Search
  • Follow NativePlanet
Share
» »పన్నెండు నెలలకు పన్నెండు ప్రదేశాలు !!

పన్నెండు నెలలకు పన్నెండు ప్రదేశాలు !!

ఏ నెలలో ఎక్కడ కు వెళ్ళాలి? ఎలా ఆనందించాలి ? అనేదానికి 12 ప్రదేశాలు సిద్దాం చేశాం. అవి చూడండి.

కొత్త సంవత్సరం వస్తున్నది. కాని కొత్త సంవత్సర తీర్మానాలైన జిమ్ వర్క్ అవుట్ లు చేయటం, జంక్ ఫుడ్ మానటం వంటివి సరిగా ఇంకా అమలు కావటం లేదు. మరి మీరు ట్రావెల్ విషయంలో చేసుకున్న తీర్మానం ఎన్నో ప్రదేశాలు చూడాలని కదా ...! మరి దానికి గాను మీకు సహకరించేందుకు ట్రావెల్ ప్లాన్ లు కొన్ని ఇస్తున్నాం పరిశీలించండి. ఏ నెలలో ఎక్కడ కు వెళ్ళాలి? ఎలా ఆనందించాలి ? అనేదానికి 12 ప్రదేశాలు సిద్దాం చేశాం. అవి చూడండి.

జనవరి : రాక్ క్లైమ్బింగ్.

జనవరి : రాక్ క్లైమ్బింగ్.

రాక్ క్లైమ్బింగ్ కు కర్నాటక లోని రామనగరం అనువైనది. హిందీ ఫిలిం షోలే లోని విలన్ గబ్బర్ సింగ్ విశ్రమించిన ప్రదేశం ఇది. ఇక్కడ మొత్తంగా ఏడూ కొండలు కలవు. వాటిలో ప్రధానమైనవి రామదేవర బెట్ట, ఎస్ ఆర్ ఎస్ బెట్ట మరియు తేన్గిన్కల బెట్ట అనేవి. చాలా మంది ప్రొఫెషనల్స్ గ్రూపులుగా ఈ కొండలు ఎక్కుతారు. కొత్తగా రాక్ క్లైమ్బింగ్ చేసేవారికి కూడా ఈ కొండలు అనువైనవే. మీకు ఏ కారణం చేతనైనా కుదరకపోతే, రాం ఘర్ కొండలకు వెళ్ళండి.

ఫోటో క్రెడిట్ :Scalino

ఫిబ్రవరి : కావేరి ఫిషింగ్ క్యాంపు

ఫిబ్రవరి : కావేరి ఫిషింగ్ క్యాంపు

సాహసికులైన మీకు కావేరి ఫిషింగ్ క్యాంపు సరైన ప్రదేశం. ఈ క్యాంపు లో మూడు ప్రదేశాలు కలవు. అవి భీమేశ్వరి, గలిబోర్ మరియు దోద్దమాకలి. ఇక్కడ మీరు కయాకింగ్, ట్రెక్కింగ్, కొరకిల్ అంటే తెప్ప విహారం, మౌంటెన్ బైకింగ్ వంటి క్రీడలు ఆనందించవచ్చు. ఈ క్రీడలతో పాటు, మీరు సుమారు 95 రకాల పక్షులు, మొసళ్ళు, తాబేళ్లు వంటివి కూడా చూడవచ్చు.

ఫోటో క్రెడిట్: Wiki Commons

మార్చ్ : గర్హ్వాల్ లో మౌంటేన్ బైకింగ్

మార్చ్ : గర్హ్వాల్ లో మౌంటేన్ బైకింగ్

బైకింగ్ మార్గం రిషికేశ్ నుండి తెహ్రి వరకు కలదు. ఈ మార్గం భాగీరథి నది ఒడ్డు వెంట వెళుతుంది. ఇంకా ఇతర రూట్లు కూడా కలవు. గర్వాల్ లో మౌంటెన్ బైకింగ్ అనేది వివిధ మార్గాలలో సుమారు 12-16 రోజులు పడుతుంది. బైకర్లు తమ బైకింగ్ లో 30 డిగ్రీల నుండి 10 డిగ్రీల వరకూ వుండే ఇక్కడి ఉష్నోగ్రతల గురించి కూడా జాగ్రత్త పడాలి.

