Search
  • Follow NativePlanet
Share
» » భిన్నసంస్కృతుల సమ్మేళనం.. పాండిచ్చేరి

భిన్నసంస్కృతుల సమ్మేళనం.. పాండిచ్చేరి

భిన్నసంస్కృతుల సమ్మేళనం.. పాండిచ్చేరి!

https://www.google.co.in/search?q=A+blend+of+diverse+cultures+..+Pondicherry+native+planet&tbm=isch&ved=2ahUKEwic_N7L_LH4AhUoyKACHcXiB3MQ2-cCegQIABAA&oq=A+blend+of+diverse+cultures+..+Pondicherry+native+planet&gs_lcp=CgNpbWcQA1CSCFiyMWDUNWgAcAB4AIABygSIAcERkgEJOS40LjQtMS4xmAEAoAEBqgELZ3dzLXdpei1pbWfAAQE&sclient=img&ei=ICKrYpzsC6iQg8UPxcWfmAc&bih=664&biw=1538#imgrc=Eml_PLTyzqsWDM

విభిన్నమైన పర్యాటక అనుభవాలను కోరుకునే సందర్శకులకు పాండిచ్చేరి ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. చూపరుల మనస్సులు దోచే ప్రోమనేడ్, పారడైస్, సేరెనిటి, ఆరోవిల్లె ఈ నాలుగింటి తీరప్రాంత అందాలు ప్రకృతి ప్రేమికులకు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఎగసిపడే అలల సవ్వడులతోపాటు శరీరాన్నితాకే చల్లని పిల్లగాలుల గిలిగింతలు అదనపు ఆనందాన్ని చేరువచేస్తాయి. మరెందుకు ఆలస్యం పాండిచ్చేరి పర్యాటక అందాలను మనసారా ఆస్వాదిద్దాం రండి.

విభిన్న జాతీయతలు, సంస్కృతులు కలిగిన ఒక అందమైన ప్రాంతం ఆరోవిల్లె నగరం. ఇక్కడ సుమారు 50 దేశాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్నారు. పాండిచ్చేరి నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఆరోవిల్లె నగరం ఉంది. అంతేకాదు, ఈ ప్రాంతం సూర్యోదయ నగరంగా ప్రసిద్ధి పొందింది. అందువల్ల దీనిని విశ్వ పట్టణంగా పరిగణిస్తారు. ది మదర్ గా ఎంతో ప్రసిద్ధి పొందిన అల్ప స్థాపించిన ఆరోవిల్లె నగరాన్ని 1968లో అరబిందో సొసైటీ వారు నిర్మించారు. అనేక దేశాలకు చెందిన స్త్రీ, పురుషులు సామరస్యంతో జీవించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో నగరాన్ని నిర్మించారు. ఇక్కడి గ్రీన్ బెల్ట్ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది. ఇక్కడికి సమీపంలోని తీరప్రాంతం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. దీన్ని ప్రత్యేక సంస్కృతి, వారసత్వ కట్టడాలకు చిరునామాగా చెప్పుకోవచ్చు. మాతృమందిర్, గాంధీ విగ్రహం, ఫ్రెంచి యుద్ధ స్మారకం, జోసెఫ్ ఫ్రాంకోయిస్ డుప్లెక్స్ విగ్రహం, గౌబెర్డ్ అవెన్యూలో ఉన్న జోన్ ఆఫ్ ఆర్క్ పాలరాయి విగ్రహం వంటి అనేక స్మారక చిహ్నాలకు పాండిచ్చేరి పుట్టినిల్లు. పాండిచ్చేరి మ్యూజియం, జవహర్ టాయ్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్, ఒస్టేరి మాగాణులు, భారతిదాసన్ మ్యూజియం, నేషనల్ పార్కు వంటి అద్భుత ప్రదేశాలు పర్యాటకుల మనస్సులను దోచుకుంటాయి. హస్తకళలు, వస్త్రాలు, రాళ్ళు, చెక్క శిల్పాలు, చాపలు, కుండలు వంటి వివిధ వస్తువులు కొత్తదనాన్ని సంతరించుకుని షాపింగ్ పై మక్కువ గల పర్యాటకులను ఆనందంలో విహరింపజేస్తాయి.

