» »15 తరాల మందు ఎలాంటి దుస్తులు ధరించే వారో తెలుసుకోవడానికి వెలుదాం

15 తరాల మందు ఎలాంటి దుస్తులు ధరించే వారో తెలుసుకోవడానికి వెలుదాం

Written By: Beldaru Sajjendrakishore

వేల సంవత్సరాల నాగరిత కలిగిన దేశంగా భారత దేశానికి పేరుంది. ఇన్ని ఏళ్లలో మన సంస్కృతి, సంప్రదాయల్లో ఎంతో మార్పు వచ్చింది. మా ముందు తరాల వారు ఎలా ఉండేవారు, వారు ఏవిధమైన దుస్తులు ధరించేవారు, ఎలాంటి తిండి తినేవారు అన్న ఆలోచనలు పెరుగుతోంది. 15 తరాలు అంటే దాదాపు 1000 ఏళ్ల క్రితం (ఒక తరం సగటు ఆయుస్సు 66 గా లెక్కవేసుకుంటే) జీవన విధానాలు తెలుసుకోవడానికి అప్పటి తాళపత్రగ్రంధాలు లేదా శిల్పాలు చాలా బాగా ఉపయోగపడుతాయి. తాళపత్ర గ్రంథాలు అందరికీ అందుబాటులో ఉండటం లేదు. అయితే వెయ్యేళ్ల క్రితం నిర్మించిన కట్టడాలు ముఖ్యంగా దేవాలయాల్లో అటు వంటి శిల్ప సంపద ఎంతో ఉంది. దీంతో ఇప్పటి యువత సమయం చిక్కితే చాలు అటు వంటి సమాచారం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్లడానికి తమ టూర్ బ్యాగ్ ను సిద్ధం చేసుకుంటున్నారు. అలాంటి వారికి కోసం వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలు మన దేశంలో ఎక్కడ ఉన్నాయన్న సమాచారాన్ని నేటివ్ ప్లానెట్ దేశంలో మీ కోసం తీసుకువచ్చింది. చదవడం, టూర్ బ్యాగ్ ను సిద్ధం చేసుకోవడమే ఇక మీ వంతు....

1.అంబర్ నాథ్ టెంపుల్

1.అంబర్ నాథ్ టెంపుల్

Image source

మహారాష్ర్టలో ఉన్న అంబర్నాథ్ దేవాలయంలో పరమశివుడు ప్రధానంగా పూజలు అందుకుంటారు. స్థానికులు ఈ దేవదేవుడిని అంబరేశ్వరుడిగా కొలుస్తారు. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1060లో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. మొదట ఈ దేవాలయన్ని అప్పట్లో సదరు ప్రాంతాన్ని పాలించిన చిత్తరాజ నిర్మించారు. ఇదిలా ఉండగా పురాణాల ప్రకారం ఈ దేవాలయాన్ని పాండవులు నిర్మించారని తెలుస్తోంది.

2.బృహదీశ్వరాలయం

2.బృహదీశ్వరాలయం

Image source

తమిళనాడులోని తంజావూరులో బృహదీశ్వరాలయం ఉంది. చోళ సంప్రదాయ మొత్తం ఇక్కడి దేవాలయంలోని ప్రతి స్థంభం పై ఉన్న శిల్పంలో కనిపిస్తుంది. అంతే కాకుండా ఇక్కడి ఉన్న గోడల పై ఉన్న చిత్రాలు కూడా ఆనాటి సంస్క`తి సంప్రదాయాలను తెలియజేస్తారు. చరిత్రను అనుసరించి క్రీస్తు శకం 1010 ఏడాదిలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.

3. కైలాసదేవాలయం

3. కైలాసదేవాలయం

Image source

మహారాష్ర్టలోని ఎల్లారా గుహల్లో ఈ కైలాసదేవాలయం ఉంది. దేశంలో రాతిని తొలిచి నిర్మించిన అతి పెద్ద గుహాలయం ఇదే. ఇక్కడ శిల్ప సంపద పల్లవుల కాలం నాటి సంప్రదాయాలను, వస్త్రధారణను తెలియజేస్తుంది.

4. షోర్ దేవాలయం

4. షోర్ దేవాలయం

Image source

ఈ దేవాయం తమిళనాడులోని మహాబళిపురంలో ఉంది. దీనిని పళ్లవ వంశానికి చెందిన నరసింహవర్మ2 క్రీస్తు శకం 720లో నిర్మించినట్లు తెలుస్తోంది. బంగాళాఖాతం ఒడ్డున ఉన్న ఈ దేవాలయం ఉంది.

5,సోమనాథ దేవాయం

5,సోమనాథ దేవాయం

Image source

12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ దేవాలయం గుజరాత్ లోని ఉంది. ఏడో శతాబ్ధంలో దీనిని నిర్మించారు. సోన వంశానికి చెందిన వారు దీనిని మొదటగా నిర్మించారు. అయితే అనేక సార్లు ఈ దేవాలయం పరాయి దేశస్తుల చేతిలో దాడికి గురైంది. అయితే మరళా ఈ దేవాలయాన్ని అప్పట్లో ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజులు పున:నిర్మించారు. ముఖ్యంగా మహ్మద్ ఖజనీ ఈ దేవాలయం పై తొమ్మిది సార్లు దండయాత్రలు జరిపినట్లు తెలుస్తోంది.

