Search
  • Follow NativePlanet
Share
» »పది అంశాలలో ప్రసిద్ధ కేరళ !

పది అంశాలలో ప్రసిద్ధ కేరళ !

కేరళ రాష్ట్రాన్ని 'దేవుడి స్వంత దేశం' గా చెపుతారు. ఈ అంశం అందరూ ఏకీభవించినా ఏకీభవించక పోయినా, ఈ కోస్తా తీర రాష్ట్రం ఏమి ఇవ్వగలదో తెలుసుకున్న తర్వాత కేరళ గురించిన అన్ని సందేహాలు తీరి ప్రతి వారూ కేరళ రాష్ట్రం ఒక గొప్ప రాష్ట్రం అనే తీర్మానానికి వచ్చేస్తారు.

పర్యావరణ టూరిజం లేదా మరొకటి గానీ, కేరళ రాష్ట్రం అక్కడ కల బీచ్ లు, బ్యాక్ వాటర్స్, హిల్ స్టేషన్ లు, ఇతర సహజ ప్రదేశాల తో టూరిస్టులకు వారు మునుపెన్నడూ ఎరుగని ఆనందాలు అందిస్తుంది.

కేరళ గొప్పదనాన్ని వివరించటంలో మేము పది అంశాలను మాత్రమే వివరిస్తున్నాము. పరిశీలించండి.

కేరళ హోటల్ వసతుల్ కొరకు క్లిక్ చేయండి

దేవుడి స్వంత దేశం

దేవుడి స్వంత దేశం

త్రిస్సూర్ పూరం
త్రిస్సూర్ పట్టణంలో జరిగే టెంపుల్ ఫెస్టివల్ ను టెంపుల్ పండుగల తల్లిగా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఏనుగుల పండుగ మే నెలలో జరుగుతుంది. ఈ ఏనుగుల పండుగలో ఏనుగుల అలంకరణ, ఊరేగింపులు ప్రసిద్ధి.
Photo Courtesy: Brian Holsclaw

దేవుడి స్వంత దేశం

దేవుడి స్వంత దేశం

పర్యావరణ పర్యటనలు
కేరళ యొక్క టూరిజం ఇండస్ట్రీ ఒక విలక్షనమైనది. ఈ శాఖ టూరిజం ను పర్యావరణ అనుకూలంగా అభివృద్ధి చేస్తోంది. ఈ అంశం మన దేశానికి టూరిజం కొరకు వచ్చే విదేశీయులను కూడా ఆకర్షిస్తోంది.
Photo Courtesy: Arunguy2002

దేవుడి స్వంత దేశం

దేవుడి స్వంత దేశం

అందమైన ప్రకృతి దృశ్యాలు
కేరళ పేరు చెప్పగాని, ప్రతి ఒక్కరి కళ్ళ ముందు అందమైన కొండలు, లోయలు, ఎగిసిపడే జలపాతాలు, బ్యాక్ వాటర్స్ కనపడతాయి. ఇక్కడ కల బీచ్ లు, అభ్యా అరణ్యాలు, హిల్ స్టేషన్ లు, చారిత్రక కోతలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.
Photo Courtesy: Thejas Panarkandy

దేవుడి స్వంత దేశం

దేవుడి స్వంత దేశం

హౌస్ బోట్స్

కేరళ పేరు చెపితే హౌస్ బోట్స్ గుర్తుకు రావాల్సిందే. ఈ బోటు విహారం చేయండి కేరళ అందాలను మరొక కోణంలో చూస్తూ అనుభూతులు పొందండి.
Photo Courtesy: Kish

దేవుడి స్వంత దేశం

దేవుడి స్వంత దేశం

కథాకళి
కథాకళి నృత్యం ప్రతి ట్రవెల్లెర్ చూడ వలసిన అంశం. ఈ నృత్యం కేరళ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ప్రసిద్ధి కేక్కిన్చినది. కథాకళి నృత్య ప్రదర్శన దానిలో గల అద్భుత మెక్ అప్, భంగిమలు మొదలైన వాటితో పర్యాట కుడి కన్నుల విందు.
Photo Courtesy: trilok rangan

దేవుడి స్వంత దేశం

దేవుడి స్వంత దేశం

కలారి పాయట్టు
కలారి పాయట్టు అనేది ఆ ప్రదేశ్ మార్షల్ ఆర్ట్ లలో తల్లి వంటిది. అతి ప్రాచీనమైన మార్షల్ ఆర్ట్. చైనా లోని కుంగ్ ఫు కు ముందే ఇది కలదు. దీనిని ఒక భారతీయ బౌద్ధ సన్యాసి అయిదు లేదా ఆరు శతాబ్దాలలో చైనా లో కుంగ్ ఫు గా ప్రవేశ పెట్టాడు.
Photo Courtesy: Shinilvm

దేవుడి స్వంత దేశం

దేవుడి స్వంత దేశం

తెయ్యం
ఉత్తర కేరళలో ఈ సాంప్రదాయక నృత్యం ప్రదర్శిస్తారు. తెయ్యం ప్రదేశం ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాలో కలదు.

Photo Courtesy: Jasinth M V

దేవుడి స్వంత దేశం

దేవుడి స్వంత దేశం

బీచ్ లు
సహజ ప్రకృతి అందాలకు కేరళ ప్రసిద్ధి. కేరళ లోని కోవలం, కప్పడ్, వర్కాలా బీచ్ లు ఎన్నో అద్భుత దృశ్యాలను చూపుతూ పర్యాటకులను అలరిస్తాయి.

దేవుడి స్వంత దేశం

దేవుడి స్వంత దేశం

ఆరంముల అద్దాలు
అరణ్ముల అద్దాల పని అనేది ఒక హస్తకళ. ఈ హస్తకలలో సాధారణ మిర్రర్ కాకుండా దానికి బదులు ఒక మెటల్ ఉపయోగించి అడ్డం వాలే దుస్తులను అలంకరిస్తారు. అరణ్ముల అనేది కేరళలోని ఒక గ్రామం పేరు. కేరళ లో వివాహ సమయంలో పెండ్లి కూతురు ఈ దుస్తులను తప్పక ధరిస్తుంది. ఈ మెటల్ ఏమిటి అనేది ఇంత వరకూ ఖచ్చితంగా ఎవరికీ తెలియదు.
Photo Courtesy: Binu Mathew

దేవుడి స్వంత దేశం

దేవుడి స్వంత దేశం

కేరళ ఆహారాలు
కేరళ ఆహారాల పేరు చెపితే, నోటి రుచులు ఊరి పోవాల్సిందే. పర్యాట కుడికి ఈ ఆహార రుచులు ఒక అద్భుతంగా వుంటాయి. తలసేర్రి బిరియాని, మాప్పల్ల బిరియాని , కోచిన్ లోని సముద్ర ఆహారాలు ప్రసిద్ధి.
Photo Courtesy: Samira Khan

కేరళ ఆకర్షణలకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X