» »మిస్టరీ ప్రదేశాలు - ఎప్పటికీ వీడని భయాలు?

మిస్టరీ ప్రదేశాలు - ఎప్పటికీ వీడని భయాలు?

Posted By:

దిగువ పేర్కొనిన అయిదు ప్రదేశాలు టూరిస్ట్ ప్రదేశాలు కాదు. చాలా మందికి ఇవి తెలియవు కూడాను. అయినప్పటికీ ఈ ప్రదేశాలలోని వింత విషయాలు చూసి ఆనందించాలంటే, ఇక్కడ తప్పక పర్యటన చేయాల్సిదే.

కోబ్రా నాగు - నా మంచి ఫ్రెండ్ !

మీకు మీ మొదటి పెంపుడు జంతువు గుర్తుందా ? అది ఒక చిన్న కుక్క పిల్ల లేదా ఒక పక్షి లేదా ఒక పిల్లి వంటి సాత్విక ప్రాణి కావచ్చు. అయితే, కోబ్రా నాగు పాముతో ఆట ఆడే వారిని చూశారా? గుజరాత్ లోని ఒక ఆటవిక తెగ వారికి పాములే పెంపుడు జంతువులు. ఈ పాములు వారి జీవితాలలో ఒక భాగం. ఈ తెగ జాతి లో పిల్లలు సైతం రెండు సంవత్సారాల వయసు నుండి వాటితో ఆడుకుంటారు. పాములు వారికి ఎట్టి హాని తలపెట్టవని చెపుతారు. ఈ విష నాగులను పెంచి పోషిస్తున్నందుకు వారు గర్వ పడతారు. మరి పిల్లలు పాములతో ఆటలు ఆడే దృశ్యాలు చూసి ఆనందించాల్సిందే.

                                                   Photo Courtesy: Russ Bowling

పాములు కుటుంబంలో ఒక భాగం

మహారాష్ట్ర లోని షెట్ పాల్ గ్రామం లో కోబ్రా నాగు పాములు చక్కటి విశ్రాంతి పొందుతాయి. ఇండ్లలోపై కప్పులకు వేలాడుతూ వుంటాయి. గ్రామంలో ఎక్కడ చూసినా పాములు తిరుగుతూ వుంటాయి. ఈ గ్రామంలో ఒక సిద్దేస్వర్ టెంపుల్ కలదు. ఈ టెంపుల్ దేవత పాము కాట్ల నుండి రక్షిస్తుందని ఇక్కడి వారు నమ్ముతారు. ఈ గ్రామంలో వందలాది నివాసులు పాములతో సహజీవనం చేస్తారు.

శని షింగానా పూర్ , మహారాష్ట్ర

దొంగతనాలు, దోపిడీలు, నేర ప్రవృత్తి లేని గ్రామం చూసారా ? ఈ రకమైన గ్రామం మహారాష్ట్ర లో, అహమద్ నగర్ జిల్లాలో శని షింగానాపూర్ పేరుతో కలదు. ఈ గ్రామంలో ఇండ్లకు తలుపులు కూడా వుండవు. ఇక తాళాలు వేయటం కీ లు భద్రం చేయటం అన్న ప్రసక్తే లేదు. 2011 సంవత్సరంలో ఇక్కడ ఒక బ్యాంకు తెరిచారు. బ్యాంకు సైతం ఏ రకమైన తాళాలు లేకుండానే నిర్వహిస్తున్నారు. బహుశ దేశంలో తాళాలు లేని బ్యాంకు అంటే ఇదే మొదటిది కావచ్చు.

మంత్రాల మయాంగ్, అస్సాం!

చేయి ఎత్తి మంత్రం వేస్తె చాలు ఎంత మంది పోరాటానికి వచ్చినా నిలిచి పోవాల్సిందే. ఒక్క చేతితో మంత్రం వేస్తె చాలు, కదిలే ప్రాణులు నిలిచి పోవాల్సిందే. ఇదంతా ఒక బ్లాకు మాజిక్. అస్సాం లోని మయాంగ్ గ్రామం లో ఈ రకమైన మహిమలు సంపాదించిన వారు కలదు. ఈ తెగ మాంత్రికులను చూస్తె చాలు ప్రజలు భయ కంపితులవుతారు. వీరి ఈ మంత్ర చర్యలు అనాది కాలంగా జరుగుతున్నాయని స్థానికులు చెపుతారు. మరి ఈ ప్రాంతం మీరు స్వయంగా పర్యటించి అసలు మిస్టరీ ఏమిటో తెలుసుకోండి.

మిస్టరీ ప్రదేశాలు

                                                   Photo Courtesy: Vithu.123

భాన్ ఘర్, రాజస్తాన్


రాజస్తాన్ రాష్ట్రంలోని భాన్ ఘర్ జిల్లాలో ఒక పాడు బడ్డ కోట కలదు. ఈ కోటలో రాత్రి వేళ ప్రవేశిస్తే చాలు ఇక వారు మరల సూర్యోదయం చూసే పని లేదంటారు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత పర్యాటకులను లోపలి అనుమతించరు. అయితే, పగటిపూట ఈ కోటలోకి నిర్భయంగా ప్రవేశించవచ్చని చెపుతారు.

Please Wait while comments are loading...