Search
  • Follow NativePlanet
Share
» »లఠ్ మార్ హోలీ: మగాళ్ళను పిచ్చ కొట్టుడు కొట్టడమే అక్కడ హోళీ ప్రత్యేకత..!

లఠ్ మార్ హోలీ: మగాళ్ళను పిచ్చ కొట్టుడు కొట్టడమే అక్కడ హోళీ ప్రత్యేకత..!

మన ఇండియాలో హోళీ పండగకు బోలెడంత ప్రాధాన్యం ఇస్తారు. హోళీ అంటే రంగుల పండుగ, పిల్ల, పెద్ద తేడాలేకుండా ఆనందకేళీలు...రంగునీళ్ళ పరవళ్ళలో..ప్రతి ఒక్కరు సంబరాలు జరుపుకునే ఈ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. గతంలో నార్త్ ఇండియాకు మాత్రమే పరిమితమైన ఈ పండుగ ఇప్పుడు దక్షణ భారత దేశంలో కూడా చాలా ఉత్సాహంగా జరుపుకోడం ప్రారంభించారు. దేశంలో ప్రతీ వీధి, ప్రతీ ప్రాంతం రంగులతో నిండిపోయే ఏకైక వేడుక ఇదే. అయితే హోళీ జరపుకోవడంలో ఒక్కోక్క ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ హోళీని వారం రోజులు పాటు జరుపుకుంటారు. మరి ఈ సంవత్సరంలో హోళీ ఉత్సవం మార్చి 20 నుండి 26 వరకు జరుపుకుంటారు.

హోళీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. ఈ విధానం హోళీ ముందురోజు చలిమంటలు వేయడానికి కూడా పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పండుగ యొక్క ప్రధాన ఘట్టం మండుచున్న హోళీ మంటలు లేదా హోళీక. అంతేకాక కొందరి ఉద్దేశ్యం ప్రకారం రాక్షసి హోళీక, హోళక మరియు రాక్షసుల దహనం లేదా మదన్‌ను దహనం అని సంప్రదాయ హోళీ మంటల మూలాన్ని తెలుపుతాయి. హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదున్ని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సంప్రదాయ భోగి మంటలను నిర్వహిస్తారు.

ఎలా చేస్తారంటే విజయదశమి రోజున రావణుడిని బొమ్మను దహనం చేసినట్లుగా ఈ పండుగ రోజు కూడా బొమ్మను దహనం చేస్తారు, ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో రాక్షసుల పరాక్రమం హోళిక దహనంతో అంతమయిందని దీని అర్థం, బ్రజ ప్రాంతాలలో, కర్రలను కుప్పగా పోగు చేసి ప్రజలు ఎక్కువగా తిరిగే కూడళ్ళలో లేదా వీధి చివరలో బొమ్మలను దహనం చేస్తారు. సంప్రదాయమైన పూజలు అయిన తరువాత ప్రజలు మంటలకు ప్రదక్షిణ లు చేస్తారు. తరువాత రోజు ఈ విజయాన్ని దుల్‍‌హెండి రోజుగా ఘనంగా జరపుకొంటారు. హోళీని దేశం మొత్తం ఘనంగా జరుపుకుంటారు. అయితే ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఒక ప్రాంతంలో రంగులు చల్లుకుంటే, ఇంకొక ప్రదేశంలో ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో చాలా వింతగా జరుపుకుంటారు. మరి ఆ వింత విశేషాలేంటో మనం తెలుసుకుందాం...

ఉత్తర ప్రదేశ్ లోని మథురకు దగ్గరలో

ఉత్తర ప్రదేశ్ లోని మథురకు దగ్గరలో

ఉత్తర ప్రదేశ్ లోని మథురకు దగ్గరలో ఉన్న బర్సన అనే ఊళ్ళో హోళీని వెరైటీగా జరుపుకుంటారు. అక్కడ హోళీ పండుగ రోజున మగవాళ్ళని లాఠీలతో పిచ్చ కొట్టుడు కొడతారన్న మాట. దీన్నే నవారు లఠ్ మార్ హోళీ అని ముద్దుగా పిలుచుకుంటారు. లఠ్ అంటే లాటీ అని అర్థం. దీనికి ఒక ప్రత్యేక కారణదముంది.