ఫోటో క్రెడిట్ : Wiki Commons

ఏప్రిల్ : గోవా లో క్వాడ్ బైకింగ్

ఏప్రిల్ : గోవా లో క్వాడ్ బైకింగ్

గోవా లో నైట్ లైఫ్ మరియు బీచ్ లే కాదు ఎన్నో ఇతర క్రీడలు కలవు. ఎగుడు దిగుడు కొండలు, విశాలమైన గోవా అడవులు మీకు ఇక్కడ చక్కని క్వాడ్ బైకింగ్ ఆనందాలు ఇస్తాయి.
ఫోటో క్రెడిట్ : Chris_Parfitt

మే : రాజస్థాన్ లో జిప్ లైన్ టూర్

మే : రాజస్థాన్ లో జిప్ లైన్ టూర్

ఒక్కసారి గాలిలోకి ఎగరండి ఎంతో ఎత్తునుండి రాజస్థాన్ లోని పురాతన కోతలు, ఎత్తైన కొండలు చూడండి. ఇక్కడ వచ్చే సాంస్కృతిక కామేన్తరీలతో రాజస్థాన్ లోని ఆళ్వార్ ప్రాంతంలో కల అద్భుత నీం రానా ఫోర్ట్ గురించి తెలుసుకోండి.
ఫోటో క్రెడిట్ : KittyKaht

జూన్ : తేక్కడి లో బంబూ రాఫ్టింగ్

జూన్ : తేక్కడి లో బంబూ రాఫ్టింగ్

బంబూ రాఫ్టింగ్ క్రీడా ఆచరించి వేసవి వేడి నుండి స్వేచ్చ పొందండి. కేరళలోని తేక్కడి లో బంబూ రాఫ్టింగ్ ఇతర ప్రదేశాల బంబూ రాఫ్టింగ్ కంటే భిన్నమైనది. ఇది ట్రావెలర్ లకు ఒక ప్రత్యేకం. వెదురు బద్దలతో తయారు చేసిన ఈ పడవ పై ట్రెక్కింగ్ టూర్ మరువలేనిది. ఇదే సమయంలో మీరు ఇక్కడ కల వన్య జీవులను కూడా చూడవచ్చు. ట్రెక్కింగ్ మరియు రాఫ్ట్ ప్రయాణం చేయవచ్చు.
Image Credit: Wiki Commons

జూలై : రివర్ రాఫ్టింగ్

జూలై : రివర్ రాఫ్టింగ్

అరుణాచల్ ప్రదేశ్ లోని అలాంగ్ గుండా సియోం మరియు సీపు నదుల లో రివర్ రాఫ్టింగ్ సాహస క్రీడలు కోరే వారికి ఎంతో బాగుంటుంది. దీనినే వైట్ వాటర్ రాఫ్టింగ్ అని కూడా అంటారు. నది యొక్క సహజ ప్రవాహం మరియు ప్రాంత అందాలు ఈ ప్రదేశాన్ని రివర్ రాఫ్టింగ్ కు అనుకూలంగా చేసాయి.
Image Credit: Charlie Brewer

ఆగష్టు : రూప కుండ్ లో ట్రెక్కింగ్

ఆగష్టు : రూప కుండ్ లో ట్రెక్కింగ్

రూప కుండ్ లోని అస్తిపంజరాల సరస్సు వద్దకు ట్రెక్కింగ్ చేయండి. సముద్ర మట్టానికి 16000 అడుగుల ఎత్తులో కల ఈ సరస్సులో అనేక అస్థిపంజరాలు ఏ కాలం నాటివో కూడా తెలియనివి ఇక్కడ మీ కొరకు వేచి వుంటాయి. గర్హ్వాల్ జిల్లాలోని రూప కుండ్ ప్రాంత ట్రెక్కింగ్ కనీసం మీకు పది రోజుల కాలం పడుతుంది.
Image Credit: JomyG

