» »పురుషులకు అనుమతి లేని చక్కులతుకవు శ్రీ భగవతి దేవాలయంను సందర్శించండి

పురుషులకు అనుమతి లేని చక్కులతుకవు శ్రీ భగవతి దేవాలయంను సందర్శించండి

By: Venkata Karunasri Nalluru

LATEST: ఆశ్చర్యకరమైన ధ్వజస్తంభం యొక్క రహస్యం మీకు తెలుసా?

సంస్కృతి వారసత్వంగా గల ప్రసిద్ధి చెందిన రాష్ట్రము "కేరళ ". ఇక్కడ దేవాలయాల నిర్మాణం మతపరంగానే కాకుండా చక్కని కళాఖండాలుగా కూడా నిదర్శనాలుగా వున్నాయి. ప్రతి దేవాలయానికి విశదపరిచిన ఒక ఆసక్తికరమైన కథ వుంది.

అలప్పుజ లోని "చక్కులతుకవు శ్రీ భగవతి ఆలయం" కేరళలో గల ఏకైక దేవాలయాలలో ఒకటి. 3000 సంవత్సరాల నాటి ఈ ఆలయంలో "దుర్గ లేదా భగవతి" పూజలందుకుంటుంది. ఈ ఆలయ పునర్నిర్మాణం కొన్ని దశాబ్దాల క్రితం జరిగింది. అప్పటి వరకూ ఆలయ స్థానిక నివాసి యొక్క కుటుంబం దేవాలయమునకు పూజలు నిర్వహించేవారు. కానీ ఆ ప్రాంతంలో ఆ నివాసితుల జాడ తెలియలేదు.

కేరళలోని చక్కులతుకవు శ్రీ భగవతి ఆలయం

PC: Official site

ఆలయ పురాణం :

చక్కులతుకవు ఆలయం హిందూ మత పురాణాలలో గల "దేవి మహాత్మ్యం" గురించి తెలుపుతుంది. "సుంభ మరియు నిసుంభ" అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మ దేవుని కోసం తపస్సు చేసి అద్భుతమైన శక్తులు దక్కించుకుంటారు. బ్రహ్మ ఆ రాక్షసులకు బ్రహ్మాండాలలో పంచభూతాలలో ఎవ్వరి వల్ల మరణం సంభవించదు ఒక్క స్త్రీ వల్ల తప్ప అని వరం ప్రసాదిస్తాడు. ఆ రాక్షసులు అతి గర్వంతో స్త్రీ ఏమీ చేయలేదని తలుస్తారు. ఈ వరం కారణంగా ఆ రాక్షసులు ఇంద్రుడితో సహా అనేక మందిని జయిస్తారు.

ఈ విషాద పరిస్థితిని చూసిన నారద మహర్షి దీనికి ఒక పరిష్కారాన్ని అన్వేషించేందుకు తన తండ్రియైన బ్రహ్మదేవుని కలుస్తారు. బ్రహ్మదేవుడు ఆ రాక్షసులను ఎవ్వరూ ఏమీ చేయలేరని ఒక్క స్త్రీ మాత్రమే సంహరించగలదని చెప్తాడు.

కేరళలోని చక్కులతుకవు శ్రీ భగవతి ఆలయం

PC: Official site

ఈ పురాణం ప్రకారం ఆదిశక్తి మిగిలిన దేవతలను రక్షించి ఆ ఇద్దరు రాక్షసులకు బ్రహ్మ ప్రసాదించిన శక్తులను తిరిగి తీసుకుని ఆ రాక్షసులను సంహరిస్తుంది.

చక్కులతుకవు ఆలయం వద్ద పూజలు చేసే దేవత ఆ ఆదిశక్తి యొక్క మరొక రూపం అని, చాలా శక్తివంతమైన దేవత అని ఇక్కడి నమ్మకం.

స్త్రీల కోసం శబరిమల :

ఈ ఆలయంను ప్రముఖంగా "మహిళా శబరిమల" గా పిలుస్తారు. వేలకొద్దీ మహిళలు ఇక్కడ జరిగే ఉత్సవంలో పాల్గొంటారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం వృశ్చిక మాసంలో ప్రముఖంగా నవంబర్-డిసెంబర్ నెలల్లో జరుగుతుంది.

కేరళలోని చక్కులతుకవు శ్రీ భగవతి ఆలయం

PC: Official site

నారీ పూజ ఇక్కడ జరుపుకునే మరో ప్రధాన పండుగ. ఈ పండుగ రోజున పురుషులకి ఆలయ ప్రాంగణంలో అనుమతి లేదు. వేదాలు మరియు ఇతర హిందూ మత గ్రంధములలో మహిళలకు అత్యున్నత అధికారం ఇవ్వబడినది. ఈ పండుగ ప్రధానంగా మహిళల గౌరవం మరియు వారికి అత్యున్నత స్థానానికి సంబంధించినది. ఈ పండుగ భాగంగా ప్రతి స్త్రీలో దేవత యొక్క దైవత్వానికి గుర్తుగా వారి పాదములను కడిగి సాంప్రదాయబద్ధంగా పూజిస్తారు. ఇది వారికి ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుంది.

చక్కులతుకవు ఆలయం ఎలా చేరాలి?

ఈ చక్కులతుకవు ఆలయం అలప్పుజ మరియు పతనంతిట్ట జిల్లాల సరిహద్దులో గల "నీరట్టుపురం" వద్ద కలదు. ఆలయం తిరువల్ల నుండి కేవలం 15 నిమిషాల దూరంలో ఉంది.

Please Wait while comments are loading...