Search
  • Follow NativePlanet
Share
» »ఎర్ర కోట గురించి ఈ నిజాలు మీకు తెలుసా ?

ఎర్ర కోట గురించి ఈ నిజాలు మీకు తెలుసా ?

ఈ కోటలోగల ప్రధాన భవన సముదాయము : దీవాన్ ఎ ఆమ్,దీవాన్ ఎ ఖాస్,నూరే బెహిష్త్,జనానా, మోతీ మస్జిద్హ, యాత్ బక్ష్ బాగ్.

By Mohammad

ఎర్ర కోట ఢిల్లీలో కల ఒక కోట. దీనిని ప్రభుత్వ భవనముగా వాడుచున్నారు. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతారు. భారతదేశము తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు మొదటిసారిగా జాతీయ పతాకాన్ని దీనిపైనే ఎగురవేశారు. దీని అసలు పేరు ఖిలా ఎ ముబారక్. దీనిలో రాజకుటుంబం నివసించేది. ఇది యమునా నది తీరాన ఉంది.

ఈ కోటలోగల ప్రధాన భవన సముదాయము : దీవాన్ ఎ ఆమ్,దీవాన్ ఎ ఖాస్,నూరే బెహిష్త్,జనానా, మోతీ మస్జిద్హ, యాత్ బక్ష్ బాగ్.

ఎర్రకోటపై రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం

ఎర్ర కోటపై రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం

చిత్రకృప : Dennis Jarvis

భారతదేశ అద్భుత కట్టడాల్లో ఒకటి... ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు... మన ఏడు వింతల్లో ఒకటి... స్వాతంత్య్ర సంబరాలకు చిహ్నం... ఢిల్లీలోని ఎర్రకోట!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారని తెలుసుగా? టీవీల్లో ప్రత్యక్షంగా ప్రసారం చేసే ఆ సంబరాలు జరిగేదెక్కడో తెలుసా? ఎర్రకోటలో. అక్కడి నుంచే ప్రధాని మనందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఎర్రకోట వివరాలేంటో తెలుసుకుందామా?

దివాన్ - ఐ- ఆమ్

దివాన్ - ఐ- ఆమ్

చిత్రకృప : deivis

'ఇలలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే... ఇదే...' అనే అర్థాన్నిచ్చే వాక్యాలు ఎర్రకోటలోని సభాస్థలి గోడలపై బంగారు అక్షరాలతో మెరుస్తూ కనిపిస్తాయి. పర్షియా కవి అమీర్‌ ఖుస్రో రాసిన కవితలోని ఈ పంక్తులను అక్కడ చెక్కించింది మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌. ఎర్రకోట నమూనాను రూపొందించి, దగ్గరుండి కట్టించింది కూడా షాజహానే.

ఎర్ర చలువరాతితో అద్భుతంగా నిర్మించిన ఈ కోట వెనుక 360 ఏళ్ల చరిత్ర ఉంది. దీని నిర్మాణాన్ని 1638లో మొదలు పెడితే 1648లో పూర్తయింది. యమునా నది ఒడ్డున, మొత్తం 120 ఎకరాల సువిశాల స్థలంలో ఈ కోటను పర్షియా నుంచి రప్పించిన నిపుణులతో కట్టించారు.

మోతీ మసీద్

మోతీ మసీద్

చిత్రకృప : Russ Bowling

కోటలో చక్రవర్తి సభలు జరిపే మండపాన్ని దివాన్‌-ఇ-ఆమ్‌ అంటారు. యాభై అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పుతో ఉండే ఈ సభాస్థలి పైకప్పు, గోడలను వెండి బంగారాలతో తాపడం చేశారు. ఇందులోనే ప్రపంచ ప్రఖ్యాతమైన నెమలి సింహాసనం ఉండేది. ఫ్రెంచి స్వర్ణకారుడు మణులు, వజ్రాలను పొదిగి చేసిన దీనిపైనే చక్రవర్తి ఆసీనుడై సభను నడిపేవాడు.

