Search
  • Follow NativePlanet
Share
» »మాన్సూన్ లో ప్రయాణించదగిన ఉత్తమ 5 రైలు ప్రయాణాలు !

మాన్సూన్ లో ప్రయాణించదగిన ఉత్తమ 5 రైలు ప్రయాణాలు !

By Mohammad

ట్రైన్ జర్నీలు అంటేనే మరిచిపోలేని అనుభూతి. కొన్ని కొన్ని రైలు ప్రయాణాలు తీపి గుర్తులను ఇస్తాయి. ఆనందం, ఆహ్లాదం, ఉత్సాహం .. అన్నీ జర్నీలో అనుభవించవచ్చు. కొండలు, గుహలు, నదులు, సముద్రాలు, చెట్టు చేమలు దాటుకుంటూ చేసే ట్రైన్ జర్నీ నిజంగా ఒక కిక్కే.

ప్రయాణం అంటే చాలు నూటికి 99 మంది పర్యాటకులు ట్రైన్ ప్రయాణం ఎంపిక చేస్తారు. దీనికి కారణం, ట్రైన్ కూర్చొనటానికి, పడుకోనటానికి సౌకర్యం. అంతేకాక, విండో సీట్ లో కూర్చొని దారి పొడవునా అనేక ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. తాజా గాలి ఆస్వాదించవచ్చు. ప్రయాణ మార్గం అంతా ఆనందించవచ్చు.

ఇది కూడా చదవండి : ఇండియాలోని టాప్ 10 రైలు వంతెనలు !

వినసొంపైన మ్యూజిక్ లాంటి ట్రైన్ పరుగు ధ్వని అందరికీ ఇష్టమైనదే. బస్సులు వెళ్ళలేని సన్నని ఇరుకైన మార్గాలలో సైతం ట్రైన్ ప్రయాణిస్తుంది. ట్రైన్ జర్నీ ఎంత చిన్నదైనా సరే ఆ ప్రయాణ అనుభవం ఎన్నటికీ మరచిపోలేము. మరి ఇంత అందమైన మార్గాలు ఇండియా లో ఎన్నో కలవు.

కేరళ దృశ్యాలు

కేరళ దృశ్యాలు

చిత్ర కృప : Bryan Keith

మాన్సూన్ సీజన్ లో భారతీయ రైల్వే (ఐ ఆర్ సి టీ సి) కొన్ని స్పెషల్ టూర్ ప్యాకేజీ లను అందిస్తున్నది. కాసింత భయం, ఉద్వేగం మరియు సంబరాన్ని ఇచ్చే ఆ ట్రైన్ రూట్ లను ఒక లుక్ వేద్దాం పదండి.

01. తిరువనంతపురం నుండి ముంబై వరకు

దూరం : 1680 KM

ప్రయాణ సమయం : 1 రోజు 3 గంటలు

అమేజింగ్ ట్రైన్ జర్నీ ని కోరుకొనేవారికి ఈ జర్నీ సూచించదగినది. తిరువనంతపురం నుండి మొదలయ్యే రైలు ప్రయాణంలో అంతటా పచ్చదనమే స్వాగతం పలుకుతుంది. దట్టమైన పశ్చిమ కనుమలు, నదులు, అరేబియా సముద్రం, ఘాట్ లు, టన్నెల్ లు, వంతెనలు, పంటపొలాలు మరియు గ్రామాలు మొదలైనవి ముంబై చేరుకొనేంత వరకు పలరిస్తూనే ఉంటాయి.

కల్కా - షిమ్లా వెళ్లే రైలు

కల్కా - షిమ్లా వెళ్లే రైలు

చిత్ర కృప : Fernando Stankuns

02. కల్కా నుండి షిమ్లా వరకు

దూరం : 96 KM

ప్రయాణ సమయం : 5 - 6 గంటలు

మాన్సూన్ లో టాయ్ ట్రైన్ ప్రయాణం తప్పక సూచించదగినది. కల్కా నుండి షిమ్లా చేరుకోవటానికి 3 - 4 స్టేజీ లు ఉంటాయి. కల్కా నుండి మొదలయ్యే ప్రయాణం దట్టమైన పొదలు , పచ్చిక మైదానాలు, పచ్చదనంతో నిండిన కొండలు మరియు లోయలను దాటుకుంటూ నారో గేజ్ పట్టాల గుండా ముందుకు సాగుతుంది.

బెంగళూరు - గోవా వెళ్లే రైలు

బెంగళూరు - గోవా వెళ్లే రైలు

చిత్ర కృప : Asia Lo Desconocido

03. బెంగళూరు నుండి గోవా వరకు

దూరం : 638 KM

ప్రయాణ సమయం : 13 గంటలు

బెంగళూరు నుండి గోవాలోని వాస్కో డా గామా వరకు వెళ్లే ట్రైన్ జర్నీ పర్యాటకులను తప్పక ఆకట్టుకుంటుంది. దారి పొడవునా కొబ్బెర చెట్లు, తాటి చెట్లు, జలపాతాలు, బీచ్ లు మరియు ప్రకృతి సంబంధిత అంశాలు కనిపిస్తాయి. ఈ జర్నీ లో ప్రధాన ఆకర్షణ దూద్ సాగర్ జలపాతం. రైలు రెండు నిమిషాలు జలపాతం వద్ద నిల్చుంటుంది. ఇదే ఈ టూర్ హైలెట్.

న్యూ జల్పాయ్ గురి - డార్జీలింగ్ వెళ్లే రైలు

న్యూ జల్పాయ్ గురి - డార్జీలింగ్ వెళ్లే రైలు

చిత్ర కృప : Sreetama Das

04. న్యూ జజల్పాయ్ గురి నుండి డార్జీలింగ్ వరకు

దూరం : 80 KM

ప్రయాణ సమయం : 2 గంటల 39 నిమిషాలు

మాన్సూన్ లో ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తించబడిన డార్జీలింగ్ లో ప్రయాణం చేయాలని ఎవరి ఉండదు చెప్పండి. న్యూ జల్పాయ్ గురి నుండి టాయ్ ట్రైన్ లో డార్జిలింగ్ వరకు వెళ్లే 2 గంటల ప్రయాణం మంత్రముగ్ధులను గురిచేస్తుంది. హిమాలయ అందాలు, కంచన్ గంగా శిఖరాలు , లోయలు, టన్నెల్ లు మిమ్మలను 19 వ శతాబ్దంలోకి తీసుకెళతాయి.

బెంగళూరు - మంగళూరు వెళ్లే రైలు

బెంగళూరు - మంగళూరు వెళ్లే రైలు

చిత్ర కృప : Glany Saldanha

05. బెంగళూరు నుండి మంగళూరు వరకు

దూరం : 446 KM

ప్రయాణ సమయం : సగటు 14 గంటలు

ఈ జర్నీ దట్టమైన పశ్చిమ కనుమల గుండా సాగుతుంది. పర్యాటకులు ఈ మార్గం లో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కల లోయలు, మైదానాలు, కొండలు మాత్రమే కాక, సుమారు 60 సొరంగాల గుండా కూడా ప్రయాణం చేస్తారు. ఈ మార్గం ట్రెక్కింగ్ కు కూడా ఆనందంగా వుంటుంది. మరి ఇంత ఆనందాన్ని అందించే, ఈ బెంగుళూరు - మంగళూరు ట్రైన్ జర్నీ చేస్తారు కదూ ..!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X