
అడుగడుగునా మృతువు తొంగి చూస్తుంది. అక్కడికి వెళ్లడానికి ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. నాలుగు దిక్కులా దట్టమైన అడవులు ఉంటాయి. లోయలు, జలపాతాలు ఎంత అందంగా ఉంటాయో అంతే భయంకరంగా ఉంటాయి. అయినా మోక్షం కోరుతూ ప్రజలు తరతరాలుగా ఆ నాగ ద్వారం చూడాలని వెళుతూ ఉన్నారు. ఏడాదిలో కేవలం 10 రోజులు మాత్రమే ఈ గుడి ద్వారాలు భక్తులకోసం తెరుస్తారు. ఆ పరదిరోజుల పాటు లక్షల సంఖ్యలో భక్తులు ఆ దేవతలను సందర్శించుకొని పునీతులవుతారు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ దగ్గర్లోని పంచమార్హి అనే గుట్ట పై ఉంటుంది. కేవలం పదిరోజులు మాత్రమే ఈ నాగద్వారం తెరుచుకొంటుందని భక్తులు తరతరాలుగా నమ్ముతున్నారు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
ఇక్కడ ఉన్నటు వంటి శివాలయం అత్యంత ప్రాచీనమైనది, పవిత్రమైనదని ప్రజలు భావిస్తారు. కేవలం శ్రావణ మాసంలో మాత్రమే ఈ దేవాలయం ద్వారాలు తెరుచుకొంటాయి.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
ఈ పది రోజుల్లో సుమారు 10 లక్షల మంది ఈ నాగ ద్వారద యాత్రలో పాల్గొంటారు. ఈ పదిరోజుల పాటు అక్కడి పాములు ఎవరికీ ఏ హాని చేయవు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
ఈ పది రోజుల్లో సుమారు 10 లక్షల మంది ఈ నాగ ద్వారద యాత్రలో పాల్గొంటారు. ఈ పదిరోజుల పాటు అక్కడి పాములు ఎవరికీ ఏ హాని చేయవు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
అంతేకాకుండా అక్కడ ఉన్న క్రూరమ`గాలు కూడా ఎవరికీ హాని చేయవు. అయితే అటు పై మాత్రం ఆ సర్పాలు, జంతువులు మనుషుల పై దాడులు చేస్తాయి.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
అందువల్లే ఈ దేవాలయం ద్వారం తెరిచినప్పుడు మాత్రమే ప్రజలు ఇటు వైపు వెలుతూ ఉంటారు. మిగిలిన సమయంలో అటు వైపు కన్నెత్తి కూడా చూడరు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
భోపాల్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో పంచమర్హి ఉంటుంది. ఇది ఒక గుహాలయం. ఈ దేవాలయం చేరుకోవడానికి భక్తులు అనేక వ్యయప్రయాసాలకు ఓర్చుకోవాల్సి ఉంటుంది.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
శ్రావణ మాసంలో స్థానిక పంచాగాన్ని అనుసరించి ఈ దేవాలయాన్ని కేవలం 10 రోజులు మాత్రమే తెరుస్తారు. అప్పుడు మాత్రమే భక్తులను ఈ దేవాలయం లోపలికి అనుమతిస్తారు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
ఆకాశాన్ని తాకే పర్వత శిఖరాలను, జాలువారే జలపాతాలను దాటుకొంటూ ముందుకు పోవడం సాహసంతో కూడిన ప్రయాణమే. అందువల్లే ఈ పర్యటన అత్యంత కఠినమైనదని చెప్పవచ్చు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
కొంచెం ఏమరుపాటు మన ప్రాణాలనే హరించివేస్తుంది. ట్రెక్కింగ్ పై ఆసక్తి ఉన్నవారికి ఈ యాత్ర సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
దట్టమైన అడవిలో సుమారు 20 కిలోమీటర్ల మేర మన నడవాల్సి ఉంటుంది. ఇందుకు దాదాపు 18 గంటలు పడుతుందంటే మార్గం ఎంత కఠినంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
దారిపొడుగునా విషపు ముల్లులు, సర్పాలు ఉంటాయి. వాటిని దాటుకొంటూ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అందుకే 18 గంటల సమయం పడుతుంది.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
నాగపూర్ చుట్టు పక్కల ఉన్నవారికి ఇక్కడ ఉన్న దేవత కులదైవం. వారంతా ఇక్కడ ఉన్న శేషనాగు తన తల పై ఈ భూ మండలాన్ని మోస్తూ ఉందని భావిస్తారు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
నాగపూర్ చుట్టు పక్కల ఉన్నవారికి ఇక్కడ ఉన్న దేవత కులదైవం. వారంతా ఇక్కడ ఉన్న శేషనాగు తన తల పై ఈ భూ మండలాన్ని మోస్తూ ఉందని భావిస్తారు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
ఇక్కడ ఆ పదిరోజుల పాటు విశేష యాగం చేసి అందులో నుంచి ఉద్భవించిన భూడిదను తమ పొలాల్లో చల్లుతారు. దీనివల్ల పంటలు బాగా పండుతాయని వారు నమ్ముతారు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
అంతేకాకుండా తమ పంటలను నాగుపాములు నాశనం చేయవని వారు నమ్ముతారు. వాటి నుంచి తమకు ఎటువంటి హానికలుగదని చెబుతారు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
ఈ ప్రాంతం నుంచి నాగలోకానికి దారి ఉందని వారు గట్టిగా నమ్ముతారు. అందువల్లే ఇక్కడ శ్రావణమాసంలో తప్ప మిగిలిన రోజుల్లో వేల సంఖ్యలో పాములు కనిపిస్తాయని స్థానికులు చెబుతారు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
ఇక్కడ పాలనురుగులా జాలువారే జలపాతంనీటిలో స్నానం చేసి ఆ నీటిని తాగడం వల్ల ఏడాది పాటు ఎటువంటి అనారోగ్యానికి గురికామని నమ్ముతారు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
ఇక్కడ ఉన్న శివుడిని మన్నదాల బాబా అని అంటారు. భక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చి మన:స్ఫూర్తిగా ఆ పరమశివుడిని కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుతాయని చెబుతారు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
అందువల్లే స్థానికులే కాకుండా విదేశీయులు కూడా ఈ శ్రావణ మాసంలో ఈ నాగలోక ద్వారం వద్ద ఉన్న శివుడిని దర్శనం చేసుకోవడనాకి వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
పది రోజుల పాటు ఈ పంచ మర్హి వద్ద తాత్కాలిక దుకాణాలు వెలుస్తాయి. ఇక్కడికి దగ్గర్లో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం సాంచి స్థూపం. దీనిని 3వ శతాబ్దంలో నిర్మించారు.

శ్రావణ మాసం, పంచమర్హి
P.C: You Tube
భోపాల్ కు భారత దేశంలో చాలా నగరాల నుంచి బస్సు, రైలు సర్వీసులు ఉన్నాయి. శ్రావణ మాసంలో ఈ పంచమర్హి లోని నాగలోక ద్వారం గుహ తెరిచే చోటుకు ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, వాహనాలు తిరుగుతూ ఉంటాయి