కోటలోని ఉద్యానవనాలు, పాలరాయి మండపాలు, నీటిని చిమ్మే ఫౌంటెన్లు అద్భుతంగా ఉంటాయి. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ కోట మౌన సాక్షి. 1657లో షాజహాన్‌ నలుగురు కుమారుల వారసత్వ పోరును ఇది చూసింది. సోదరులను చంపించి షాజహాన్‌ను ఖైదు చేసి జౌరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించడం దీనికి తెలుసు. తర్వాత 50 ఏళ్లలో 9 మంది రాజుల పాలనకు ఇదే కేంద్రం.

నక్క్యర్ ఖానా

నక్క్యర్ ఖానా

చిత్రకృప : Hans A. Rosbach

పర్షియా రాజు నాదిర్‌షా 1739లో దండెత్తి వచ్చి అప్పటి రాజు మహ్మద్‌షాను ఓడించి అనేక సంపదలతో పాటు నెమలి సింహాసనాన్ని తరలించుకు పోవడాన్ని ఇది గమనించింది. బ్రిటిష్‌ సైనికులు 1857లో ఎర్రకోటను వశపరుచుకున్నారు. స్వాతంత్య్ర పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇక్కడ జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి ఆ సంప్రదాయం కొనసాగుతోంది.

దీని ప్రహరీగోడ రెండు కిలోమీటర్ల పొడవుగా, దాదాపు 90 అడుగులకు పైగా ఎత్తుతో ఉంటుంది. ఇందులో ముంతాజ్‌ మహల్‌ మ్యూజియం, మోతీమజీద్‌, రంగ్‌మహల్‌ ఎంతో ఆకట్టుకుంటాయి. 'బ్లడ్‌ పెయింటింగ్స్‌' మ్యూజియం, పురావస్తు మ్యూజియం, యుద్ధ స్మారక ప్రదర్శన శాలలు కూడా ఎర్రకోటలో ఉన్నాయి.

రెడ్ ఫోర్ట్ లోపలి భవనాలు

రెడ్ ఫోర్ట్ లోపలి భవనాలు

చిత్రకృప : Gryffindor

2007 లో యునెస్కో వారిచే ప్రపంచవారసత్వ సంపదగా గురించినబడింది ఈ ఎర్రకోట. ప్రతీ సాయంత్రం ఇక్కడ ఎర్రకోట చరిత్రను వివరించే సౌండ్ అండ్ లైట్ షో జరుగుతుంది.

ఇది కూడా చదవండి : ఢిల్లీ లో అద్భుతమైన మొఘల్ స్మారక కట్టడాలు !

ఎర్రకోట సందర్శనవేళలు మరియు టికెట్ ధరలు

ఎర్రకోటను సందర్శించేవారు ఉదయం 9:30 కల్లా ఇక్కడకు చేరుకుంటే సరి. సాయంత్రం 4:30 వరకు ఎర్రకోట తెరిచే ఉంచుతారు. అన్నట్టు లోనికి వెళ్లాలంటే టికెట్ తీసుకోవాలండీ! టికెట్ ధరలు భారతీయులకు 10 రూపాయలు, విదేశీయులకు 150 రూపాయలు గా ఉంటుంది. లైట్ అండ్ సౌండ్ షో కు మరో 50 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకోవాలి.

బంగారు వర్ణంలో మెరిసిపోతున్న రెడ్ ఫోర్ట్

బంగారు వర్ణంలో మెరిసిపోతున్న రెడ్ ఫోర్ట్

చిత్రకృప : Kartik Singh

ఎర్రకోట ఎలా చేరుకోవాలి ?

ఎర్రకోట సమీప మెట్రో స్టేషన్ : చాందినీ చౌక్ మెట్రో స్టేషన్. ఈ స్టేషన్ రెడ్ ఫోర్ట్ కు కిలోమీటర్ దూరంలో కలదు. స్టేషన్ బయట ఆటో రిక్షా ఎక్కి ఎర్రకోట సులభంగా చేరుకోవచ్చు. ఢిల్లీ చేరుకోవడం ఎలా ?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X