• Follow NativePlanet
Share
» »భారతదేశంలోని 10 ఉత్తమ ప్రదేశాలు

భారతదేశంలోని 10 ఉత్తమ ప్రదేశాలు

Written By: Venkatakarunasri

బడ్జెట్ ట్రావెల్ కేవలం ఎప్పుడూ టూర్లు ప్లాన్ చేసుకొనేవారికే కాదు .. అప్పుడప్పుడూ టూర్లు ప్లాన్ చేసుకునేవారికి సహాయపడుతుంది. ఈ బడ్జెట్ తో మీరు దేశంలోని ఏదేని ప్రదేశానికి కేవలం 10 వేల రూపాయల లోనే చుట్టిరావచ్చు. డబ్బు మిగిలిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ప్రియమైన పర్యాటకులారా !! నాకు తెలుసు మీకు ప్రయాణాలు అంటే ఇష్టమని. ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రయాణాలను చేసి ఉంటారు. అందుకు డబ్బును బాగానే ఖర్చు చేసి ఉంటారు అవునా ? మరి మీ నేటివ్ ప్లానేట్ ఇదంతా చూస్తూ ఊరుకుంటుందా ? అందుకే మీ కోసం ఈ ప్రయాణాలు !!

మంగళూరు

మంగళూరు

మంగళూరు కర్ణాటక లోని కోస్తా తీర ప్రాంతం. ఈ ప్రదేశం మీ బడ్జెట్ కు సరిగ్గా సరిపోతుంది. ఇక్కడి సహజ అందాలు ఆ నగరానికి ఎంతో శోభనిస్తాయి. బీచ్ లు, ఆహారాలు మరియు మతపర ప్రదేశాలతో మంగళూరు మిళితమై ఉంటుంది.

ఏమి చూడాలి ?

తన్నీర్ భావి బీచ్, పనంబూరు బీచ్, మంగళాదేవి ఆలయం

బిన్సార్ బిన్సార్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం

బిన్సార్ బిన్సార్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం

ఇది ఉత్తరాఖండ్ లోని అల్మోర జిల్లాలో కలదు. ఈ ప్రదేశం హిమాలయ పర్వత శ్రేణులు కలిగి వుంటుంది. బిన్సార్ పర్యటనను మీరు తప్పకుండా పది వేల లోపే ముగించుకొని రావచ్చు. ఏమి చూడాలి ? బిన్సార్ కాంతు ప్రదర్శన శాల, బిన్సార్ జీరో పాయింట్, కసర్ దేవి ఆలయం, ఖాలీ ఎస్టేట్ బడ్జెట్ హోటళ్లు : బిన్సర్ లో వసతికై హోం స్టే లు, రిసార్ట్ లు మరియు హోటళ్లు తక్కువ ధరకే దొరుకుతాయి ప్రకాష్ గెస్ట్ హౌస్, బిన్సార్ ఎకో క్యాంప్, ఆయుష్ గెస్ట్ హౌస్, హోటల్ హిమసాగర్

పొల్లాచి

పొల్లాచి

తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో ఉన్న పొల్లాచి కి ఉన్న పేరు ప్రఖ్యాతలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో ప్రకృతి దృశ్యాలకు ఈ ప్రదేశం నిలయం. టాలీవుడ్, కొలీవూడ్ .. ఇలా ఏ వూడ్ అయినా సరే షూటింగ్ లకు ఇక్కడ వాలిపోవలసిందే ! ఇక్కడ కూడా కేవలం 10 వేల లోపే అన్ని ప్రదేశాలను చుట్టిరావచ్చు. ఏమి చూడాలి ? అన్నామలై వైల్డ్ లైఫ్ సంక్చురి మరియు నేషనల్ పార్క్, అజియార్ డ్యాం, త్రిమూర్తి కొండలు, జలపాతాలు, టైగర్ ఫారెస్ట్ బడ్జెట్ హోటళ్లు : కృష్ణ ఇన్, సిల్వర్ హైట్స్ హోమ్ స్టే, మోనికా గార్డెన్ బంగ్లా, పొల్లాచి క్లాసిక్ క్లబ్ మరియు రిసార్ట్

లోనావాలా మరియు ఖండాలా

లోనావాలా మరియు ఖండాలా

మహారాష్ట్ర లోని ఖండాలా మరియు లోనావాలా అందాలను చూడటానికి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళిరావాల్సిందే!! ఈ పర్వత ప్రదేశం మీకు సాహస రహస్యాలను అందిస్తుంది. మాన్సూన్ లో ఈ ప్రదేశాన్ని చూడటం మిస్ చేయవద్దు. ఏమి చూడాలి ? లోహ్ ఘడ్ ఫోర్ట్, భుషి డ్యాం, పవన సరస్సు, లయన్స్ పాయింట్ బడ్జెట్ హోటళ్లు : లయన్స్ డెన్ హోటల్ హోం స్టే, ఆరోమా కాటేజ్, హోటల్ డ్రీమ్ లాండ్, రెయివూడ్ గ్రీన్

హంపి

హంపి

హంపి ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటి. ఇది కర్ణాటక రాష్ట్రంలో కలదు. మీరు పెట్టిన డబ్బుకు మరియు సమయానికి ఇది చక్కటి ప్రదేశం. విజయ నగర సామ్రాజ్యంలో వెలుగు వెలిగిన హంపి నేడు శిధిలావస్థలో ఉన్నది. హంపి ట్రిప్ ను 10 వేల లోపు ముగించుకొని రావచ్చు. ఏమి చూడాలి ? విరూపాక్ష ఆలయం, సంగీత స్తంభాలు, విజయ విఠల ఆలయం, లోటస్ దేవాలయం బడ్జెట్ హోటళ్లు : గౌరీ రిసార్ట్, కిష్కింద హెరిటేజ్ రిసార్ట్, క్లార్క్స్ ఇన్, హోటల్ శాంతి

