Search
  • Follow NativePlanet
Share
» »నైనాదేవి దేవాలయం చూద్దాం రండి !

నైనాదేవి దేవాలయం చూద్దాం రండి !

నైనిటాల్ ను భారతదేశ సరస్సుల జిల్లా, మూడు ఋషుల సరస్సు, గా కూడా పేర్కొంటారు. నైనిటాల్ ప్రదేశం హిమాలయా పర్వతాలలో అందమైన సరస్సులు కల కుమావొన్ కొండల శ్రేణులలో కలదు. పురాణ గాధల మేరకు సతీ దేవి యొక్క ఎడమ కన్ను ఇక్కడ పడి కన్ను ఆకారం కల సరస్సు ఏర్పడి నదని కూడా చెపుతారు.

ఈ నమ్మిక కారణంగానే ఈ ప్రదేశం ను వేలాది హిందూ యాత్రికులు దర్శించి నైని మాతకు పూజలు చేస్తారు. మాత నైని కొరకు ఇక్కడ ఒక అందమైన టెంపుల్ నిర్మించారు. 1880 సంవత్సరంలో ఇక్కడ మంచు కొండలు భారీ ఎత్తున విరిగిపడి పురాతన దేవాలయం ధ్వంసం కాగా దాని స్థానంలో ఒక నూతన టెంపుల్ నిర్మించారు.

ఇక్కడ నైనా దేవి మాత్రమే కాక, మాత సతి ని శక్తి దేవి గా కూడా కొలుస్తారు. ఇక్కడ ఇంకనూ గణేశ మరియు మాత కాళీ దేవి గుడులు కూడా కలవు. టెంపుల్ ప్రవేశంలో ఒక పెద్ద రావి చెట్టు కలదు. ఈ ప్రదేశం ను ఒక 'శక్తి పీఠం 'గా పూజిస్తారు.

అద్భుత శివ లింగాలు - ఆరాధ్య దైవాలు

ప్రదేశం పూర్తిగా ఆధ్యాత్మిక ప్రభావం కలిగి వుంటుంది. ప్రతి వారూ ఒక్కసారి దర్శించి ఆనందించ దగినది. ఇక్కడ వసతి కొరకు అనేక హోటళ్ళు కలవు. సమీపంలోని అనేక ఆకర్షణలు చూడవచ్చు.

నైని సరస్సు

Photo Courtesy: Abhishek gaur70

నైని సరస్సు నైనిటాల్ లో ప్రధాన ఆకర్షణ. పర్యాటకులు ఇక్కడ బోటు విహారం వంటి అనేక నీటి సంబంధిత క్రీడలు ఆడవచ్చు. ఈ ప్రాంతంలో ఒక పోస్ట్ ఆఫీస్, బస్సు స్టాండ్, తక్సి స్టాండ్, రైల్వే రిజర్వేషన్ కౌంటర్, కొన్ని షాపింగ్ సెంటర్ లు కూడా కలవు.

హనుమాన్ ఘరి

Photo Courtesy: Nainital Tourism

హనుమాన్ ఘరి అంటే ఆంజనేయుడి దేవాలయం. ఇది నైనిటాల్ నుండి 3 కి. మీ. ల దూరంలో కలదు. ఈ టెంపుల్ సముద్ర మట్టానికి 1951 మీ. ల ఎత్తున కలదు. ఇక్కడే శీతల దేవి టెంపుల్ మరియు లీలా సహా బాపు ఆశ్రమం కూడా చూడవచ్చు.

ఖూర్పతాల్

Photo Courtesy: Enjoymusic nainital

ఖూర్పతాల్ అనేది ఒక చిన్న గ్రామం. చేపలు పట్టే క్రీడలకు ఇది ప్రసిద్ధి. నైనిటాల్ నుండి ఇది 10 కి. మీ. ల దూరంలో కలదు. అందమైన ఈ గ్రామం సముద్ర మట్టానికి 1635 మీ. ల ఎత్తున కలదు. ఫిషింగ్ ఆనందంచేందుకు అందమైన ఒక సరస్సు కూడా ఇక్కడ కలదు.

టిఫిన్ టాప్

Photo Courtesy: Nainital Tourism Tiffin Top

టిఫిన్ టాప్ అనేది ఒక పిక్నిక్ స్పాట్. నైనిటాల్ కు 4 కి. మీ. ల దూరంలో కలదు. దీనినే డొరొతి సీట్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 7520 మే. ల ఎత్తున ఆయర్పట్ట శిఖరం పై కలదు. ఇక్కడ నుండి పర్యాటకులు అద్భుత హిమాలయ పర్వత శ్రేణుల అందాలను చూడవచ్చు. టవున్ నుండి హైకింగ్ లో ఇక్కడకు చేరవచ్చు.

నైనిటాల్ జూ

నైనా దేవి దేవాలయం చూద్దాం రండి

Photo Courtesy: Jöshua Barnett

నైనిటాల్ జూ ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. సముద్ర మట్టానికి ఇది 2100 మీ. ల ఎత్తున కలదు. ఈ జూ లో వివిధ రకాల జంతువులు కలవు. ఈ జూ సోమవారాలు మరియు అన్ని జాతీయ సెలవుల దినాలలో మూసి వేసి వుంటుంది. బస్సు స్టాప్ నుండి ఈ జూ ఒక కి. మీ. దూరంలో మాత్రమే కలదు.

అందాల గనులు - పర్వత నగరాలు

ఎలా చేరాలి ?
నైనిటాల్ కు సమీప విమానాశ్రయం పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ ఇది నైనిటాల్ కు 55 కి. మీ. ల దూరం. ఢిల్లీ విమానాశ్రయం నుండి ఇక్కడకు తరచుగా విమాన సేవలు కలవు. దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలకు కలుపబడి వుంది. నైనిటాల్ కు సమీప రైలు స్టేషన్ కాథ్ గోడం రైల్వే స్టేషన్.ఇది నైనిటాల్ నుండి 23 కి. మీ. ల దూరంలో కలదు. ఇక్కడ నుండి లుక్నౌ, ఆగ్రా, బరైలీ లకు డైరెక్ట్ ట్రైన్ లు కలవు. పర్యాటకులుప్రభుత్వ బస్సు లు, ప్రైవేటు వాహనాలలో నైనిటాల్ చేరవచ్చు.

నైనిటాల్ మరిన్ని ఆకర్షణలకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X