6.చెన్నకేశవ దేవాలయం

6.చెన్నకేశవ దేవాలయం

Image source

కర్ణాటకలోని యాగాచీ నది ఒడ్డున బీదర్ లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. హొయ్సల వంశస్తులు క్రీస్తు శకం 10 లేదా 11 శతాబ్ధంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.

7.కేదర్ నాథ్ దేవాలయం

7.కేదర్ నాథ్ దేవాలయం

Image source

కేదర్నాథ్ దేవాలయాన్ని ఎప్పడు నిర్మించారన్న దానికి సరైన ఆధారాలు లేవు. అయితే పురాణాల్లో ఈ దేవాలయం ప్రస్తావన ఉండటం వల్ల లక్షల ఏళ్ల క్రితమే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడ మనకు శిల్ప సంపద లభ్యత కొంత తక్కువే. అయితే ఎకో టూరిజాన్ని ఇష్టపడే వారికి ఇది మంచి పర్యాటక ప్రాంతం. ఈ దేవాలయం కూడా దేశంలోని 12 జ్యతిర్లింగాల్లో ఒకటి.

8.ఆది కుంభేశ్వర్ దేవాలయం

8.ఆది కుంభేశ్వర్ దేవాలయం

Image source

తమిళనాడులోని కుంభకోణంలో ఆది కుంభేశ్వర్ దేవాలయం ఉంది. తొమ్మిదో శతాబ్ధంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 30,181 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయాన్ని చోళులు నిర్మించారు. దీంతో ఇక్కడి శిల్ప సంపద మొత్తం చోళ సంస్కృతి సంప్రదాయాలను గుర్తుకు తెస్తుంది.

9.పుష్కర్ దేవాలయం

9.పుష్కర్ దేవాలయం

Image source

రాజస్థాన్ లోని పుష్కర్ దేవాలయం ఉంది. ఇక్కడ ప్రధానంగా పూజలు అందుకునేది బ్రహ్మ. దేశంలోని ఉన్న అతి కొద్ది బ్రహ్మ దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. దీనిని నిర్మించి దాదాపు 2000 ఏళ్లు అయివుంటుందని తెలుస్తోంది.

10.వరదరాజ దేవాలయం

10.వరదరాజ దేవాలయం

Image source

తమిళనాడులోని కాంచిపురంలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని చోళులు నిర్మించారు. అక్కడ ఉన్న శాసనాలను అనుసరించి 11 శతాబ్ధంలో ఈ దేవాలయం నిర్మణ పనులు పూర్తయ్యాయి.

11.బాదామి గుహాలయాలు

11.బాదామి గుహాలయాలు

Image source

కర్ణాటకలోని బాదామిలో ఈ గుహాలయాలు ఉన్నాయి. ఇక్కడ హిందూ దేవాలయాలతో పాటు జైన, బౌద్ధ మతానికి చెందిన పరమ పవిత్రమైన తీర్థాలు కూడా ఉన్నాయి. ఆరవ శతాబ్ధంలో వీటిని చాళుక్యులు నిర్మించారు.

12. లింగరాజ దేవాలయం

12. లింగరాజ దేవాలయం

Image source

ఒడిస్సా లోని భువనేశ్వర్లో ఈ లింగరాజ దేవాలయం ఉంది. ఆరోశతాబ్ధంలో ఈ దేవాలయాన్ని మొదట నిర్మించారు. అటు పై 11వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. కలింగ దేశం సంస్కృతి సంప్రదాయాలను ఈ దేవాలయంలో చూడవచ్చు.

13.విరూపాక్ష దేవాలయం

13.విరూపాక్ష దేవాలయం

Image source

హంపిలో నిర్మించారు. తుంగభద్ర నది ఒడ్డున ఈ దేవాలయాన్ని ఏడో శతాబ్ధంలో నిర్మించారు. ఇక్కడ శిల్ప సంపదతో పాటు ఈ దేవాలయం నిర్మాణంలో వాడిన సాంకేతికత కూడా అద్భుతమే. ఇక్కడ ప్రధానంగా పరమేశ్వరుడు విరూపాక్షుడి రూపంలో పూజలను అందుకుంటాడు.

14. శ్రీరంగనాథ స్వామి దేవాలయం

14. శ్రీరంగనాథ స్వామి దేవాలయం

Image source

తినేచురాపళ్లిలో శ్రీరంగనాథ దేవాలయం ఉంది. 136 ఎకరాల్లో విస్తరించిన ఈ దేవాలయంలో ప్రధానంగా పూజలు అందుకునేది శ్రీ మహావిష్ణువు. దీనిని క్రీస్తు శకం 5, 6 శతాబ్ధంలో నిర్మించినట్లు తెలుస్తోంది.

15. దుర్గా దేవాలయం

15. దుర్గా దేవాలయం

Image source

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని ఐహోలులో ఈ దేవాలయం ఉంది. చాళుక్యులు నిర్మించిన ఈ దేవాలయం అటు శైవులకు, ఇటు విష్ణువులకూ ముఖ్యమైన పుణ్యక్షేత్రం. దీనిని క్రీస్తు శకం ఏడు, ఎనిమిదో శతాబ్ధంలో నిర్మించినట్లు ఇక్కడి శాసనాల వల్ల తెలుస్తోంది.

Read more about: travel