ధనౌల్తి

ధనౌల్తి

ధనౌల్తి ముస్సొరికి కేవలం 31 కిలో మీటర్ల దూరంలో ఉన్నందువల్ల పర్యాటకులతో అమితంగా ప్రాచుర్యం పొందింది. సందర్శకులు రాక్ క్లైమ్బింగ్, రివర్ క్రాసింగ్, హైకింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి సాహసోపేతమైన క్రీడలలో పాల్గొనవచ్చు. దేశంలోని ఉత్తమ బడ్జెట్ ప్రయాణాలలో ఇది కూడా ఒకటి. ఏమి చూడాలి ? ముస్సోరీ (31 KM ), ధనౌల్తి అడ్వెంచర్ పార్క్, సూర్కంద దేవి ఆలయం, ఎకో క్యాంపు, తాంగ్దర్ క్యాంపు బడ్జెట్ హోటళ్ళు : క్యాంపు ఓ రాయాలీ, హోటల్ స్నో వ్యూ, హోటల్ డ్రైవ్ ఇన్, క్రౌన్ ప్లాజా హోటల్

వయనాడ్

వయనాడ్

పశ్చిమ కనుమల మధ్య అడవులలో నెలకొని ఉన్న వయనాడ్ కేరళలో తప్పక చూడవలసిన ప్రదేశం. మాన్సూన్ లో ప్రయాణించే హౌస్ బోట్ లో కూర్చొని ఉదయాన్నే వేడి వేడి కాఫీ తాగుతుంటే ఆహా ..! ఆ అనుభవం మరిచిపోలేనిది. మీ బడ్జెట్ కు తగ్గ ప్రదేశం ఈ వయనాడ్. ఏమి చూడాలి ? ఎడ క్కల్ గుహలు, చెంబర శిఖరం, వయనాడ్ వైల్డ్ లైఫ్ సంక్చురి, బనసుర సాగర్ డ్యాం బడ్జెట్ హోటళ్లు : వయనాడ్ సేఫ్ హోం, హరితగిరి హోటల్ మరియు ఆయుర్వేదిక్ గ్రామం, పీటర్స్ హిల్ వ్యూ రెసిడెన్సీ, హిలియా రిసార్ట్ (సుల్తాన్ బతేరి)

గోవా

గోవా

గోవా యొక్క అద్భుత బీచ్ దృశ్యాలు, రాత్రి పూట వేసే చిందులు, సముద్ర ఆహారాలు మిమ్మలను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా యువకులు ఈ ప్రదేశాన్ని ఇష్టపడతారు. అది ఎందుకో వారికే తెలియాలి ?! ఏమి చూడాలి ? ఓల్డ్ గోవా, అంజునా బీచ్, దూద్ సాగర్ జలపాతం, వెగేటర్ బీచ్ బడ్జెట్ హోటళ్ళు : సంగోల్డా గ్రీన్జ్, హోటల్ సాయి బాగా(బాగా బీచ్ వద్ద), జోయా డో మార్ రిసార్ట్( కలన్ గూటే), కోల్వా హాలిడే హోమ్స్

మహాబలేశ్వర్

మహాబలేశ్వర్

మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో కల అందమైన ప్రదేశాలలో మహాబలేశ్వర్ ఒక ప్రసిద్ధి చెందిన పర్వత ప్రాంతం. మహాబలేశ్వర్ వెళ్ళేవారు అక్కడి స్ట్రా బెర్రీలు తప్పక తిని తీరాల్సిందే. వినోదాలు, ప్రకృతి అందాలను పంచి ఇచ్చే మహాబలేశ్వర్ ను కొద్ది పాటి తొలకరి జల్లులు పలకరించే సమయంలో తప్పక సందర్శించాల్సిందే ! ఏమి చూడాలి ? విల్సన్ పాయింట్, అర్థర్స్ సీట్, మాప్రో గార్డెన్, వెన్నా సరస్సు, లింగమల వాటర్ ఫాల్ బడ్జెట్ హోటళ్ళు : ప్రతాప్ హెరిటేజ్, శ్రేయాస్ హోటల్, గ్రాండ్ రిసార్ట్, హిరకని గార్డెన్ రిసార్ట్

కోవలం

కోవలం

కోవలం కేరళ రాష్ట్రంలో కలదు. ఇక్కడ కల లైట్ హౌస్ బీచ్, హవా బీచ్ మరియు సముంద్ర బీచ్ లు మీకు, మీ ప్రియమైన వారికి ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి. మరింత శృంగార భరిత సన్నివేశాలు కావాలనుకుంటే, విజింజాం కొండ గుహలకు వెళ్ళండి. ఇవి కోవలం నుండి ఒక కి.మీ. దూరంలో మాత్రమే కలవు. ఏమి చూడాలి ? హవా బీచ్, సముద్రా బీచ్, వేలి టూరిస్ట్ గ్రామం బడ్జెట్ హోటళ్ళు : 16 KM ల దూరంలో ఉన్న తిరువనంతపురం వసతి కై సూచించదగినది. జింజర్ త్రివేండ్రం, పప్పుకుట్టి బీచ్ రిసార్ట్, హోటల్ సిల్వర్ శాండ్, బీచ్ ఫ్లోర్రా ఇన్(కోవలం)

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more