సెప్టెంబర్ : హావ్ లాక్ ఐలాండ్

సెప్టెంబర్ : హావ్ లాక్ ఐలాండ్

హావ్ లాక్ ఐలాండ్ లో స్కూబా డైవింగ్ మరియు స్నార్కెలింగ్
హావ్ లాక్ ప్రకృతి అందాలు మిమ్మల్ని స్వాగతిస్తాయి. ఇక్కడ స్కూబా డైవింగ్ ఆనందాలు తప్పని సరి. సౌత్ బటన్ మరియు ఎలిఫెంట్ బీచ్ లు స్కూబా డైవింగ్ కు ఉత్తమం. రాధానగర్ బీచ్ స్నార్కెలింగ్ సాహస క్రీడకు పేరు గాంచినది.
Image Credit: Wiki Commons

అక్టోబర్ : బీర్ లో పరా గ్లైడింగ్

అక్టోబర్ : బీర్ లో పరా గ్లైడింగ్

హిమాచల్ ప్రదేశ్ లోని బీర్ ప్రదేశం ఇండియా లోని పరా గ్లైడింగ్ ఆటకు రాజధాని. బిర్లో అనేక పారా గ్లైడింగ్ ప్రదేశాలు కలవు. అక్టోబర్ నెలలో ప్రతి సంవత్సరం డిపార్టుమెంటు అఫ్ టూరిజం, సివిల్ ఆవిఎషణ్ శాఖ, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 'పరగ్లైదింగ్ ప్రీ వరల్డ్ కప్ ' ప్రోగ్రాం ఇక్కడ నిర్వహిస్తుంది.
Image Credit: Wiki Commons

నవంబర్ : మేఘాలయ గుహల సందర్శన

నవంబర్ : మేఘాలయ గుహల సందర్శన

మేఘాలయ రాష్ట్రంలోని జైంతియా హిల్స్ పై కల కరెం చీం గుహల సందర్సన సూచించ దగినది. శాస్త్రవేత్తలు ఈ గుహ ప్రస్తుతానికి 10.5 కి. మీ. ల పొడవున్నట్లు ఇండియా లోని అయిదవ పొడవైన గుహ గాను తెలుపు తున్నారు. కరెం చీం అనేది ఒక నది ఇది ఇక్కడి గుహలో మూడున్నర కి. మీ. ల దూరం కలదు. దీనిలో స్విమ్మింగ్ చేయవచ్చు. కరెం చీం లోపలి భాగంలో సుమారు 50 సహజంగా ఏర్పడిన డాములు కూడా కలవు. ఈ గుహలో గబ్బిలాల ప్రదేశాలు, నీటిలో చేపల స్థావరాలు కూడా చూడవచ్చు. ఈ గుహల గురించి ఇంకా పరిశోధనలు సాగుతున్నాయి.
Image Credit: Wiki Commons

డిసెంబర్ : పహల్గాం లో స్కయింగ్

డిసెంబర్ : పహల్గాం లో స్కయింగ్

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లోని అనంతనాగ్ జిల్లలో కల పహల్గాం ప్రదేశం స్కయింగ్ కు ప్రసిద్ధి. సముద్ర మట్టానికి సుమారు 2740 మీటర్ల ఎత్తున కల ఈ ప్రదేశం శ్రీ నగర్ కు 95 కి. మీ. ల దూరం లో కలదు. త్రేక్కర్ లకు స్కై లవర్లకు ఈ ప్రదేశం చాలా ఆసక్తిని కలిగిస్తుంది.

Image Credit: Wiki Commons

Read more about: travel పర్యటన
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X