• Follow NativePlanet
Share
» »7 కొత్త సంవత్సర తీర్మానాలు !

7 కొత్త సంవత్సర తీర్మానాలు !

Written By:

కొత్త సంవత్సరం వచ్చిందంటే ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. కాని వాటిని ఆచరించం అంటారు కొందరు. అయితే, ట్రావెల్ పట్ల ఆసక్తి కలవారు దీనిని ఒప్పుకోరు. కారణం, ఎల్లప్పుడూ రొటీన్ జీవితానికి అలవాటు పడి, కొంత ఆసక్తి కలిగించుకోవటానికి గాను వీరు తప్పక వారు కోరుకున్న ప్రదేశాన్ని పర్యటిస్తారు. కావలసింత ఆనందం పొందుతారు. మరి పర్యటన పట్ల అనుభవం వున్నా లేకపోయినా వారికి కొత్త సంవత్సరంలో పర్యటనకు ఏడు కొత్త సంవత్సర తీర్మానాలు అందిస్తున్నాం పరిశీలించండి. ఆచరించి ఆనందించండి.

పర్యటనలో పట్టు - జీవిత విలువల పెంపు!

Photo Courtesy: mikebaird
1 . కొత్త ప్రదేశాల పర్యటన
కొత్త ప్రదేశ పర్యటన ...అనగానే కొంత మంది ఆసక్తి చూపరు. ఎంతసేపూ గతంలో పర్యటించిన ప్రదేశాలకు మాత్రమే మొగ్గు చూపుతారు. అక్కడి సౌకర్యాలు వారిని మరొకసారి వచ్చేలా కూడా చేస్తాయి. మరి ఈ సంవత్సరం, కొద్దిపాటి సాహసం తో మీ గత అనుభవాల సౌకర్యం నుండి బయటకు వచ్చి తెలియని విషయాలు తెలుసుకోనండి.

2. పర్యటనలో సహనం, సౌభ్రాతృత్వం
భారత దేశం చాలా విశాలమైనది. ఏ ఒక్క కోణంలోనూ చూడ దగినది కాదు. కనుక ఇండియాలో మసాలా ఫుడ్ అధికం లేదా ఇండియన్ పెళ్లి కొడుకులు గుర్రాలపై ఊరేగుతారు, వంటి ముందస్తు అభిప్రాయాలు తొలగించుకోనండి.

3. ప్రణాళిక లేకుండా !
ఏ ప్రణాలికా లేకుండానే పర్యటీంచండి. ఏ ప్రదేశానికైనా సరే తేలికగా, ఏ ఆటంకాలు లేకుండా వెళ్ళాలి. ఎంతో ప్రణాళిక చేసుకొని ఇబ్బందులు పడి ప్రదేశానికి చేరేకంటే ప్రణాళిక లేకుండా సౌకర్యవంతంగా చేరటం ఆనందించటం గొప్ప విషయం. కొత్త ప్రదేశం పట్ల కొంత స్టడీ చేయండి. పాతను విడనాడి కొత్త అనుభవాలను పొందండి. అది మీరు తీసుకునే ఆహారమైనా సరే.

4. ట్రావెల్ లిటరేచర్ అధికంగా చదవండి
ప్రతి వారూ వారికి గల ట్రావెల్ ఆసక్తి వెలిబుచ్చుతూనే వుంటారు. వారు చేసిన పర్యటన అనుభవాలను వ్రాత పూర్వకంగా కూడా వెల్లడి న్చాలనే చూస్తారు. అయితే, ఈ చర్య చివరకు అసంపూర్నంగానే మిగిలి పోతుంది. కనుక, మీ పర్యటన అనుభవాలు వ్రాతపూర్వకంగా పెట్టె ముందు అనుభవజ్ఞులైన కొంతమంది ట్రావెల్ రచయితల వ్యాసాలను చదవండి. ఆ రచయతలు ఎంత చిన్న వారైనా లేక, ఎంత పెద్ద వారైనా సరే, రచనా శైలిని పరిశీలించి, మీకు నచ్చిన రీతిలో సంపూర్ణ రచనలు చేసి, ముందు తరాల వారికి మీరు పర్యటించిన ప్రదేశ అనుభవాలను వెల్లడించండి.

5. పర్యటన ఒక ఖర్చుగా భావిస్తున్నారా ?
ఎంత మాత్రం భావించకండి ? అనవసర ఖర్చులు మాని పొదుపు చేయండి. కొత్త ప్రదేశాలలో మీరు పొందే హోటల్ లేదా బస్సు ఫేర్ వంటివి మీరు కొద్ది కాలంలోనే కూడా బెట్టవచ్చు. పర్యటనలు చేసి కొత్త అనుభవాలు, ఆసక్తి కలిగించుకొని జీవతాన్ని ఆనందించవచ్చు.

6. ఆసక్తి కల పర్యటన
ఒక స్వల్ప కాల ప్రయాణికుడి వలే కాక ఆసక్తి కల పర్యాటకుడిగా మారండి. మీరు సందర్శించే ప్రదేశంలోని స్థానికులతో సంభాషించండి. వారి ఆచార వ్యవహారాలూ తెలుసుకోనండి. ఆయా ప్రదేశాల గురించి గల గైడ్ లు, లేదా పుస్తకాలలో చదివి అసంపూర్ణ సమాచారం పొంద కండి.

7. సోషల్ సైట్స్
పేస్ బుక్ వంటి సోషల్ సైట్ లలో ప్రచారం చేసుకొనేందుకు ట్రావెల్ చేసి వాస్తవ అనుభవాలను, ఆనందాలను కోల్పోకండి. కొత్త సంవత్సరం లో ఇటువంటి వాటికి దూరంగా వుండి, మీరు సందర్శించే ప్రదేశాల పట్ల అవగాహన పెంచుకోనండి. అవసరం అనుకుంటే, పురాతన మ్యాప్ లు, లేదా స్థానికుల సూచనలు పాటించండి. స్థానిక సంస్కృతులు, సమాచారం మీకు జీవితంలో మరువ లేని అంశాలుగా వుండి మీ ప్రస్తుత జీవిత విలువలను మరింత అధికం చేస్తాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి