Search
  • Follow NativePlanet
Share
» »ఉల్లాస పరిచే ఊటీ రైలు ప్రయాణం !

ఉల్లాస పరిచే ఊటీ రైలు ప్రయాణం !

రైలు ప్రయాణాలు ఎపుడూ మనకు ఇష్టమే. ఎంతో ఆనందిస్తాం. ట్రైన్ లో ప్రయాణం అంటే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. కిటికీ పక్కనే కూర్చుని పరిసరాలను తనివి తీరా ఆనందిస్తూ, కబుర్లు చెపుతూ ప్రయాణిస్తాం. ట్రైన్ జర్నీ కంటే సుఖవంతమైన ప్రయాణం మరొకటి లేదు. మనం ఎన్నో రైళ్ళను చూసాం. పాసెంజర్ రైళ్ళు, ఎక్స్ప్రెస్స్ రైళ్ళు మరింత వేగవంతమైన రైళ్ళు ఇంతవరకూ ట్రావెల్ చేసి వుంటాం. అయితే, ఇపుడు మనం ఒక స్లో ట్రైన్ 'నిదానంగా నడిచే ట్రైన్ 'గురించి తెలుసుకుందాం. అదే మెట్టు పలయం నుండి ఊటీ వెళ్ళే టాయ్ ట్రైన్. ఈ ట్రైన్ ఎంతో నిదానంగా చుట్టుపక్కల పరిసరాలను చూపుతూ నడుస్తుంది. ఈ దృశ్యాలు నిజంగా చూడ దగినవే.
మెట్టుపలయం - ఊటీ ట్రైన్
మెట్టుపలయం - ఊటీ ట్రైన్ ను నీలగిరి టాయ్ ట్రైన్ అని కూడా అంటారు. ఈ ట్రైన్ లో ప్రయాణం ఒకపక్క జర్నీ ఆనందంతో మునిగిపోతూ మరోపక్క ప్రకృతి అందాలను కూడా చూసి ఆనందించ వచ్చు. సౌత్ ఇండియాలో ఈ ట్రైన్ ఒక ప్రసిద్ధ ఆకర్షణ. ఇండియాలో ఇంకనూ సిమ్లా మరియు డార్ జీలింగ్ లలో ఇటువంటి ట్రైన్ లు కలవు. ఈ ప్రయాణం మెట్టు పలయం లో మొదలై ఊటీ వరకు సాగుతుంది. మార్గ మద్యం లోని నీలగిరి కొండల అందాలను కూడా చూపుతుంది.

ఈ ట్రైన్ మొత్తంగా 16 సొరంగాలు, 250 బ్రిడ్జి లు 20 8 వంపులు ప్రయాణిస్తుంది. ఈ రైల్వే ట్రాక్ ఆసియా లోని రైల్వే ట్రాక్ లలో అత్యంత నిట్ట నిలువైనది.ఇతర రైల్వే ట్రాక్ ల వలే కాక, 'ఎక్స్ ' క్లాసు స్టీమ్ రాక్ లోకోమోటివ్ కలిగి వుంటుంది. మరి మనలను ఊటీ కి తీసుకు వెళ్ళే టాయ్ ట్రైన్ జర్నీ విశేషాలను పరిశీలిద్దాం.

ఉల్లాస పరచే ఊటీ రైలు ప్రయాణం

టాయ్ ట్రైన్ ఆనందాలు !

టాయ్ ట్రైన్ ఆనందాలు !

ఈ రైలు మెట్టుపలయం లో ఉదయం 7.10 గం. జర్నీ మొదలు పెడుతుంది. ఈ స్టేషన్ చెన్నై కు సుమారు 496 కి. మీ. ల దూరంలోను, కోయంబత్తూర్ కు 35 కి. మీ.ల దూరంలోను, పాలక్కాడ్ కు 8 5 కి. మీ. ల దూరం మరియు బెంగుళూరు కు 36 2 కి. మీ. ల దూరంలోను వుంటుంది.

టాయ్ ట్రైన్ ఆనందాలు !

టాయ్ ట్రైన్ ఆనందాలు !

మెట్టుపలయం వదలిన ఈ ట్రైన్ ఏటవాలు కొండలపై చాలా దూరం ప్రయాణిస్తుంది. ఇతర ఎలక్ట్రిక్ లేదా డీసెల్ ట్రైన్ ఇంజిన్ ల వలే కాకుండా ఈ ట్రైన్ కు ఎక్స్ క్లాస్ స్టీమ్ ఇంజిన్ లోకోమోటివ్ లు ఉపయోగిస్తారు.

 టాయ్ ట్రైన్ ఆనందాలు !.

టాయ్ ట్రైన్ ఆనందాలు !.

రైలు సొరంగాల గుండా, వంతెనల పైనా ప్రయాణిస్తూ వుంటే, ఎంత బాగుంటుంది. అది కూడా నిట్ట నిలువుగా గల కొండలపై. ఈ జర్నీ మెట్టుపలయం నుండి ఊటీ కి గల 46 కి. మీ. ల దూరం గంటకు ౩౩ కి. మీ. లు చొప్పున మాత్రమే ప్రయాణిస్తుంది.

టాయ్ ట్రైన్ ఆనందాలు !

టాయ్ ట్రైన్ ఆనందాలు !

ఈ ఏటవాలు రైలు ప్రయాణంలో ట్రైన్ చక్రాలు, ట్రాక్ కు ఫిక్స్ చేయబడి వుంటాయి. ఈ పద్ధతి 19 వ శతాబ్దంలో ఉపయోగించిన రైళ్లకు ఉపయోగించేవారు.

 టాయ్ ట్రైన్ ఆనందాలు !

టాయ్ ట్రైన్ ఆనందాలు !

సుమారు 8.45 గం. లకు ట్రైన్ హిల్ గ్రోవ్ స్టేషన్ చేరుతుంది. ఈ హిల్ గ్రోవ్ స్టేషన్ లో కొద్ది సేపు ఆగుతుంది. ప్రయాణికులు కు స్నాక్స్ వంటివి కూడా ఇస్తారు.

టాయ్ ట్రైన్ ఆనందాలు !

టాయ్ ట్రైన్ ఆనందాలు !

ట్రైన్ కతేరి స్టేషన్ చేరే సరికి ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 5070 అడుగుల ఎత్తులో వుంటుంది. ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా వుంటాయి. పాసెంజర్ ట్రైన్ లకు ఇక్కడ స్టాప్ లేదు కనుక స్లో గా వెళుతూనే మీరు ప్రకృతి ఆనందాలను ఆస్వాదించవచ్చు.

 టాయ్ ట్రైన్ ఆనందాలు !

టాయ్ ట్రైన్ ఆనందాలు !

ఈ ట్రైన్ కూనూర్ స్టేషన్ కు ఉదయం 10.30 గం.లకు చేరుతుంది. ఇది ప్రధాన స్టేషన్ లలో ఒకటి. కనుక ట్రైన్ కొద్ది సేపు ఇక్కడ ఆగుతుంది. ఇక్కడి తో రాక్ సిస్టం ముగిసి పోయి, ట్రైన్ ఇక్కడ నుండి డీజిల్ ఇంజిన్ కు మారుతుంది.

టాయ్ ట్రైన్ ఆనందాలు !

టాయ్ ట్రైన్ ఆనందాలు !

సుమారుగా ఉ. 10.47 గం. లకు ట్రైన్ వెల్లింగ్టన్ స్టేషన్ కు చేరుతుంది. ఇక ఇపుడు మీరు సముద్ర మట్టానికి 5804 అడుగుల ఎత్తున వుంటారు. ఇక్కడ నుండి ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా వుంటాయి.

టాయ్ ట్రైన్ ఆనందాలు !

టాయ్ ట్రైన్ ఆనందాలు !

సరిగ్గా 11.19 గం లకు ట్రైన్ కెట్టి రైల్వే స్టేషన్ చేరుతుంది. ఇక్కడ నుండి ఊటీ 8 కి. మీ. ల దూరం మాత్రమే.

 టాయ్ ట్రైన్ ఆనందాలు !

టాయ్ ట్రైన్ ఆనందాలు !

కెట్టి రైల్వే స్టేషన్ నుండి ట్రైన్ లవ్ డేల్ సుమారు 11.39 గం. లకు చేరుతుంది. ఇక్కడ నుండి ఊటీ 4 కి. మీ. కల దూరం మాత్రమే. బహుశా ప్రయాణం ఆనందంగా సాగి పోయింది అనుకుందాం.

 టాయ్ ట్రైన్ ఆనందాలు !

టాయ్ ట్రైన్ ఆనందాలు !

ఇక చివరగా వచ్చే స్టేషన్ ఉదగమండలం రైల్వే స్టేషన్ లేదా అందరకూ బాగా తెలిసిన ఊటీ రైల్వే స్టేషన్. సమయం ఇప్పటికి 12 గం. మధ్యాహ్నం. కన్నులకు కట్టినట్లుగా కల ఈ వర్ణన బహుశ మీరు ఆనందించే వుంటారు. మరి మీ టాయ్ ట్రైన్ రైడ్ ఎపుడు మొదలు పెడతారు ?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X