అరుదైన కళాఖండాల నిలయం

https://www.google.co.in/search?q=A+blend+of+diverse+cultures+..+Pondicherry+native+planet&tbm=isch&ved=2ahUKEwic_N7L_LH4AhUoyKACHcXiB3MQ2-cCegQIABAA&oq=A+blend+of+diverse+cultures+..+Pondicherry+native+planet&gs_lcp=CgNpbWcQA1CSCFiyMWDUNWgAcAB4AIABygSIAcERkgEJOS40LjQtMS4xmAEAoAEBqgELZ3dzLXdpei1pbWfAAQE&sclient=img&ei=ICKrYpzsC6iQg8UPxcWfmAc&bih=664&biw=1538#imgrc=KzkHEEnjxS6h5M

పురాతన కాలానికి చెందిన అరుదైన కళాఖండాలకు నిలయం పాండిచ్చేరి మ్యూజియం పేరుగాంచింది. ఇక్కడ చోళ, పల్లవుల వంశాలకు చెందిన అరుదైన కాంస్య, రాతి శిల్పాలను చూడొచ్చు. అలాగే భారతదేశంలో ఫ్రెంచివారి వలస పాలనకు చెందిన విషయాలను, పాండిచ్చేరి గత కాలపు వలస పాలన విధానాలను తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే, పాండిచ్చేరిలో మొదటి ప్రపంచ యుద్ధంలో వీరమరణం పొందిన ఫ్రెంచి సైనికుల జ్ఞాపకార్ధం యుద్ధ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. దీనిని 1971లో నిర్మించారు. ఏటా జులై 14వ తేదీన బాస్టిల్లే రోజు ఈ స్మారకాన్ని దీపాలతో అలంకరించి, మరణించిన సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. బర్ట్ అవెన్యూలో ఉన్న ఈ స్మారకాన్ని సందర్శనార్థం రోజంతా తెరచే ఉంచుతారు.

పూర్వవైభవం అయినప్పటికీ

https://www.google.co.in/search?q=A+blend+of+diverse+cultures+..+Pondicherry+native+planet&tbm=isch&ved=2ahUKEwic_N7L_LH4AhUoyKACHcXiB3MQ2-cCegQIABAA&oq=A+blend+of+diverse+cultures+..+Pondicherry+native+planet&gs_lcp=CgNpbWcQA1CSCFiyMWDUNWgAcAB4AIABygSIAcERkgEJOS40LjQtMS4xmAEAoAEBqgELZ3dzLXdpei1pbWfAAQE&sclient=img&ei=ICKrYpzsC6iQg8UPxcWfmAc&bih=664&biw=1538#imgrc=E2z7yqr6-hS5SM

ప్రోమనెడ్ బీచ్గా పేరుపొందిన పాండిచ్చేరి బీచ్ ఇక్కడి మరో చారిత్రక తీరం. అయితే, అరియకుప్పం వద్ద కొత్త ఓడరేవు నిర్మాణం వల్ల సముద్రం కోతకు గురికావడంతో ఈ అందమైన బీచ్ చాలా వరకు నడకకు, ఈతకు పనికి రాకుండా పగిలిన రాళ్ళ గుట్టలు, బండరాళ్ళ గోడలా కనిపిస్తుంది. ఆ గోడవైపున లా ఫాక్స్ ప్లేజ్ అనే కృత్రిమ బీచ్ను నిర్మించారు. సాయంత్ర సమయంలో బీచ్ వెంబడి వాహనాలను అనుమతించరు. అందుచేత సముద్రం పక్కగా నడుస్తూ.తీర ప్రాంత అందాలను పర్యాటకులు ఆస్వాదించవచ్చు. ఇది ఒకటిన్నర కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X