Search
  • Follow NativePlanet
Share
» »మాన్సూన్ లో గోవా పర్యటన ఎలా ?

మాన్సూన్ లో గోవా పర్యటన ఎలా ?

By Mohammad

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలలో గోవా అత్యుత్తమమైనది. సహజంగా బీచ్ ల వద్ద సన్ బాతింగ్, ఫ్రెండ్స్ తో కలిసి చిందులేస్తూ పార్టీలు చేస్తుంటారు యువతీ యువకులు. రొమాన్స్ చేయటానికి కొన్ని సైలెంట్ బీచ్ లు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. గోవా లో బీచ్ లు అనేకం. కొన్ని బీచ్ ల వద్ద మసాజ్ లు కూడా చేస్తుంటారు.

మాన్సూన్ సీజన్ లో గోవా పర్యటన అధిక లాభాలను చేకూర్చుతుంది. ప్రైవసీ ప్రదేశాలను సందర్శించాలనుకొనేవారికి వర్షాకాలం సీజన్ ఉత్తమమైనది. గోవా ను మాన్సూన్ లోనే సందర్శించటానికి గల కారణాలు ఒకసారి గమనిస్తే ..

01) చవకగా ప్రయాణించండి

గోవా కు మాన్సూన్ సీజన్ లో ఫ్లైట్ టికెట్ లు చవకగా దొరుకుతాయి. గోవా మాన్సూన్ ఆఫర్ పేరిట ఇవి లభ్యమవుతాయి. ఈ సీజన్ లో సగం ధరకే టికెట్ లను కొనుగోలు చేస్తుంటారు పర్యాటకులు. మీరు కూడా వీలైతే ... ప్రయాణించండి!

ఇది కూడా చదవండి : గోవా వెళితే చేయకూడని 10 అంశాలు !

02) మీ బడ్జెట్ కు తగ్గట్టు ప్రపంచ విలాసవంత సదుపాయాలు

కేవలం విమాన టికెట్ లు మాత్రమే కాదు .. గోవా లో మాన్సూన్ సీజన్ లో హోటల్ బుకింగ్స్ కూడా చవకగానే లభిస్తాయి. మాన్సూన్ లో గోవా ను సందర్శించే పర్యాటకుల రద్దీ .. మిగితా సీజన్ లతో పోలిస్తే కాస్త తక్కువ మరియు విలాసవంతమైన గదులు చవకగా అద్దెకు దొరుకుతాయి.

మాన్సూన్ లో బీచ్ ల వద్ద రద్దీ ఉండదు

మాన్సూన్ లో బీచ్ ల వద్ద రద్దీ ఉండదు

చిత్ర కృప : R Singh

03) మీకిష్టమొచ్చినట్లు స్టే చేయండి

మాన్సూన్ లో గోవా బీచ్ లు సైలెంట్ గా ఉంటాయి. ఇక్కడ మీరు ఏమి చేసినా ఎవరూ పట్టించుకోరు. మీకిష్టమైన వారితో ఇక్కడికి వచ్చి మీ ప్రేమను తెలియపరచవచ్చు. ఒకవేళ మీరు ఫ్రెండ్స్ తో వచ్చినట్లయితే .. బీచ్ ఒడ్డున వాలీబాల్, ఫుట్ బాల్ వంటి క్రీడలను ఆడుకోవచ్చు.

గోవా చేపల పులుసు

గోవా చేపల పులుసు

చిత్ర కృప : Joel's Goa Pics

04) చేపల పండగ

మీరు బోజనప్రియులా ? అయితే గోవా మీకు ఉత్తమ ప్రదేశం. ఇక్కడ మీరు సీ ఫుడ్ ను తినవచ్చు. ఇక్కడ సంవత్సరం పొడవునా చేపలు, ఇతర నాన్ - వెజ్ ఆహారాలు దొరుకుతాయి. అన్ని సీజన్ లలో కెల్లా మాన్సూన్ - తాజా చేపలకు సరైన సమయం.

05) వర్షాన్ని ఎంజాయ్ చేయండి

మీకు వర్షంలో నడవాలని లేదా ? వర్షపు చినుకులలో తడవాలని అనుకునేవారు బీచ్ ఒడ్డున గల ప్రదేశాలకు వెళ్లి ఆనందించవచ్చు. గోవా లో వర్ష ఋతువు ఎంతో ఆహ్లాదకరంగా, అందంగా ఉంటుంది. మేఘాల మబ్బులు, చినుకులు, సముద్ర ప్రవాహాలు, తడిసిన ప్రకృతి... వంటి వాటిని ఎంజాయ్ చేయవచ్చు.

మాన్సూన్ లో దూద్ సాగర్ జలపాతం

మాన్సూన్ లో దూద్ సాగర్ జలపాతం

చిత్ర కృప : Kumaresh Rajarajan Follow

06) దూద్ సాగర్ జలపాతాన్ని చూడడటం

దూద్ సాగర్ జలపాతం గోవా - కర్ణాటక సరిహద్దులో కలదు. మాన్సూన్ లో గోవా ను సందర్శించే పర్యాటకులు ఈ జలపాతాన్ని తప్పక చూడాలి. ఇది వర్షాకాల సమయంలో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ జలపాతం సమీపాన వీలైతే భగవాన్ మహావీర్ వన్య ప్రాణుల అభయారణ్యం సందర్శించవచ్చు. ఇది వివిధ రకాల జంతువులకు, మొక్కలకు, క్షీరదాలకు మరియు పక్షులకు నిలయంగా ఉన్నది.

దూద్ సాగర్ జలపాతం వద్ద సాహసికులు తరచూ వచ్చి పర్వతారోహణ చేస్తుంటారు. వీరికై ఇక్కడ క్యాంపైనింగ్, విశ్రాంతి తీసుకోవటానికి స్పెషల్ కుటీరాలు ఉన్నాయి. వాటర్ ఫాల్స్ వద్ద ఒక రైల్వే ట్రాక్ ఉంది. ఇక్కడ ప్యాసింజర్ రైళ్లు అతి కొద్దీ సమయం మాత్రమే (సుమారు రెండు నిమిషాల సేపు) నిలుస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X