పురాణ కాలంలో చిలిపి క్రిష్ణుడు

పురాణ కాలంలో చిలిపి క్రిష్ణుడు

పురాణ కాలంలో చిలిపి క్రిష్ణుడు తనకెంతో ఇష్టమైన రాధ గ్రామానికి వచ్చి, అక్కడ ఆమెను ఆమె స్నేహితులను ఆటపట్టించారట. దీన్ని తప్పుగా భావించిన ఆ గ్రామంలోని మహిళలు, కర్రలతో క్రిష్ణయ్యను వెంట తరిమారట. అప్పటి నుండి ఈ గ్రామంలో ఈ పండగను ఇలా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రక్కనే ఉన్న క్రిష్ణుడి గ్రామం

ప్రక్కనే ఉన్న క్రిష్ణుడి గ్రామం

ప్రక్కనే ఉన్న క్రిష్ణుడి గ్రామం, నంద్ గావ్ నుండి మగవారు హోళీ ఆడటానికి ఈ గ్రామం రావడం, నహుషారుగా హోళీ పాటలు పాడటం, ఆడవారిని రెచ్చగొట్టడం, వారిచేతిల లఠ్ మార్(లాఠీ)దెబ్బలు తినడం ఆనవాయితీ అయింది. కాకపోతే, ఆడవారు కొట్టే దెబ్బలను వారు ఢాలు వంటి దానిని ఉపయోగించి తప్పించుకోవచ్చు. ఆడవారు కూడా వారిని ఢాలు మీదనే ఎక్కువగా కొడతారు.

మరి ఈ సందడి అంతా ఒక నెల రోజుల ముందు నుండే

మరి ఈ సందడి అంతా ఒక నెల రోజుల ముందు నుండే

మరి ఈ సందడి అంతా ఒక నెల రోజుల ముందు నుండే ప్రారంభం అవుతుంది. అత్తలు తమ కోడళ్ళకు ఆ నెల రోజులు మంచి పౌష్టికాహారం పెడతారటజ బాగా కొట్టడానికి. ఇక్కడ మగవాళ్ళను కొట్టడం అనేది వారిని గాయపరచడానికి కాదు, వారి పట్ట తమ ప్రేమను చెప్పడానికి మాత్రమే అని చెబుతా గ్రామస్తులు.

ఇలాంటిదే మరో హోళీ హర్యానాలో జరుగుతుంది.

ఇలాంటిదే మరో హోళీ హర్యానాలో జరుగుతుంది.

ఇలాంటిదే మరో హోళీ హర్యానాలో జరుగుతుంది. దానికి పేరు కరోర్ మార్ హోళీ. ఇక్కడ వదినలు (మరదళ్ళను) మరిదిని (బావలు) పిచ్చకొట్టుడు కొట్టడం ఇక్కడ ప్రత్యేకత. సంవత్సరమంతా వారు తమ మీద వేసిన జోకులకూ, టీజింగ్ లకు , ఆరోజున కసి తీర్చుకుంటారన్నమాట.

అనాదిగా వస్తున్న సాంప్రదాయం

అనాదిగా వస్తున్న సాంప్రదాయం

ఇది కేవలం కుటుంబమంతా తమ విభేదాలను మర్చిపోయి, కలిసి మెలసి జీవించడానికి చేసుకునే పండగ అని, ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయమనీ చెబుతున్నారు. విశేషమేమిటంటే, లాఠ్ మార్ హోళీలా ఇక్కడ మగవారు ఢాలు లాంటివి తెచ్చుకోరు. కానీ ఆడవారు కూడా కేవలం దెబ్బలు తగలకుండా కొట్టడం అనే కాన్సెప్ట్ ను ఫాలో అవ్వరు. ఏది దొరకితే అది అడ్డుపెట్టుకుని తప్పించుకోవాలి, లేదా తన్నులు తినాలి.

ఈ సంవత్సరంలో హోళీ ఎప్పుడు వచ్చింది

ఈ సంవత్సరంలో హోళీ ఎప్పుడు వచ్చింది

హిందూ క్యాలెండర్ ప్రకారం పాల్గున మాసంలో 9వ రోజున జరుపుకుంటారు. బర్సనా సందర్శరించడానికి ఇదే మంచి సమయం. హోళీ సాధారణంగా ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో జరుపుకుంటారు. ఉత్తర ప్రదేశ్ లో బర్సనాలో హోళీ పండుగ కోసం నగర శివార్లలో ఖాళీ స్థలం కూడా ఏర్పాటు చేస్తుంది.

ఎలా వెళ్ళాలి

ఎలా వెళ్ళాలి

కోసీ కలాన్ సమీప రైల్వే స్టేషన్ నుండి 10 కి.మీల దూరంలో ఉంది. అయితే 50 కిలోమీటర్ల దూరంలో ఉండే మథుర వద్ద సూపర్ ఫాస్ట్ రైల్వేస్టేషన్ ఉంది. కోసి కలాన్ మరియు మథుర నార్త్ సెంట్రల్ రైల్వే యొక్క బ్రాండ్ గేజ్ రైల్వే లైన్ ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X