Search
  • Follow NativePlanet
Share
» » సౌత్ ఇండియాలో ఎ టు జడ్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు !

సౌత్ ఇండియాలో ఎ టు జడ్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు !

దక్షిణ భారత దేశం ఇండియాలో ఎన్నో ఉత్తమ పర్యాటక ప్రదేశాలు కలిగి వుంది. మనోహరమైన టెంపుల్స్, విశ్రాన్తినివ్వగల బీచ్ లు, కొబ్బరి చెట్ల తోటలు, కేనాల్స్, గంభీరమైన కొండలు, మొదలైనవి కల అనేక ప్రసిద్ధ టూరిస్ట్ ప్రదేశాలు కలవు. వివిధ అభిరుచులు కల వివిధ పర్యాటకులకు వారి ఇష్టానికి తగినట్లు ఈ ప్రదేశాలు త్రుప్తి పరుస్తాయి. నేటివ్ ప్లానెట్ ఈ ప్రదేశాలను ఇంగ్లీష్ అక్షర వరుస క్రమంలో అంటే ఎ మొదలుకొనే జడ్ వరకు గల కొన్ని ప్రదేశాలాను అందిస్తోంది. చదివి పర్యటించి ఆనందించండి. అండమాన్ అండ్ నికోబార్ ద్వీపాల నుండి శబరిమల మరియు అల్లెప్పి బ్యాక్ వాటర్స్ వంటివి ఎన్నో ప్రదేశాలు సౌత్ ఇండియా లోని ఉత్తమ ప్రదేశాలుగా చెప్పబడేవి ఇక్కడ ఇవ్వబడ్డాయి.

అల్లెప్పి

అల్లెప్పి

చారిత్రక బ్యాక్ వాటర్స్ ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినవి. వీటిలో ఒక హౌస్ బోటు ప్రయాణం చదివే కంటే చేస్తే మీకు జీవిత కాల మధురానుభూతి.

బాదామి గుహలు

బాదామి గుహలు

ఉత్తర కర్నాటక రాష్ట్రంలో కల బాదామి గుహలు ఎంతో ప్రసిద్ధి. బాదామి పట్టణం ఒకప్పుడు బాదామి చాళుక్య రాజుల రాజధానిగా వుండేది. ఈ గుహ లకు ఇరువైపులా ఇసుక రాతి కొండలు కలవు

Pic credit: beontheroad.com

చోళ టెంపుల్స్

చోళ టెంపుల్స్

సుమారు 9 - 12 శతాబ్దాల మధ్య నిర్మించిన ఈ ప్రపంచ వారసత్వ నిర్మాణాలు చోళుల శిల్ప కళా తృష్ణ కు నిదర్శనాలు. ఇవి ఆకాలంనాటి శిల్ప నిర్మాణ నేర్పులను వెల్లడిస్తాయి.

Pic Credit: Pugaipadangal

చార్మినార్

చార్మినార్

హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఒక ల్యాండ్ మార్క్. ఇది ఒక స్మారక చిహ్నం మరియు మసీద్ కూడాను. దీనిని క్రి. శ. 1591 సంవత్సరంలో కుతుబ్ షాహి వంశ పాలకులు నిర్మించారు.

Pic Credit: ramnath bhat

ఎమరాల్ద్ ఐలాండ్ అఫ్ అండమాన్ అండ్ నికోబార్

ఎమరాల్ద్ ఐలాండ్ అఫ్ అండమాన్ అండ్ నికోబార్

ఒకప్పుడు ఈ ద్వీపాన్ని కాలాపానీ అంటే నల్లని నీరు కల ద్వీపం అని భయపడే వారు. అక్కడ ఒక చెరసాల వుండేది. కాని నేడు ఈ ద్వీపం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ కల బ్రిటిష్ నిర్మాణాలు, బీచ్ లు ఆకర్షణలు గా మారాయి.

గోల్కొండ

గోల్కొండ

ప్రపంచ ప్రసిద్ధ కోహినూర్ వజ్రం గోల్కొండ కోట సమీపంలో లభించినది. కుతుబ్ షాహి వంశాపాలనలో 1518 - 1687 కాలంలో గోల్కొండ కోట ఎంతో వైభవోపేతంగా ఈ రాజుల పాలనలో కలదు. ఇక్కడ సాయంత్రాలు నిర్వహించే లైట్ అండ్ సౌండ్ ప్రోగ్రాం మిస్ కాకండి.

Pic credit: Wiki Commons

హంపి

హంపి

హంపి మరొక వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ ప్రదేశం పర్యాటకులు విశ్రాంతి గా చూడాలి. ఇక్కడ విజయనగర సామ్రాజ్య పాలనలో పేరొందిన నిర్మాణాల శిధిలాలను నేటికీ చూసి ఆనందించవచ్చు.

