» »కుక్కల దేవాలయం ఎక్కడుందో తెలుసా?

కుక్కల దేవాలయం ఎక్కడుందో తెలుసా?

Posted By: Venkatakarunasri

LATEST: కర్ణాటకలో చనిపోయిన యువకుడు మరలా లేచి కూర్చున్నాడు

మన దేశంలో అనేక చిత్రవిచిత్రమైనవి అనునిత్యం కనిపిస్తాయి. వాటిలో కొన్ని వెలుగులోనికి వచ్చినా ఇంకా మనకి కొన్ని తెలియకుండా వుంటాయి. కోట్ల దేవతలు మీకు తెలిసేవుంటారు. మీకు తెలియని దేవాలయాలలో విభిన్న దేవాలయాలు ఉన్నాయని మీకు తెలుసా?

ఈ దేవాలయాల్లో కనిపించని అనేక ఆచారాలు, పద్ధతులు ఉన్నాయి. గడియారం, ఆట స్థలాలు, ఆచాచర్య పదాల ప్రార్థన, భారతదేశం యొక్క దేవాలయాలు, సోనియా గాంధీ ఆలయం, అమితాబ్ ఆలయం, డాగ్ టెంపుల్ మొదలైన వివిధ ఆలయాల యొక్క వివిధ ఆచారాలను ప్రస్తుత వ్యాసంలో తెలుసుకోండి.

1. గడియారం కానుక

1. గడియారం కానుక

బ్రహ్మ బాబా దేవాలయంకు వచ్చే భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత గడియారం లేదా చేతి గడియారంను కానుకగా వేసే ఆచారం ప్రసిద్దిగా వుంది.

PC:James_1972

2. గురుద్వార

2. గురుద్వార

గురుద్వార్ దగ్గర ఒక గ్రామంలో జలంధర్ దగ్గర వుండే నదిలో తేలుతూ వుండే అనేక బొమ్మ విమానాలు కనిపిస్తాయి. భక్తులు విదేశాలకు వెళ్ళే వీసా దొరకాలని మొక్కుకుని ఇక్కడ నదిలో బొమ్మ విమానాన్ని ఈ నదిలో కానుకగా వేస్తారు.

PC:Jed Blues

3. కొడున్ గల్లూర్ భగవతి దేవాలయం

3. కొడున్ గల్లూర్ భగవతి దేవాలయం

కేరళలో వున్న కొడున్ గల్లూర్ భగవతి దేవాలయంలో భరణి వుత్సవం జరిగే సమయంలో భగవతి దేవిని అనకూడని పదాలతో తిడ్తారు.

PC:Darius Austin

4. భారతమాతా దేవాలయం

4. భారతమాతా దేవాలయం

ఈ భారతమాతా దేవాలయం వారణాశిలో వుంది. కోట్లకొద్దీ ఆలయాలు వున్న మన దేశంలో భారతమాతా దేవాలయం చూడవలసిన దేవాలయం.

PC:Isriya Paireepairit

5. కాళి సింగ్ దేవాలయం

5. కాళి సింగ్ దేవాలయం

కాళి సింగ్ దేవాలయం ముజాఫర్ జంగ్ లో వుంది. కాళి సింగ్ దేవాలయంలో పశువులు పాలను ఎక్కువగా ఇవ్వాలని పూజించే దేవాలయంగా వుంది.

PC:Jennifer Gon

6. సోనియా గాంధీ దేవాలయం

6. సోనియా గాంధీ దేవాలయం

ప్రసిద్ధ మహిళా రాజకీయవేత్త సోనియా గాంధీ ప్రతిమ వుండే దేవాలయం మెహబూబ్ నగర్ లో చూడవచ్చును. ఇది శంకర రావు నిర్మించిందని చెప్పబడింది.

PC:Pressbrief

7. కుక్కల దేవాలయం

7. కుక్కల దేవాలయం

కుక్కలకూ ఒక దేవాలయం వుందని మీకు తెలుసా? అవును కుక్కలకు ప్రత్యేకమైన దేవాలయాన్ని కర్ణాటకలోని చెన్నపట్నంలో చూడవచ్చును.

PC:Marion Holtzman

8. అమితాబ్ బచ్చన్ దేవాలయం

8. అమితాబ్ బచ్చన్ దేవాలయం

బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్ దేవాలయం కోల్‌కాతాలో ఉంది. సామాన్యంగా భారతదేశంలో అమితాబ్ వి చాలా ప్రతిమలు వున్నాయి. కానీ ఇక్కడ అమితాబ్ ను ఒక దేవతామూర్తిగా పూజిస్తారు.

PC:artist murali

9. కర్ణి మాత దేవాలయం

9. కర్ణి మాత దేవాలయం

కర్ణి మాత దేవాలయం రాజస్థాన్ లోని బికనేర్ లో వుంది. ఈ దేవాలయంలో ఎలుకలను కాళి స్వరూపంగా ఆరాధిస్తారు.

PC:kantikshah

10. రావణుని దేవాలయం

10. రావణుని దేవాలయం

మధ్య ప్రదేశ్ లో రావణుని వెయ్యికి పైగా కన్యాకుబ్జ బ్రాహ్మణులు ఆరాధిస్తారు.

PC:bearingblue

11. సచిన్ దేవాలయం

11. సచిన్ దేవాలయం

క్రికెట్ దేవుడు అని ప్రఖ్యాత గాంచాడు సచిన్. ఇతని దేవాలయం కూడా బీహార్ లో వుంది.

PC:SB

12. ఓం బన్న బాబా దేవాలయం

12. ఓం బన్న బాబా దేవాలయం

బుల్లెట్ గాడీనే ఓం బన్న బాబా. ఈ బులెట్ బైక్ కూ ఒక దేవాలయంను జోద్ పూర్ లో చూడవచ్చును.

PC:Nipun Srivastava

13. కాల భైరవ దేవాలయం

13. కాల భైరవ దేవాలయం

కాల భైరవ దేవాలయం ఉజ్జయినిలో వుంది. ఇక్కడున్న కాల భైరవునికి మద్యపానాన్ని భక్తులు నైవేద్యంగా పెడ్తారు.

PC:Greg Inda

14. దిగంబరేశ్వర దేవాలయం

14. దిగంబరేశ్వర దేవాలయం

ఈ దేవాలయంలో గోపురం పై భాగం నుండి పిల్లలను విసిరేస్తారు. ఇలా చేయటం వల్ల దిగంబరేశ్వరుడు మంచి అదృష్టాన్ని ఇస్తాడు అని జనాల యొక్క నమ్మకం.

PC:Yoann JEZEQUEL

15. దుర్యోధనుని దేవాలయం

15. దుర్యోధనుని దేవాలయం

కౌరవుల యొక్క రాజు దుర్యోధనునిని ఉత్తరాఖండ్ లో అనేక చోట్ల పూజిస్తారు. అదే విధంగా కేరళలో ఒక చిన్న గ్రామంలో కూడా దుర్యోధనునికి సంబధించిన దేవాలయం వుందని తెలుస్తుంది.

PC:Suresh Dhanakotti