Search
  • Follow NativePlanet
Share
» »కేరళ కొమరకోం అందాలన్నీ మీకు ఆహ్వానం పలుకుతున్నాయి.

కేరళ కొమరకోం అందాలన్నీ మీకు ఆహ్వానం పలుకుతున్నాయి.

కేరళ ప్రకృతి అందాలకు నెలవు. అటువంటి రాష్ట్రంలో ఉత్తమమైన, ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా కొరకోం పేరుగాంచింది. ముఖ్యంగా ఈ కొమరకోం చుట్టు పక్కల చూడటానికి ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. సమయం, సొమ్ము ఉండాలే కాని దాదాపు మూడు నెలలైనా ఇక్కడి అందాలను చూడటానికి సరిపోవు.

ముఖ్యంగా హౌస్ బోట్ లో ప్రయాణం చేయాలనుకునేవారికి, పక్షి ప్రేమికులకు ఈ కొమరకోం చుట్టు పక్కల ఉన్న ఒక స్వర్గధామం. ఇక ట్రెక్కింగ్ విండ్ సర్ఫింగ్ వంటి సాహస క్రీడలు ఇష్టపడే వారికి కూడా ఈ కొమరకోం సదా ఆహానం పలుకుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి డ్రిఫ్ట్ ఉడ్ మ్యూజియం ఈ కొమరకోం సొంతం. ఇన్ని విశిష్టతలున్న ఈ కొమరకోం చుట్టు పక్కల ఉన్న ఐదు ముఖ్యమైన పర్యాటక కేంద్రాలకు సంబంధించిన వివరాలు మీ కోసం....

 కుమరకోం పక్షి సంరక్షణ కేంద్రం

కుమరకోం పక్షి సంరక్షణ కేంద్రం

P.C: You Tube

పక్షిప్రేమికులకు స్వర్గధామం కుమరకోం పక్షి సంరక్షణ కేంద్రం. కేరళలోని ప్రముఖ పర్యాటక కేంద్రం వాంబడ్ కు దగ్గరగా ఉన్న పక్షి సంరక్షణ కేంద్రం మనకు కొట్టాయం జిల్లాలో కనిపిస్తుంది. ఈ పక్షి సంరక్షణ కేంద్రంలో సైబీరియన్ కొంగల వంటి వలస పక్షులతో పాటు వందలాది జాతి పక్షుల కుహు కుహు రావాలను మనం వినవచ్చు. పతిరమాల్ ద్వీపం ఈ పక్షి సంరక్షణ కేంద్రం నుంచి బోటు ప్రయాణం ద్వారం కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే తీసుకొంటుంది.

సందర్శనకు ఉత్తమ సమయం. ఏడాదిలో అన్ని రోజులు ఇక్కడ సందర్శనకు అవకాశం ఉన్నా జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో అయితే మనకు వలస పక్షులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి.

సందర్శన సమయం....వారంలో అన్ని రోజులూ ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ

రువిక్కూజీ జలపాతం

రువిక్కూజీ జలపాతం

P.C: You Tube

అలసిన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే అరువిక్కూజీ జలపాతం చుట్టూ కనుచూపు మేర పచ్చదనమే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ రబ్బరు చెట్లు ఎక్కువగా ఉంటాయి. వారాంతాల్లో పిక్నిక్, ట్రెక్కింగ్ కు ఎక్కువ మంది అరవిక్కూజీ జలాపాతాన్ని చూడటానికి ఇష్టపడుతారు. ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారు ఎక్కువగా అరువిక్కూజీ జలపాతం వద్దకు వస్తుంటారు.

సందర్శన సమయం వారంలో అన్ని రోజులూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకూ . అయితే సాయంత్రం 6 తర్వాత ట్రెక్కింగ్ కు అంత అనుకూలం కాదు.

కుమరకోం బీచ్

కుమరకోం బీచ్

P.C: You Tube

సాహసక్రీడలు, జలక్రీడలను ఇష్టపడే వారికి కుమరోం బీచ్ స్వర్గధామం. ఇక్కడ పలురకాల జల క్రీడలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా స్కైయింగ్, విండ్ సర్ఫింగ్, బోటింగ్, పారాసైలింగ్ వంటి వాటిని ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి. ఈ బీచ్ చుట్టు పక్కల ఉన్న రిసార్టులో మనకు మంచి ఆహారం లభిస్తుంది. ముఖ్యంగా సముద్ర చేపలు, పీతలు, రొయ్యలతో చేసిన వంటకాలు ఇక్కడ చాలా ప్రాచూర్యం చెందాయి.

బే ఐ ల్యాండ్ డ్రిఫ్ట్ ఉడ్ మ్యూజియం

బే ఐ ల్యాండ్ డ్రిఫ్ట్ ఉడ్ మ్యూజియం

P.C: You Tube

భారత దేశంలో ఇటువంటి మ్యూజియం మనం మరెక్కాడా చూడలేము. సముద్రం, కాలువలు, సరస్సుల్లోని నీటి లోపల ఉన్న చెక్కను జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చి కొన్ని ప్రత్యేకమైన పద్దతుల్లో ఎండబెడుతారు. అటు పై వాటిని నిపుణులైన వారు జంతువులు, మనుషుల రూపంలో తీర్చిదిద్దుతారు. స్థానిక రాజీ పున్నోస్ అనే ఉపాధ్యాయుడు మొదట ఈ కళను కనిపెట్టాడు. అటు పై ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రాచూర్యం పొందింది.

సందర్శన సమయం.... మంగళవారం నుంచి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ

 కొట్టాయం

కొట్టాయం

P.C: You Tube

కొమరకోం చుట్టు పక్కల ఉన్న ముఖ్యమైన పర్యాటక కేంద్రాల జాబితాలో కొట్టాయం మొదటి వరుసలో ఉంటుంది. కనుచూపుమేరలో కనిపించే పచ్చటి రబ్బరు చెట్ల మధ్య నుంచి చిన్నటి పడవల్లో ప్రయాణం చేయాలనుకునేవారికి కొట్టాయానికి మించిన ప్రదేశం లేదు. కుమరకోం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్యాటక కేంద్రం మధ్యలో మరెన్నో పర్యాటక స్థలాలు మీకు కనిపిస్తాయి. మీకున్న సమయాన్ని అనుసరించి అందులో ఏవి చూడాలన్ని విషయాన్ని ఎంపిక చేసుకోండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X