ఇడుక్కి

ఇడుక్కి

కేరళ లోని అతి సుందరమైన ఈ జిల్లాలో మున్నార్, మరయూర్, తట్టేకాద్ బర్డ్ సంక్చురి, ఎరావికులం వైల్డ్ లైఫ్ సాన్క్చురి లు గొప్ప పర్యాటక ప్రదేశాలు.

కన్యాకుమారి

కన్యాకుమారి

కన్యాకుమారి దక్షిణ దేశ చివరి భాగం. ఇక్కడ హిందూ మహా సముద్రం బంగాళా ఖాతం తో కలుస్తుంది. ఈ ప్రదేశం సూర్యోదయ, సూర్యాస్తామయాలకు ప్రసిద్ధి. Pic Credit: Wiki Commons

లక్ష ద్వీప్

లక్ష ద్వీప్

లక్ష ద్వీప్ ఐలాండ్స్ లో మొత్తంగా 36 ద్వీపాలు కలవు. అందమైన ఈ చిన్న చిన్న ద్వీపాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తప్పక చూడదగినవి.

Pic credit: beontheroad.com

మహాబలిపురం

మహాబలిపురం

మహాబలిపురం ను మామల్లాపురం అని కూడా అంటారు. 7 వ శతాబ్దం కు చెందిన ఈ పోర్ట్ సిటీ వరల్డ్ హెరిటేజ్ సైట్ . ఇక్కడ రాక్ కట్ టెంపుల్స్, బీచ్ లు , రాక కట్ గుహలు హలవు. ఇక్కడ కల కృష్ణ మండపం, అయిదు రధాలు, వరాహ మండపం, తీర దేవాలయం ప్రసిద్ధ ప్రదేశాలు. చోళ మండల ఆర్టిస్ట్ విలేజ్ లో అనేక పెయింటింగ్ లు, హస్త కళలు చూడవచ్చు.

నీలగిరి మౌంటెన్ రైల్వే

నీలగిరి మౌంటెన్ రైల్వే

నీలగిరి మౌంటెన్ రైల్వే ఒక హెరిటేజ్ సైట్ . ఇది 1899 లో మొదలైంది. ఈ రైలు నీలగిరి హిల్స్ లోని కొండ ప్రాంతాలు, తేయాకు తోటలు, అటవీ ప్రదేశాలు ప్రయాణిస్తుంది.

ఊటీ

ఊటీ

పర్వత యువ రాణిగా చెప్పబడే ఊటీ కొండలు దక్షిణ ఇండియా లో తప్పక చూడదగినవి. కర్నాటక లోని బిజి నగరాలనుండి ఊటీ ప్రదేశం విముక్తి కలిగించి పర్యాటకులను ఆనందింప చేస్తుంది.

పాండిచేరి

పాండిచేరి

పాండిచేరి ని పుదుచేరి అని కూడా పిలుస్తారు. తమిళనాడు లో ఇది ఒక ఫ్రెంచ్ నిర్మాణాలు కల ప్రదేశం. తమిళనాడులో ఒక ఫ్రెంచ్ దేశం గా దీనిని మనం చూసి ఆనందించవచ్చు. 17 వ శతాబ్దంలో ఫ్రెంచ్ వారు ఇక్కడ వారి స్థావరాలు ఏర్పరచుకున్నారు.

రామేశ్వరం

రామేశ్వరం

రామేశ్వరం తమిళ్ నడులోని ఒక ప్రశాంతమైన టవున్. మీ చార్ ధం యాత్ర లో ఈ ప్రదేశం తప్పక చూడ దగినది. ఈ ప్రదేశంలో శ్రీరాముడు తాను రావణుడిని వదిన్చేందుకు గాను లంకకు చేరేందుకు ఒక బ్రిడ్జి తన వానరసైన్యంతో నిర్మించాడు.

శబరిమల

శబరిమల

ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్, జనవరి నెలలు వచ్చాయంటే చాలు శబరిమల ఆయప్ప స్వామీ దీక్షలు, ఉత్సవాలతో సౌత్ ఇండియా మారు మోగి పోతుంది. స్వామీ అయ్యప్ప దర్శనానికి భక్తులు లక్షల సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి తరలి శబరిమల కొండకు వెళతారు. వేల్లెముందు వీరు 41 రోజుల ఉపవాస దీక్షలను ఆచరిస్తారు.

తిరుపతి

తిరుపతి

తిరుపతి ఇండియాలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరుపతి కొండలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి టెంపుల్ లక్ష్లలాది భక్తులను ఆకర్షిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ మహా విష్ణువు అవతారంగా కొలుస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X