Search
  • Follow NativePlanet
Share
» »వాయనాడ్ లోని ఈ ప్రకృతి అందాలను చూశారా?

వాయనాడ్ లోని ఈ ప్రకృతి అందాలను చూశారా?

వయనాడ్ చుట్టూ ఉన్న పర్యాటక కేంద్రాలకు సంబంధిచిన కథనం.

కేరళలోని ఈశాన్య భాగంలో ఉన్న వాయనాడ్ జిల్లా ప్రకృతి అందాలకు నెలవు. సముద్ర మట్టానికి దాదాపు 2100 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ జిల్లా పశ్చిమ కనుమల్లోని భాగం. ఇక్కడి అడవుల్లో దాదాపు మూడువేల సంవత్సరాలకు పూర్వపు చెట్లను కూడా మనం చూడవచ్చు.

కేరళలోని ఈ ఒక్క రాష్ట్రమే తమిళనాడుతో పాటు కర్నాటకతోనూ సరిహద్దును కలిగి ఉంది. ఇక్కడి గిరిజనులు ఇప్పటికీ సంప్రదాయ కేరళ వస్త్రధారణ, ఆహార నియమాలను పాటించడం విశేషం. ఈ క్షేత్రాన్ని పూర్వం మాయ క్షేత్రమని పిలిచేవారు.

అటు పై దీనికి మాయనాడ్ అని పేరు వచ్చింది. చివరికి వాయనాడ్ గా స్థిరపడిపోయింది. కేరళకు గాడ్స్ ఓన్ కంట్రి అని పేరు రావడం వెనక ఇక్కడి ప్రకృతి అందాల పాత్ర ఎంతో ఉందని చెబుతారు. ఈ నేపథ్యంలో వాయనాడ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...

కురువా ద్వీపం

కురువా ద్వీపం

P.C: You Tube

వాయనాడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక కేంద్రాల్లో కురువా ద్వీపం ముందుంటుంది. కబిని నది ఉపనదులన్నీ కలిసే చోట ఈ కురువా ద్వీపం ఉంటుంది. ఈ ద్వీపం చుట్టూ ఉన్న పచ్చటి అటవీ ప్రాంతం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందుల్లే కేరళ నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఈ ద్వీపంలో అత్యంత అరుదైన పక్షులను,జంతువులను చూడవచ్చు.

చేంబ్రా శిఖరం

చేంబ్రా శిఖరం

P.C: You Tube

వాయనాడ్ లోనే కాకుండా దేశంలోనే అత్యంత అందమైన హిల్ స్టేషన్స్ లలో చేంబ్రా శిఖరం కూడా ఒకటి. ఇక్కడ ట్రెక్కింగ్ కోసం యువత ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ ట్రెక్కింగ్ కొంత కఠినంగా ఉంటుంది. వాయనాడ్ లోనే అత్యంత ఎతైన ఈ చేంబ్రా శిఖరం ప్రాంతంలో ఉదయం పూట ట్రెక్కింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ట్రెక్కింగ్ మార్గంలో అందమైన పక్షులు కూడా కనువిందు చేస్తాయి.

ఎడక్కాల్ కేవ్

ఎడక్కాల్ కేవ్

P.C: You Tube

వయనాడ్ లోని అంబుకుత్తే పర్వతశిఖరాల్లో భాగమైన ఈ ఎడక్కాల్ గుహల పొడవు 96 అండుగులు కాగా, వెడల్పు 22 అడుగులు. ఆదిమ మానవులు ఈ గుహల్లో నివశించినట్లు చెబుతారు. ఇందుకు సంబంధిచిన కొన్ని ఆధారాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. చరిత్రను తెలుసుకోవాలనుకునేవారు, పురావస్తు శాఖతో చేరి పరిశోధనలు చేసేవారు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు.

లక్కిడి

లక్కిడి

P.C: You Tube

వాయనాడ్ లో మరో ప్రముఖ పర్యాటక కేంద్రం లక్కిడి. కనుచూపు మేర పచ్చదనంతో కూడిన పర్వత శిఖరం ఇక్కడి ప్రత్యేకత. అదేవిధంగా అరుదైన పక్షి, జంతువులకు కూడా లక్కిడి నిలయం. ప్రక`తిని ఆరాధించే వారు వారాంతాల్లో ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఇప్పుడిప్పుడే ట్రెక్కింగ్ కోసం యువత ఈ లక్కిడిని ఎంచుకొంటున్నారు.

సోచుప్రా జలపాతం

సోచుప్రా జలపాతం

P.C: You Tube

ఇక్కడ నీళ్లు సుమారు 300 మీటర్ల ఎత్తు నుంచి కిందికి పడుతుంటాయి. ఆ సమయంలో ఆ జలపాతం చేసే సవ్వడి చెవులకు, ఆ పాలనురగల్లాంటి నీటి హొయలు కంటికి ఇంపుగా అనిపిస్తుంది. సోచుప్రా జలపాతం వద్ద రివర్ రాఫ్టింగ్ వంటి జల క్రీడలకు అవకాశం ఉంది. జలపాతం కిందికి పడే చోట ఈత కొట్టడానికి కూడా అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X