» »మహారాష్ట్రలోని టైగర్ రిజర్వ్ గురించి మనకు తెలియని సంగతులు

మహారాష్ట్రలోని టైగర్ రిజర్వ్ గురించి మనకు తెలియని సంగతులు

By: Venkata Karunasri Nalluru

ఒక వైపు పశ్చిమ కనుమల (సహ్యాద్రి శ్రేణులు) మరొకవైపు అరేబియా సముద్రం, గర్భగుడి, ప్రకృతి ప్రేమికులకు మరియు వన్యప్రాణులు కలిగిన మహారాష్ట్ర ఔత్సాహికులకు సంవత్సరం అంతా ప్రయాణించుటకు శుభప్రదమైనది. మహారాష్ట్రలో అనేక జాతీయ పార్కులు మరియు అభయారణ్యాలు కూడా వున్నాయి. వాటిలో ఒకటి నాగ్జిరా పులుల అభయారణ్యం. ఇక్కడ గొప్ప వృక్షజాలం మరియు జంతుజాలంను చూడవచ్చును.

ప్రసిద్ధ వన్యప్రాణుల కలిగిన ప్రదేశాలలో మహారాష్ట్ర ఒకటి. దేశంలోనే ఉత్తమ అభయారణ్యాలు, అనేక జాతీయ పార్కులు మహారాష్ట్రలో కలవు. నాగ్జిరా పులుల సంరక్షణాకేంద్రం మహారాష్ట్రలోని భండారా మరియు గోండా జిల్లాలలో సరిహద్దు వద్ద ఉంది. ఈ రోజున నాగ్జిరా మహారాష్ట్రలో వన్యప్రాణి సంరక్షణాకేంద్రాలలో అగ్రస్థానంలో వుంది.

మహారాష్ట్రలోని నాగ్జిరా పులుల సంరక్షణా కేంద్రం

1. చరిత్ర

1. చరిత్ర

నాగ్జిరా ఒక అటవీ ప్రాంతం. ఒకప్పుడు ఇక్కడ గోండు రాజులు జంతువులను వేటాడేవారు. తరువాత 1970 వ సంవత్సరంలో వన్యప్రాణుల అభయారణ్యంగా దీనిని మార్చారు. 2012 సం లో నాగ్జిరా పులుల అభయారణ్యం కొన్ని ఇతర అటవీ ప్రాంతాలకు విలీనం చేయబడింది.

PC: Grassjewel

2. నాగ్జిరా దేవాలయం

2. నాగ్జిరా దేవాలయం

నాగ్జిరా పేరున రెండు దేవాలయాలు తీసుకోబడింది. అవి స్నేక్ (నాగ్) దేవాలయం మరియు అభయారణ్యం లోపల ఉన్న మహదేవ్ (శివ) దేవాలయాలు.

PC: Arjun Pal 94

3. నాగ్జిరాలో గల జంతువులు

3. నాగ్జిరాలో గల జంతువులు

నాగ్జిరా పులుల అభయారణ్యం అనేక అడవి జంతువులకు నిలయంగా ఉంటోంది. చిన్న భారత పునుగు పిల్లి, జాకాల్, టైగర్స్, స్లోత్ బేర్, చిరుతపులులు, మౌస్ జింక, లేడి, అడవి పిల్లులు, పాముల వంటి సరీసృపాలు, మొసళ్ళు, భారత కోబ్రా, కొండ చిలువలు, పామ్ సివెట్, కుందేళ్ళు, ఏనుగు, మొదలైనవి.

PC: Vijaymp

4. నాగ్జిరా యొక్క వృక్ష జాతులు

4. నాగ్జిరా యొక్క వృక్ష జాతులు

నాగ్జిరాలో గొప్ప జీవవైవిధ్యం వున్న అడవుల రకాలు వున్నాయి. ఇక్కడ పచ్చని అడవులు, గడ్డి భూములు, వెదురు అడవులు, టేకు అడవులు మరియు ఔషధ మొక్కలు చిన్న ప్రదేశాలు చూడవచ్చు.

PC: Pavan Kute

5. నాగ్జిరా సందర్శించడానికి మంచి సమయం

5. నాగ్జిరా సందర్శించడానికి మంచి సమయం

ఫిబ్రవరి నుండి మే నెల వరకు నాగ్జిరా వైల్డ్ లైఫ్ సంక్చురి మరియు టైగర్ రిజర్వ్ సందర్శించడానికి ఉత్తమ సమయం.

PC: KundanRA

6. నాగ్జిరా టైగర్ రిజర్వ్ వద్ద మ్యూజియం

6. నాగ్జిరా టైగర్ రిజర్వ్ వద్ద మ్యూజియం

నాగ్జిరా టైగర్ రిజర్వ్ లో పర్యాటకులు వన్యప్రాణుల గురించి మరింత తెలుసుకోవటానికి సంగ్రహాలయం కూడా వుంది. వివిధ జాతుల జంతువులు గురించి పర్యాటకులు తెలుసుకొనుటకు జంతువులు, పక్షులతో కూడిన నమూనాలు కూడా ఇక్కడ వున్నాయి. నాగ్జిరాలో నివసించే వివిధ జాతుల సీతాకోకచిలుకల సమాచారాన్ని తెలుసుకోవచ్చును.

PC: Grassjewel

7. నాగ్జిరా టైగర్ రిజర్వ్ ఎలా చేరాలి?

7. నాగ్జిరా టైగర్ రిజర్వ్ ఎలా చేరాలి?

నాగ్జిరా టైగర్ రిజర్వ్ నాగ్పూర్ నగరానికి సుమారు 117 కిలోమీటర్ల దూరంలో ఉంది. టైగర్ రిజర్వ్ నాగ్జిరా నుండి 18 కిలోమీటర్ల దూరంలో వున్న సకోలి నుండి చాలా దగ్గరగా వుంది.

రోడ్డు మార్గం: ఎన్ హెచ్ 6 మార్గం ద్వారా సకోలి లేదా గొండియా మీదుగా నాగ్జిరా చేరుకోవచ్చును.

రైలు మార్గం: గోండియా రైల్వే స్టేషన్ నాగ్జిరా టైగర్ రిజర్వ్ సమీపంలోని రైల్వే స్టేషన్.

PC: Varadbansod

Please Wait while comments are loading...