» »భారతదేశంలో దర్శించదగ్గ పది ప్రముఖ పుణ్యక్షేత్రాలు

భారతదేశంలో దర్శించదగ్గ పది ప్రముఖ పుణ్యక్షేత్రాలు

Posted By: Venkata Karunasri Nalluru

భారతదేశంలో దర్శించటానికి అనేక దేవాలయాలు వున్నాయి. ఇందులో నిత్యం మన ఇంట్లో పూజలు జరుపుకునే దేవుళ్ళ యొక్క ప్రసిద్ధ భారతీయ దేవాలయాలు మరియు తీర్థయాత్రల గురించి వివరిస్తున్నాం. మన భారతదేశంలో చూచుటకు అనేక విశిష్టమైన పుణ్యక్షేత్రాలు వున్నాయి. ఈ పుణ్యక్షేత్రాల సందర్శన మానవులలో భక్తిని మరియు ఒక మంచి జీవనమార్గాన్ని ఏర్పరుస్తాయి.

భారతదేశంలో దర్శించదగ్గ పవిత్ర పుణ్యక్షేత్రాలు

1. షిర్డీ

1. షిర్డీ

భారత చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధ గురువులలో ఒకరు సాయిబాబా. సాయిబాబా వెలసిన షిర్డీ సందర్శించవలసిన ప్రదేశాలలో ఒకటి. లక్షలాది మంది భక్తులు సాయిబాబా ఆశీస్సుల కోసం ప్రతి సంవత్సరం షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శిస్తారు.

pc: wikimedia.org

2. తిరుమల

2. తిరుమల

అత్యంత ప్రజాదరణ కలిగిన భారతీయ యాత్రా సందర్శన ప్రదేశం తిరుమల. ఇక్కడ వెలసిన వేంకటేశ్వరస్వామి లేదా తిరుపతి బాలాజీ ఆలయం విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినది అని చెప్పటానికి ఎటువంటి సందేహం లేదు. ఈ ఆలయం వెంకటాద్రి కొండల మీద వున్నది. ప్రతి సంవత్సరం ఈ కొండకు అనేక మంది భక్తులు వస్తారు.

pc:Chandrashekhar Basumat

3. వారణాశి

3. వారణాశి

అతి పురాతన నగరాలలో ఒకటి వారణాసి. భారతదేశంలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రాలలో వారణాశి ఒకటి. కాశీ విశ్వనాథ్ ఆలయం ప్రపంచంలోని అన్ని మూలల నుండి సందర్శకులను ఆకర్షిస్తుంది. జ్యోతిర్లింగ ఆలయం పిలువబడుతుంది. కాశీలో ప్రసిద్ధి చెందిన కాలభైరవ, సంకట మోచన, భారతమాతా ఆలయం వంటి అనేక ఇతర ముఖ్యమైన ఆలయాలు కూడా వున్నాయి.

pc:nopaspoc - Varanasi

4. వైష్ణో దేవి

4. వైష్ణో దేవి

జమ్మూ కాశ్మీర్ లో త్రికూట కొండ దగ్గర ఉన్న ఈ ప్రసిద్ధ గుహాలయం కత్రా పట్టణం నుండి కొంత ఎత్తులో వుంటుంది. ఇక్కడ వెలసిన వైష్ణో మాతా ఆలయం దేశంలోని అతి పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటి. సంవత్సరం పొడవునా ఇక్కడ అసంఖ్యాక భక్తులు సందసందర్శించటానికి వస్తారు.

pc:wikimedia.org

5. పూరి

5. పూరి

అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన జగన్నాథ్ ఆలయం భారతదేశం యొక్క తూర్పు తీరంలో వున్నది. ఈ పవిత్ర ప్రదేశంలో హిందువులు గౌరవించే రథ యాత్ర జరుగుతుంది. ఏడు పవిత్రక్షేత్రాలైన నరసింహ, లోకనాథ్ మరియు మార్కన్డేశ్వర్ వంటి అనేక ఇతర ప్రముఖ దేవాలయాలలో పూరి కూడా ఒకటి.

pc:Abhishek K Saxena

6. మథుర

6. మథుర

మథుర శ్రీకృష్ణుని జన్మస్థలం. మథుర జిల్లా పరిధిలో వున్న మథుర పట్టణం నుండి కొంతదూరంలో వున్న బృందావనం ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ రాధాకృష్ణ దేవాలయాలు ఉన్నాయి. బంకీ బిహారీ, గోవింద్ దేవ్, ఇస్కాన్ మదన్ మోహన్ కీ ఇక్కడ చూడవలసినవి.

pc:Vinayaraj

7. పళని

7. పళని

పళని శివుని కుమారుడు గణేష్ సోదరుడు అయిన సుబ్రమణ్యస్వామి కొలువైవున్నాడు. సుబ్రమణ్యస్వామిని మురుగన్ లేదా కార్తికేయుడు అని కూడా పిలుస్తారు. ప్రధాన మురుగన్ దేవత శివగిరి కొండ మీద ఉన్న పళని మురుగన్ ఆలయంలో కొలువైవున్నాడు. దేశవ్యాప్తంగా భక్తులు ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించటానికి వస్తారు.

pc:Rejeesh Irinave

8. సింగనాపూర్

8. సింగనాపూర్

శనిదేవుడు హిందూమతంలో అత్యంత ప్రసిద్ధ దేవతలలో ఒకరుగా హిందూమతంలో గౌరవించబడ్డాడు. మహారాష్ట్రలో శింగనాపూర్ శనిదేవుని పవిత్రమైన స్థానంగా పరిగణించబడుతుంది. వేలాదిమంది భక్తులు ఇక్కడ తైలాభిషేకం నిర్వహించడానికి మరియు ఆశీర్వాదాల కోసం శనిమహాత్ముని సందర్శించటానికి వస్తారు.

pc:Booradleyp1

9. పండరపురం

9. పండరపురం

మహారాష్ట్రలో మరో పవిత్రమైన హిందూదేవాలయం విఠోబా మరియు ఆయన సతీమణి రుక్మిణి దేవాలయం. ఇక్కడ ప్రసిద్ధ విఠల్ రుక్మిణి మందిరం వుంది. భారతదేశం అంతటా హిందువులు ఇక్కడకు ప్రత్యేకించి శ్రవణ, కార్తీక, మరియు మాఘ మాసాలలో సందర్శించటానికి వస్తారు.

pc: Parag Mahalley

10. ముంబై

10. ముంబై

ముంబై ఒక పెద్ద పుణ్యక్షేత్రమని ఎవ్వరూ భావించారు కానీ ఈ చారిత్రాత్మక నగరంలో సిద్దివినాయక, ముంబాదేవి, బాబుల్ నాథ్, మహాలక్ష్మి దేవాలయాలు వంటి పలు ముఖ్యమైన హిందూ మత కేంద్రాలను కలిగి ఉంది.

pc:Benteohyw