధాన మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. విమానయానం: సోలన్ సమీపంలోని విమానాశ్రయం నగర నడిబొడ్డు నుండి సుమారు 67 కి.మీ.ల దూరంలో ఉన్న చండీగఢ్ విమానాశ్రయము. ఈ దేశీయ విమానాశ్రయం, కొత్త ఢిల్లీ, ముంబై, శ్రీనగర్, మరియు జైపూర్ వంటి ప్రాంతాలకు అనుసంధానం అయి ఉంది. పర్యాటకులు విమానాశ్రయం వెలుపల నుండి నగరం చేరటానికి టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu